అరటి

వెర్రి తెగులు (బన్చీ టాప్ వైరస్)

Bunchy Top Virus

వైరస్

క్లుప్తంగా

  • ముదురు- అక్కుపచ్చ చారలు ఆకు కాడలపై మరియు ఈనెలపై, ఆకుల కింది భాగంలో కనిపిస్తాయి.
  • మోర్స్ కోడ్ నమూనా ( చిన్న ముదురు ఆకుపచ్చ చుక్కలు మరియు విడి విడిగా) కూడా ఆకుల ఈనెలపైన కనిపిస్తాయి.
  • వ్యాధి సోకిన ఆకుల ఎదుగుదల తక్కువగా ఉంటుంది, సన్నగా మరియు గట్టిగా ఉంటూ ముడుచుకొని ఉంటాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

అరటి

లక్షణాలు

మొక్కల అన్ని ఎదుగుదల దశలలో ఈ వైరస్ మొక్కల అన్ని భాగాలపై వ్యాపిస్తాయి. ముదురు- అక్కుపచ్చ చారలు ఆకు కాడలు మరియు ఈనెలపైన ఆకుల కింది పక్క కనిపిస్తాయి. తరువాత దశల్లో ఆకుల లామినే పై కూడా చిన్న ఆకుపచ్చ చుక్కలు కనిపిస్తాయి. తెగులు సోకిన ఆకుల ఎదుగుదల తక్కువగా ఉంటుంది, సన్నగా మరియు గట్టిగా ఉండి ముడుచుకొని ఉంటాయి. తెగులు అధికంగా ఉన్న దశలో కొత్త ఆకులు ఈ తెగులు యొక్క తీవ్ర లక్షణాలను కనబరుస్తాయి. చిన్నచిన్న పాలిపోయిన పచ్చని లేదా పసుపు రంగు ఆకులు ఒక బన్ఛీ టాప్ లాగ ఏర్పడతాయి. మొత్తంమీద మొక్కల ఎదుగుదల తగ్గిపోయి మొక్క కొమ్మలను కానీ పండ్లను కానీ ఉత్పత్తి చేయవు. పండ్లు రూపు మారి చిన్నగా తయారవుతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులు తొలి దశలోనే కనుగొంటే మొక్కలకు సబ్బు నీరు లేదా క్రిమి నాశినులు కలిగిన సబ్బులు పిచికారీ చేసి ఈ పురుగుల జనాభాను నియంత్రించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే జీవ చికిత్సలు కలసిన నివారణ చర్యలు సమన్వయ పద్దతులు వాడటం మంచిది. ఈ వైరల్ వ్యాధులకు ఎటువంటి ప్రత్యక్ష చికిత్స లేదు. సైపర్మేత్రిన్ ఎసిటమిడ్, క్లొర్ఫెరిఫోస్ లేదా సంబంధిత క్రిమి నాశినులు వాడి ఈ పురుగుల జనాభాను నియంత్రించవచ్చు. కోరోసిస్ లేదా క్రిమి నాశినులు వాడి ఈ పురుగుల్ని చంపవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ తెగులు మొక్క నుండి మొక్క కి లేదా పొలాల మధ్య సోకే అరటి పెంకు పురుగుల వల్ల వ్యాపిస్తుంది. దూరపు ప్రదేశాలకు ఈ తెగులు మొక్క పదార్థాలు విస్తరిస్తుంది. ఈ వైరస్ కు అల్లం, హెలికాన మరియు టారో వంటివి అతిధి మొక్కలుగా ఉపయోగపడుతుంది. ఇది కనిపించటానికి కలిగే సమయాన్ని బట్టి అరటి రకాలను వర్గీకరించవచ్చు. మొక్కలు దీని బారినుండి కోలుకొని బయటపడలేవు. తెగులు సోకిన విత్తనాల వల్ల కలిగే వ్యాధి అధిక నష్టం కలిగిస్తుంది. ఈ లక్షణాలు వసంత కాలం మరియు వెచ్చటి వాతావరణంలో అధికం ఉంటాయి.


నివారణా చర్యలు

  • ఆరోగ్యంగా ఉన్న మొక్కలనే ఉపయోగించండి.
  • మొక్కలను ఎల్లపుడు కనిపెట్టుకొని వుండండి.
  • మరియు తెగులు సోకిన మొక్కలను గుర్తించండి.
  • తెగులు సోకిన అరటి మొక్కలను తొలగించి, వాటిని ఎండబెట్టి పాతి పెట్టండి.
  • ప్రత్యామ్నాయ అతిధి మొక్కలైన అల్లం, హెలికాని మరియు టారో వంటి మొక్కలను తొలగించండి.
  • అరటి పంట లేని బఫర్ ప్రాంతాలను ప్లాంటేషన్స్ మధ్యలో తయారు చేయండి.
  • అరటి మొక్కలను ఇతర ప్రాంతాలకు రవాణా చేయకూడదు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి