మినుములు మరియు పెసలు

వేరుశనగ మొగ్గ కుళ్ళు వైరస్

GBNV

వైరస్

క్లుప్తంగా

  • లేత ఆకులపై తేలికపాటి రంగు మారిపోయిన మచ్చలు ఏర్పడుతాయి.
  • తరువాత ఇవి పూర్తిగా రంగుమారిపోయి నిర్జీవమైన రింగులలాగ చారికలుగా మారిపోతాయి.
  • తరువాత ఈ కుళ్లిపోవడం ఇవి మొగ్గలకు, కాండాలకు మరియు ఆకు కాడలు మొగ్గలకు సోకుతుంది.
  • తెగులు సోకిన మొక్కల ఎదుగుదల ఆగిపోతుంది ఆకులు వికారమైన రూపాన్ని సంతరించుకుంటాయి మరియు రంగు కోల్పోతాయి.
  • చిన్న మరియు కుమిలిపోయిన విత్తనాలు అమ్మడానికి పనిచేయవు మరియు పంట దిగుబడి తగ్గిస్తాయి.


మినుములు మరియు పెసలు

లక్షణాలు

లేత ఆకులపై తేలికపాటి రంగు మారిపోయిన మచ్చలు ఏర్పడుతాయి. తరువాత ఇవి పూర్తిగా రంగుమారిపోయి నిర్జీవమైన రింగుల వలే చారికలుగా మారిపోతాయి. తరువాత ఈ కుళ్లిపోవడం ఇవి మొగ్గలకు, కాండాలకు మరియు ఆకు కాడలు మొగ్గలకు సోకుతుంది. అందువలనే దీనిని మొగ్గ కుళ్ళు తెగులు అంటారు. ఒక మోస్తరుగా వున్న ఉష్ణోగ్రతలుఈ తెగులు పెరగడానికి దోహదపడుతుంది. తెగులు సోకిన మొక్కల ఎదుగుదల తగ్గిపోతుంది. కొత్త చిగుర్లు రంగు పాలిపోవడం కొత్తగా వస్తున్న ఆకులు వికృత ఆకారంలోకి మారడం జరుగుతుంది.పెగ్స్ బొబ్బలు కట్టి రంగు కోల్పోయి చిన్న విత్తనాలు కలిగి విత్తనాలు కృంగిపోయి వాటిపై మచ్చలు ఏర్పడతాయి. ముందర దశలో మొక్కలకు తెగులు సోకడం వలన పంట దిగుబడి తగ్గిపోతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

వీటి సంతతిని నియంత్రించటానికి నాటిన 20 రోజుల తర్వాత జొన్న మరియు కొబ్బరి ఆకుల సారాన్ని పిచికారీ చేయడం వలన కూడా దీనిని నియంత్రించవచ్చు

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులుకు రసాయన చికిత్స సాధ్యం కాదు. కానీ దీనిని నియంత్రించడానికి కొన్నిమార్గాలు ఉన్నాయి వీటిని నిరోధించటానికి డైమిథోనేట్ వంటి కీటక నాశనులను మొక్కలు నాటిన 30-35 రోజుల తరువాత చల్లటం మొగ్గ కుళ్ళు తెగులును గణనీయంగా తగ్గించడంలో తోడ్పడుతుంది.

దీనికి కారణమేమిటి?

మొక్కల టిష్యూ ను తినే కొన్ని రకాల కీటకాల వల్ల ( త్రిప్స్ పాల్మి) కలుగుతుంది. ఇవి మొక్కల కణజాల పైన దాడి చేస్తాయి. వేరుశనగ మొక్కలు లేనప్పుడు ఇవి పొలం చుట్టూ పక్కలో ఉన్న ఇతర మొక్కల పైన దాడి చేస్తాయి. ఉదాహరణకు సదరన్ మారిగోల్డ్ (టగెటెస్ మినుట) మరియు సబ్తెరానియన్ క్లోవర్ (ట్రైఫోలీయమ్ సబ్టెర్రానియం). అందువలన ఈ మొక్కలను తొలగించడం అత్యంత ముఖ్యం. మొక్కలు అధికంగా ఉండడం కూడా వేరుశనగపై ఈ తెగులు చేరకుండా చేస్తుంది.


నివారణా చర్యలు

  • మార్కెట్ లో తెగులు నిరోధక విత్తనాలు అందుబాటులో ఉంటే అవి వాడటం మంచిది.
  • త్వరగా నాటడం వలన వీటి సంతతి పెరగకుండా ఉంటుంది.
  • మొక్కల సాంద్రత ఎక్కువగా ఉంచటం కూడా వీటి ఎదుగుదలను ఆపుతుంది.
  • మొక్కజొన్న మరియు సజ్జలతో అంతర్గతంగా పంట వేయటం కూడా ఇది వ్యాపించకుండా నియంత్రిస్తుంది.
  • మొగ్గల్లో నిర్జీవత (బడ్ నెక్రోసిస్) కలిగించే మినుములు, పెసలు లాంటి మొక్కలను వేరుశనగ పంటకు పక్కన సాగు చేయవద్దు.
  • ఈ వాహకం ఎదుగుదలకు అనుకూలంగా వుండే అతిధి మొక్కలను మరియు కలుపు మొక్కలను తొలగించండి.
  • తెగులు లక్షణాలు కనిపించిన ఆరు వారాల్లో మొక్కల అవశేషాల్ని తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి