బంగాళదుంప

బంగాళాదుంప X వైరస్

PVX

వైరస్

క్లుప్తంగా

  • ఆకుల పై లేత ఆకుపచ్చ మొజాయిక్ నమూనా కనిపిస్తుంది.
  • చిన్న గోధుమ రంగు మచ్చలు కలిగిన ప్రదేశాలు ఉంటాయి.
  • వేరే వైరస్ ల తో కలిసి ఉంటే అధిక నష్టం కలుగుతుంది.
  • ఇతర వైరస్ లతో కలిస్తే లక్షణాలు మరింత త్రీవ్రంగా అవుంటాయి.

లో కూడా చూడవచ్చు


బంగాళదుంప

లక్షణాలు

మొక్కల రకాలు, ఎదుగుదల, వైరస్ మారక మరియు వాతావరణాన్ని బట్టి లక్షణాల తీవ్రత మారుతుంది. కనపడీ కనపడనట్టు ఆకుల వీనెలు, ఆకులు పసుపురంగులోకి మరియు లేత పచ్చని మొజాయిక్ నమూనాలోకి మారిపోతాయి. ముడుతలు పడే ఆకులు, నిర్జీవమైన ఆకు చివర్లు, ఎదుగుదల లేకపోవడంమరియు ఆ తర్వాత మొక్క చనిపోవడం జరుగుతుంది. కొన్ని సమయాలలో దెబ్బతిన్న ప్రదేశాలలో చిన్న చిన్న మచ్చలు, వేరే తెగులుతో కలయిక వలన ఈ లక్షణాలు మరింత త్రీవ్రతరం అవుతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి. PVX తెగులుకు ప్రత్యామ్నాయ నివారణ మార్గం లేదు. ఈ తెగులును నివారించే ప్రత్యామ్నాయ మార్గాలు మీకు తెలిస్తే మమల్ని సంప్రదించండి. మీనుండి జవాబుకోసం మేము ఎదురుచూస్తూ ఉంటాము.

రసాయన నియంత్రణ

వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వైరస్ తెగుళ్లకు రసాయన పద్దతిలో నివారణ సాధ్యం కాదు.

దీనికి కారణమేమిటి?

ఈ వైరస్ ఎక్కువగా వంకాయ, బంగాళాదుంప, పొగాకు మరియు మిరప పంట పై వ్యాపిస్తుంది. వ్యాప్తి సహజంగా వ్యాధి సోకిన మొక్కలతో తాకడం వల్ల, మిడతలు లేదా శుద్ధి చేయని పరికరాల వల్ల వ్యాపిస్తుంది. 16-22°C లక్షణాలు ఉష్ణోగ్రతల్లో ఎక్కువగా కనిపిస్తాయి.


నివారణా చర్యలు

  • వ్యాధి రహిత విధానాలని వాడాలి.
  • PVX కి నిరోధకత కలిగిన పొటాటో రకాలను నాటాలి.
  • టమాటోను బంగాళాదుంపను పక్క పక్కన నాటకూడదు.
  • పంటను గమనిస్తూ వ్యాధి సోకిన మొక్కలను తొలగించాలి.
  • మొక్కలకు గాయాలు అవ్వకుండా చూడాలి.
  • మొక్కలు మధ్య దూరం ఎక్కువగా ఉండాలి.
  • తెగులుసోకిన ఇతరపంటలలో పనిచేస్తున్నట్లైతే బట్టలను సబ్బు మరియు నీటితో శుభ్రం చేయాలి.
  • పరికరాలను శుభ్రం చేయాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి