PLRV
వైరస్
వివిధ రకాల మొక్కలు,పర్యావరణ పరిస్థితులు మరియు తెగులు యొక్క రకాలపైన పైకి కనపడే లక్షణాలు ఆధారపడి ఉంటాయి. అఫిడ్స్ ద్వారా సోకే తెగులు లేత ఆకులపైన కనిపిస్తుంది. ఆకు అంచులు పైకి ముడుతలు పడుతూ ఎండిపోయి పాలిపోయి ఆకుల ఈనెల మధ్యభాగం పసుపు రంగులోకి (ఇంటెర్వీనల్ కోరోసిస్) మారిపోతుంది. తెగులు సోకిన దుంపల నుండి మొలకెత్తిన మొక్కలలో ( సెకండరీ ఇన్ఫెక్షన్) ముదురు ఆకులు తిరగబడి, పెళుసుగా మారి ఆకు కింద ప్రక్క భాగం వంగపండు లేదా ఎరుపురంగు లోకి మారుతుంది. లేత ఆకులు నిటారుగా ఉండి పాలిపోయిన పచ్చని రంగులో లేదా క్లోరోటిక్ గా మారిపోతుంది. మొక్కల ఎదుగుదల తగ్గిపోతుంది. కాండం గట్టిగా అయిపోయి పైకి నిటారుగా నిలబడి ఉంటుంది. తెగులు బాగా ఎక్కువగా సోకడం వలన దిగుబడి తగ్గిపోయి విక్రయం చేయడంలో కూడా ఇబ్బంది ఎదురౌతుంది.
ప్రత్యక్షంగా వైరస్ ను నివారించడం వీలు పడదు. కానీ అఫిడ్ పాపులేషన్ ను ప్రెడేటర్ లేదా పారాసైటోయిడ్లు తగ్గిస్తాయి. లేడీ బర్డ్స్,సోల్జర్ బీటిల్స్, లేస్ వింగ్స్ మరియు కొన్ని రకాల కీటకాలు మరియు ఈగలు అఫిడ్స్ ను మరియు లార్వా ను తింటాయి. పారాసైటిక్ వాసప్స్ ను కూడా ఉపయోగించవచ్చు.
వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వైరస్ తెగులుకు రసాయన పద్దతిలో నిర్మూలించడం సాధ్యం కాదు. కానీ అఫిడ్ పాపులేషన్ కొంత వరకు కంట్రోల్ చేయవచ్చు. ఉదాహరణకు క్రిమిసంహారక మందులను పంట ఎదిగే ముందు దశలోనే అప్లై చేయండి.
ఎదిగే దశలో మొక్కలకు తెగులు సోకి వైరస్ కలిగిన కీటకాలు తినడం మొదలు పెట్టినప్పటినుండి ఈ తెగులు వ్యాపించడం మొదలవుతుంది. తెగులు సోకిన దుంపలను విత్తి వాటినుండి మొక్కలు మొలకెత్తినప్పుడు మరలా రెండవ ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. ఆరోగ్యంగా వున్న ఇతర మొక్కలకు కూడా అఫిడ్స్ ఈ తెగులును వ్యాపింపచేస్తాయి. అఫిడ్స్ జీవితకాలం అంతా ఈ వైరస్ జీవించే ఉంటుంది. అందువలన ఇన్ఫెక్షన్ సోకే అవకాశం చాల ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ ను మొక్కలకు సంక్రమింపచేయడానికి ఈ కీటకాలు కనీసం రెండు గంటలపాటు మొక్కలను ఆహారంగా తీసుకోవాలి. తేమ అధికంగా వున్న నేలలో ఈ తెగులు వృద్ధిచెందుతుంది.