కీర దోస

దోస జాతి పంటల్లో పచ్చ మచ్చల వైరస్

CGMMV

వైరస్

క్లుప్తంగా

  • లేత పచ్చ లేదా పసుపు రంగు మచ్చలు లేత ఆకులపైన ఏర్పడతాయి.
  • పసుపు వర్ణం, ఆకులు నలిగిపోవడం, రూపం కోల్పోవడం జరుగుతుంది.
  • ఎదుగుదల మందగిస్తుంది.
  • మచ్చలు, చారలు ఏర్పడిన లేదా రూపం కోల్పోయిన పండ్లు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

5 పంటలు
కాకరకాయ
దోసకాయ
పుచ్చకాయ
గుమ్మడికాయ
మరిన్ని

కీర దోస

లక్షణాలు

వ్యాధి యొక్క ప్రారంభ దశలలో, లేత ఆకులపై లేత పసుపు ఆకుపచ్చ మచ్చలు మరియు ఈనెలు పాలిపోవడం గమనించవచ్చు. తీవ్రమైన తెగులు సోకిన సందర్భాల్లో, పాలిపోయిన మచ్చలు ఏర్పడడం, ఆకులు నలిగిపోయి రూపు మారిపోవడం, ఆకులు మరియు మొక్కల ఎదుగుదల తగ్గిపోవడం మరియు ఆకులు నిర్జీవంగా మారడం జరుగుతుంది. ముదురు ఆకులు తెల్లగా లేదా పసుపు-తెల్లని రంగులోకి మారతాయి మరియు ముందుగానే రాలిపోతాయి. పండ్లపై ఎటువంటి లక్షణాలు కనపడకపోవడం ( కనీసం పండు పైభాగంలో) నుండి పండ్లపైన చాలా అధికమొత్తంలో మచ్చలు లేదా చారలు ఏర్పడడం, పండ్లు వికృతంగా తయారవ్వడం, పండు ముందుగానే రాలిపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఉష్ణోగ్రతలు బాగా పెరిగినప్పుడు ఈ తరువాతి లక్షణాలు బాగా కనపడతాయి. కొన్ని సందర్భాల్లో పండ్లపైన ఎటువంటి మచ్చలు లక్షణాలు కనపడకపోయినా పండు లోపల రంగు మారి నిర్జీవంగా తయారవుతాయి. పండ్లు పక్వానికి రాకుండానే రాలిపోవడం అనేది చాలా సాధారణం.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

మూడు రోజుల వరకు మీరు విత్తనాలను 70°C వద్ద పొడి వేడి చేస్తే అవి చురుకైన వైరస్ కణాల నుండి విముక్తి పొందుతాయి అయినప్పటికీ ఈ విత్తనాలు మొలకెత్తుతాయి. అందుబాటులో ఉంటే, CGMMV టెస్ట్ కిట్స్ ఉపయోగించండి. నమిలే కీటకాలను లక్ష్యంగా చేసుకుని సేంద్రీయ క్రిమిసంహారకాలను వాడండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. నమిలే కీటకాలను లక్ష్యంగా చేసుకుని పురుగుల మందులు వాడితే ఈ వైరస్ వ్యాపించకుండా చేయవచ్చు. దోస ఆకుపచ్చ మచ్చల వైరస్ లాంటి వ్యాధులకు నేరుగా చికిత్స చేయడం సాధ్యం కాదు.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు దోస ఆకుపచ్చ మచ్చల వైరస్ (CGMMV) ద్వారా వ్యాపిస్తాయి ఇవి దోస జాతి పంటలైన దోస కాయ, పుచ్చకాయ మరియు ఖర్భుజాలకు సోకుతుంది. మట్టిలో వున్న చనిపోయిన మొక్కలపై ఈ వైరస్ చాలా కాలం పాటు క్రియాశీలకంగా ఉంటుంది. తెగులు సోకిన విత్తనాలు, పరికరాలు కత్తిరించడంవలన అయ్యే యాంత్రిక గాయాలు, వ్యవసాయ పరికరాలు, మరియు నమిలి తినే కీటకాలైన పెంకు పురుగులు వంటి కీటకాల ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. అంటుకట్టడం వలన కూడా ఇది ఇతర మొక్కలకు సోకుతుంది. నోటితో పీల్చుకునే కీటకాలు (ఉదాహరణ. పేనుబంక, నల్లి జాతి పురుగులు, తెల్ల ఈగలు) ఈ వైరస్ ను వ్యాపింపచేయవు. ఒకసారి మొక్కకు ఈ తెగులు సోకిన తర్వాత దీనికి ఎటువంటి నివారణా లేదు. ముఖ్యంగా గ్రీన్ హౌసెస్ లో పండించే పంటకు ఈ వైరస్ ల నుండి సంక్రమణల సంఖ్య పెరుగుతోంది.


నివారణా చర్యలు

  • దృవీకరించిన విత్తనాలను మాత్రమే వాడండి.
  • ఈ తెగులుసోకే అవకాశం వున్న ఇతర మొక్కలను ఒకదానికి ఇంకొకటి దగ్గరగా వేయవద్దు.
  • పనిముట్లతో విత్తనాల వద్ద కానీ మొక్కల వద్ద కానీ పనిచేస్తున్నట్లైతే శుభ్రమైన పరికరాలను మాత్రమే ఉపయోగించండి.
  • పొలంలో పనిచేస్తున్నప్పుడు మొక్కలు దెబ్బతినకుండా చూసుకోండి.
  • CGMMV యొక్క లక్షణాలు కోసం క్రమం తప్పకుండా పొలాన్ని గమనిస్తూ వుండండి.
  • తెగులు సోకిన మొక్కలను వెంటనే తొలగించి పాతిపెట్టండి లేదా కాల్చివేయండి.
  • ఈ తెగులు సోకే అవకాశం వున్న మొక్కలు ఒకదానికి మరొకటి తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి