సోయాబీన్

సోయాబీన్ మొజాయిక్ వైరస్

SMV

వైరస్

క్లుప్తంగా

  • ఆకులపై ముదురు పచ్చ మచ్చలు మొజాయిక్ మాదిరిగా ఏర్పడుతాయి.
  • ఆకులు ముడుచుకు పోయి ఉంటాయి.
  • మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది మరియు కాయల సంఖ్య తగ్గుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

సోయాబీన్

లక్షణాలు

మొక్కలు ఏ సమయంలో అయినా ఈ తెగలుకు గురి కావచ్చు. ప్రాధమిక దశలో అప్పుడే పెరుగుతున్న ఆకుల పైన లేత మరియు ముదురు ఆకుపచ్చ మొజాయిక్ నమూనా కనపడుతుంది. తరువాత ఈనెల వెంబడి తీవ్రమైన మచ్చలుగా మారి ముడుచుకు పోతాయి. దీని వలన మొక్కల ఎదుగుదల తగ్గుతుంది, కాయల సంఖ్య మరియు పరిమాణం కూడా తగ్గిపోతుంది. చల్లని వాతావరణంలో ఈ తెగులు లక్షణాలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. 32°C కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఈ లక్షణాలు కనిపించవు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి, ఈ SMV తెగలుకు ప్రత్యామ్న్యాయ నివారణ పద్ధతులు మాకు తెలియవు. ఈ తెగులుతో పోరాడగల ప్రత్యామ్న్యాయ నివారణ పద్ధతులు ఏమైనా మీకు తెలిస్తే దయచేసి మమల్ని సంప్రదించండి. మీ నుండి వినడానికి ఎదురుచూస్తూ ఉంటాము.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వైరల్ వ్యాధులకు రసాయన చికిత్స సాధ్యం కాదు. పెంకు పురుగుల్ని నియంత్రించటానికి పురుగుల మందులు అంతగా ఏమి పని చేయవు.

దీనికి కారణమేమిటి?

ఈ తెగులు చాలా రకాల ప్రత్యామ్న్యాయ మొక్కలద్వారా కూడా వ్యాపిస్తుంది.(వేరుశనగ,చిక్కుళ్ళు ఇంకా చాలా కలుపు మొక్కలు) ఈ తెగులు కొన్ని రకాల కీటకాలవలన, తెగులు సోకిన విత్తనాల వలన వ్యాపిస్తుంది. ఇది ఇతర అతిధి మొక్కలపై జీవిస్తుంది. ప్రారంభ దశలలో ఈ తెగులు సోకితే దిగుబడి బాగా తగ్గిపోయి విత్తనాల నాణ్యత తగ్గి విత్తనాలు మొలకెత్తే సామర్థ్యం తగ్గిపోతుంది. సీజన్లో తర్వాత సోకే తెగులు ఇంత ప్రభావం చూపించదు. ఎరువులు ఎక్కువగా వాడిన మరియు అధిక పెంకు పురుగులు కలిగిన పొల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • ధ్రువీకరింపబడిన వైరస్ లేని విత్తనాలను మాత్రమే వాడాలి.
  • తెగులు నిరోధక లేదా సహనాత్మక విత్తనాలు ఎంచుకోవాలి.
  • సాధ్యమైనంత వరకు తొందరగా నాటడం మంచిది.
  • కలుపు లేకుండా చూడాలి.
  • మొక్క ఎదుగుదల ప్రారంభ దశల్లో ఎక్కువగా ఎరువులు వాడకూడదు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి