కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

పల్లాకు తెగులు

MYMV

వైరస్

క్లుప్తంగా

  • ఆకుల పైన అపసవ్యంగా, పసుపు-ఆకుపచ్చ మచ్చలు కనిపిస్తాయి- నలిగిపోయినట్టు కనిపిస్తుంది.
  • గాయాలు పెద్దవై ముదురు గోధుమ రంగులోకి మారతాయి.
  • తెగులు సోకిన మొక్కలు తక్కువ సంఖ్యలో, కొన్నిసార్లు పైకి వంకరగా తిరిగి వుండే.
  • చిన్న కాయలను ఉత్పత్తి చేస్తాయి.
  • ఎదుగుదల కుంగిపోయింది.
  • విత్తనాల నాణ్యత మరియు పరిమాణం తగ్గిపోతుంది.


కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

లక్షణాలు

లేత ఆకులు మొత్తం పాలిపోయినట్లు అయిపోయి (క్లోరోటిక్) క్రిందకు ముడుచుకు పోతాయి లేదా తెల్లని కాగితం లాగ మారిపోవచ్చు. పాత ఆకుల పైన చెదిరిన పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఇవి తరువాత అపసవ్యంగా ఉన్న ఆకుపచ్చ మరియు పసుపు అతుకుల లాగా కనిపిస్తాయి. పచ్చని ప్రాంతం కొద్దిగా ఉబ్బెత్తుగా కనిపించి ఆకులు నలిగినా రూపాన్ని ఇస్తుంది. మచ్చలు పెద్దగా అయ్యి ఒకదానితో మరొకటి కలిసిపోయి చనిపోవడం ప్రారంభమౌతుంది( నెక్రోసిస్)తెగులు సోకిన మొక్కల ఎదుగుదల దెబ్బతింటుంది. ఇవి తక్కువ మొత్తంలో పూలు మరియు కాయలను ఉత్పత్తి చేస్తాయి. వీటి కాయలు చిన్నగా, సన్నగా మరియు పైకి ముడుచుకొని ఉంటాయి. వీటిలో గింజలు కూడా చాల తక్కువగా ఉంటాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులును నివారించడానికి ఎటువంటి జీవ నియంత్రణ పద్ధతులు లేవు. కానీ వేప నూనె లాంటి మొక్కల సారాన్ని ఈ తెల్ల దోమ తెగులును తగ్గించడానికి మరియు దిగుబడిని పెంచడానికి వాడవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవసంబంధమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సైపర్ మెత్రిన్, డెల్టా మెత్రిన్, లేదా డైమిథోయేట్ వంటివి ఆకులపై పిచికారీ చేయడం వల్ల కూడా తెల్ల దోమ జనాభాను నియంత్రించవచ్చు. ఈ తెగులును విస్తరింపచేసే వాహకాలను తగ్గించటానికి సరిహద్దులో వేసిన మొక్కలకు (మొక్కజొన్న, జొన్న, రాగి) క్రిమి సంహారక మందులను వాడొచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ వైరస్ బేమిసియా టబాసి అనే తెల్ల దోమల వల్ల సంక్రమిస్తుంది. విత్తనం ద్వారా సంక్రమణ వీలుపడదు. ఈ వ్యాధి ఆసియా లోని అనేక దేశాల్లో సంభవిస్తుంది మరియు ఆస్ట్రేలియాలో కూడా కనబడుతుంది. ఆకుల పైన పసుపు రంగు అతుకులు మొక్కల దిగుబడిని తగ్గిస్తాయి. వెచ్చని ఉష్ణోగ్రతలు మరియు అధిక తేమ ఈ తెగులు ఎదుగుదలకు అనుకూలంగా ఉంటుంది. పల్లాకు తెగులు సంక్రమణ, దిగుబడి లో 100% నష్టాలని కలిగిస్తుంది. పెసర కంటే మినుములని పల్లాకు తెగులు ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే తెగులు నిరోధక విత్తనాలు నాటాలి.
  • జొన్న, మొక్కజొన్న లేదా సజ్జ పంటలను మీ పొలం చుట్టూ సరిహద్దు మొక్కల లాగా నాటాలి.
  • క్రమం తప్పకుండా పొలాన్ని వ్యాధి లక్షణాల కోసం పరీక్షిస్తూ ప్రభావితమైన మొక్కలను తీసివేయాలి.
  • కీటకాలను పట్టుకోవడానికి పసుపు రంగు జిగురు అట్టలు వాడాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి