ప్లం

స్టెక్లెన్‌బెర్గర్ వ్యాధి

Prunus necrotic ringspot virus

వైరస్

క్లుప్తంగా

  • ఆకుల కణజాలం, పువ్వులు, మొగ్గలు మరియు రెమ్మల రంగు మారడం మరియు స్థానికంగా నెక్రోసిస్ చెందడం(వైరస్ యొక్క జాతిని బట్టి).
  • ఆకులపై పసుపు లేదా పాలిపోయిన మచ్చలు ఏర్పడతాయి.
  • కొన్ని సందర్భాల్లో లేత ఆకు ఈనెలు చిల్లులు పడడం మరియు ముక్కలవ్వడం జరుగుతుంది.

లో కూడా చూడవచ్చు

6 పంటలు
బాదం
ఆపిల్
అప్రికోట్
చెర్రీ
మరిన్ని

ప్లం

లక్షణాలు

వైరస్ ను బట్టి, జాతులు లేదా వివిధ రకాల చెట్టు మరియు పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి లక్షణాలు చాలా తీవ్రంగా, తేలికపాటివిగా, లక్షణరహితమైనవిగా ఉండవచ్చు. ఇవి ఆకులు, మొగ్గలు, పువ్వులు, రెమ్మలు లేదా పండ్లపై కనిపిస్తాయి మరియు సాధారణంగా కణజాలం యొక్క రంగు మారడం లేదా ఒకే ప్రాంతంలో కలిగిన నెక్రోసిస్ ద్వారా ఇవి వర్గీకరించబడతాయి. శాఖలు మొగ్గలు ఆలస్యంగా విచుకోవడం మరియు ఆకులు ఆలస్యంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది మరియు కొనమొగ్గలు పైనుండి కిందకి చనిపోవచ్చు. వృద్ధిచెందే ఆకులపై పాలిపోయిన లేదా ప్రకాశవంతమైన పసుపు మచ్చలు, పాలిపోయిన పసుపు రంగు మచ్చలు, గుండ్రటి మచ్చలు, గీతలు మరియు/లేదా "ఓక్ లీఫ్" నమూనాలు కనిపిస్తాయి. ఈ తెగులు తీవ్రత అధికంగా ఉండే సందర్భాల్లో పాలిపోయిన ప్రాంతాలు నిర్జీవంగా మారతాయి మరియు రాలిపోతాయి, దీని ఫలితంగా ముక్కలు కావడం, వైకల్యం లేదా "షాట్-హోల్" ఏర్పడతాయి. పండు పరిపక్వత ఆలస్యం కావచ్చు మరియు పండ్లపై మచ్చలు ఏర్పడవచ్చు. దీనివలన వాటిని అమ్మడం కష్టం కావచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

స్టెక్లెన్‌బెర్గర్ వ్యాధిని ఎదుర్కోవడం చాలా కష్టం. వేడి గాలి (38 °C వద్ద 24-32 రోజులు) లేదా వేడి నీటితో విత్తనాల థర్మోథెరపీని ఉపయోగించడం ద్వారా ఆరోగ్యకరమైన అంటు మొక్కలను పొందవచ్చు. ఎపికల్ మెరిస్టెమ్ కల్చర్ (వైరస్ లేనిది) అనే పద్ధతి ద్వారా కొత్త చెట్ల ఉత్పత్తి కూడా ప్రభావవంతంగా ఉంది.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉన్నట్లయితే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. సాధారణంగా వైరల్ వ్యాధులను పురుగుమందుల ద్వారా నియంత్రించలేము. తామర పురుగులు వ్యాధి వ్యాప్తికి వాహకాలుగా ఉపయోగపడతాయి కాబట్టి, వాటిని నియంత్రించినట్లైతే ఈ వైరస్ సంక్రమణ కేసులను తగ్గించవచ్చు.

దీనికి కారణమేమిటి?

పి ఎన్ ఎం ఆర్ ఎస్ వి అనేక రకాల ప్రూనస్‌లో నెక్రోటిక్ రింగ్‌స్పాట్‌కు కారణమవుతుంది, ఆ తరువాత తరచుగా లక్షణాల నుండి కోలుకుంటుంది. మొక్కల అంటుకట్టే పద్ధతుల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది, దీనివలన చెట్టు నర్సరీ నిల్వలను వ్యాప్తి చేయడం మరియు తోటలలో రూట్ గ్రాఫ్టింగ్ సమస్యాత్మకం అవుతుంది. ఈ వైరస్ పుప్పొడి మరియు విత్తనాలను సోకుతుంది మరియు ఈ విధంగా పరాగసంపర్క మొక్కలకు వ్యాపిస్తుంది. తేనెటీగలు లేదా ఇతర కీటకాలు వైరస్ సోకిన పుప్పొడిని తోటలలో వ్యాప్తి చేస్తాయి కాబట్టి ఇవి వైరస్ వాహకాలుగా పనిచేస్తాయి. ఈ వైరస్ తామర పురుగుల ద్వారా కూడా సంక్రమిస్తుంది, కానీ దీని వ్యాప్తిలో తామర పురుగులు యొక్క సహకారం మరియు ప్రాముఖ్యత తెలియదు. పి ఎన్ ఎం ఆర్ ఎస్ వి పువ్వు యొక్క అన్ని భాగాలకు సోకుతుంది, కాబట్టి వైరస్ సోకిన పుప్పొడి గింజ, అండాశయం లేదా రెండింటి నుండి విత్తనాలకు ఈ వైరస్ సోకవచ్చు. పండ్లకు కూడా ఈ వైరస్ సోకుతుందని తెలుస్తోంది.


నివారణా చర్యలు

  • ధ్రువీకరించబడిన మరియు వైరస్ రహిత విత్తనాలను మాత్రమే ఉపయోగించండి.
  • గ్రాఫ్టింగ్ సపోర్టుగా వైరస్ రహిత కాడలను మాత్రమే ఉపయోగించండి.
  • వ్యాధి లక్షణాల కోసం తోటను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • వ్యాధి సోకిన మొక్కలను వెంటనే తొలగించి పాతిపెట్టండి లేదా కాల్చివేయండి.
  • ఇతర తోటలలో గతంలో ఉపయోగించిన వాణిజ్య తేనెటీగ తొట్లను వాడకండి.
  • తోటలో అత్యధిక పరిశుభ్రతా ప్రమాణాలను పాటించండి.
  • వ్యాధి సోకిన తోటలకు సమీపంలో కొత్త చెట్లను నాటవద్దని సిఫార్సు చేయబడింది.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి