అరటి

అరటి బ్రాక్ట్ మొజాయిక్ వైరస్

BBrMV

వైరస్

క్లుప్తంగా

  • చిన్న ఆకుల పైన ఎరుపు-గోధుమ రంగు మొజాయిక్ నమూనా కనిపిస్తాయి.
  • ఆకుపచ్చ లేదా ఎరుపు-గోధుమ ఆకారం లో మచ్చలు మరియు చారలు ఆకు అసారాలా పై మరియు పండ్ల గెలల కొమ్మ పైన కనిపిస్తాయి.
  • కాండాల అంతర్గత టిష్యూలు రంగు కోల్పోతాయి.
  • గెలలు మరియు పండ్లు ఆకారం కోల్పోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

అరటి

లక్షణాలు

చిన్న ఆకుల పైన ఎరుపు-గోధుమ రంగు మొజాయిక్ నమూనా కనిపిస్తాయి. ఆకుపచ్చ లేదా ఎరుపు-గోధుమ ఆకారం లో మచ్చలు మరియు చారలు ఆకు అసారాలా పై మరియు పండ్ల గెలల కొమ్మ పైన కనిపిస్తాయి. కాండాల అంతర్గత టిష్యూలు రంగు కోల్పోతాయి. గెలలు మరియు పండ్లు ఆకారం కోల్పోతాయి. పిల్ల మొక్కల్లో పసుపు లేదా ఎరుపు గోధుమ రంగు మచ్చలు మరియు చారలు కాడలపై కనిపిస్తాయి. అప్పుడపుడు ఇవి కాండాల పై మరియు పండ్ల పై కూడా కనిపిస్తాయి. వైరస్ చాల వేగంగా పాకి పండ్ల తిగుబడి మరియు నాణ్యత పై ప్రభావం చూపుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

వెర్టిసిల్లీయం వంటి జీవ నియంత్రణ ఫంగల్ ఏజెంట్ ను వాడి పెంకు పురుగుల జనాభా తగ్గించవచ్చు. ఈ పురుగుల సంఖ్య తక్కువగా ఉన్నపుడు పురుగుల మందు సబ్బులు కూడా వాడవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులును నిరోధించడానికి ఎటువంటి మందులు అందుబాటులో లేవు. కానీ కొన్ని రకాల పురుగులమందులు ( సైప్ర్మేత్రిన్, ఎసిటామిడ్, క్లొర్ఫైరిఫాస్) వాడి ఈ పురుగుల జనాభాను కొంతవరకు తగ్గించవచ్చు. కలుపు సంహారకాలు వాడి కూడా ఈ తెగులు సోకిన అరటి చెట్లను లేదా తీసేసిన చెట్లనుండి వస్తున్న కొత్తగా వస్తున్న పిలకలను నాశనం చేయవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు అరటి మొక్కల పై వివిధ దశల్లో దాడి చేసే వైరస్ వల్ల కలుగుతాయి. ఇది వివిధ రకాల పెంకు పురుగుల వల్ల వ్యాపిస్తుంది. మొక్కలను తింటున్నప్పుడు వచ్చే వైరస్ కొద్దికాలం మాత్రం ఉంటుంది . తెగ్గులు సోకిన మొక్కల పదార్థాలను ఒక పొలం నుండి ఇంకొక పొలంలోకి తీసుకెళ్లడం కూడా దీని వ్యాప్తికి ఒక కారణం. అరటి పువ్వుపై కనిపించే మొజాయిక్ లక్షణాల వల్ల దీనికి ఈ పేరు వచ్చింది.


నివారణా చర్యలు

  • తెగులు రహిత విత్తనాలు మాత్రమే వాడాలి.
  • క్రమం తప్పకుండా తెగులు లక్షణాల కోసం పంటను పరిశీలించాలి.
  • వేరే పొల్లాలో వాడిన పరికరాలను శుభ్రంగా ఉంచాలి.
  • తెగులు లక్షణాలు కలిగిన మొక్కలను తీసివేసి నాశనం చేయాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి