Banana Streak Virus
వైరస్
తెగులు లక్షణాలు వైరస్ రకం లేదా వైరస్ జనాభా, మొక్కల రకం మరియు వాతావరణాన్ని బట్టి ఉంటాయి. ఆకుల మధ్య భాగం నుండి అంచుల వరకు నిరంతరంగా లేదా అతుకులుగా చారలు కనిపిస్తాయి. తరువాత ఈ చారలు గోధుమ లేదా నల్లటి రంగులోకి మారి పసుపు రంగు బోడుపులు లేదా కన్ను ఆకారంతో ఉంటాయి. అప్పుడప్పుడు కాండముయొక్క అంతర్గత టిస్యూలు కూడా ప్రభావితం అవుతాయి. ఈ లక్షణాలు సహజంగా తక్కువ ఉష్ణోగ్రతల్లో కనిపిస్తాయి. మొత్తం ఆకులన్నీ ప్రభావితం అవ్వవు కానీ మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది మరియు పండ్ల పరిమాణం కూడా తగ్గిపోతుంది.
పారాసిటోయ్డ్ వాస్ప్, కందిరీగలు వంటి జీవ నియంత్రణ ఏజెంట్లు వాడి వీటిని నియంత్రించ వచ్చు. వీటి జనాభా తక్కువగా వున్నప్పుడు తేలికగా ఉండే మినరల్ ఆయిల్ లేదా వేప సారం ఆకుల పై పిచికారీ చేయడంవలన కూడా వీటి జనాభాను తగ్గించవచ్చు.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ వైరస్ కు ఎటువంటి రసాయన చికిత్స లేదు. పెంకు పురుగుల పైన మైనపు తొడుగు ఉండడం వలన వీటిని చంపటం కష్టం. డెల్టా మెత్రిన్ వంటి పురుగు మందులను వాడి ఈ మీలీ బగ్ ను నియంత్రించవచ్చు.
ఈ తెగులు సహజంగా కొన్ని వైరస్ ల కలయిక వల్ల ఏర్పడుతుంది. మొక్కల్లో వున్న వైరస్ కణాల సంఖ్యను బట్టి ఈ తెగులు యొక్క లక్షణాలు ఉంటాయి. ఉష్ణోగ్రతలు మరియు వాతావరణ పరిస్థితులు బట్టి ఈ వైరస్ యొక్క ప్రభావం మారుతుంది. ఈ వైరస్ మొక్క నుండి మొక్కకి లేదా పొలం నుండి పొలానికి కొన్ని రకాల పెంకు పురుగుల వలన సోకుతుంది. వ్యాధి సోకిన మొక్కలు లేదా విత్తనాలు వాడటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. ఇది మట్టిలో ఉండే వైరస్ కాదు అందువలన పరికరాల వల్ల కలిగే దెబ్బలతో మొక్కలకు సోకదు. అరటి రకాల్లో ఇది ఒక ప్రపంచవ్యాఫ్త సమస్య. ఇది మొక్కల ఎదుగుదల, పండ్ల దిగుబడి మరియు నాణ్యత పై ప్రభావం చూపుతుంది.