Phomopsis durionis
శీలీంధ్రం
ఈ వ్యాధి ఆకులపై చిన్న చిన్న, గుండ్రని, ఎరుపు-గోధుమ రంగు మచ్చలుగా మొదలవుతుంది. ఈ మచ్చలు పెరిగేకొద్దీ, వాటి వెలుపలి అంచు చుట్టూ తరచుగా ఒక పల్చటి పసుపు వలయం ఏర్పడుతుంది. పాత మచ్చలలో, మధ్యభాగం లేత బూడిద లేదా తెలుపు రంగులోకి మారి, కాగితంలా పల్చబడుతుంది. మీరు ఈ బూడిద రంగు ప్రాంతాలను చాలా దగ్గరగా చూసినట్లయితే చిన్న చిన్న నల్లటి చుక్కలు కనిపిస్తాయి. ఇవే శిలీంధ్రంలో కొత్త బీజాంశాలు తయారయ్యే భాగాలు. ఒకే ఆకుపై అనేక మచ్చలు ఏర్పడినప్పుడు అవి ఒకదానితో మరొకటి కలిసిపోయి పెద్ద ప్రాంతాలను కప్పివేయగలవు. దీనివల్ల ఆకు పసుపు రంగులోకి మారి, ఎండిపోయి, ముందుగానే చెట్టు నుండి రాలిపోతుంది. ఈవిధంగా ఆకులకు నష్టం వాటిల్లడంవలన చెట్టు బలహీనపడి అది ఉత్పత్తి చేసే పండ్ల పండ్ల సంఖ్య తగ్గుతుంది..
పర్యావరణ అనుకూలమైన పద్ధతులలో, ఆకు మచ్చ తెగులుతో పోటీపడే ప్రయోజనకరమైన శిలీంధ్రాలు లేదా బ్యాక్టీరియా వంటి సహాయక సూక్ష్మజీవులను ఉపయోగించడం కూడా ఒకటి. ఒక జీవసంబంధమైన అవరోధాన్ని సృష్టించడానికి వీటిని ఆకులపై పిచికారీ చేయవచ్చు. వేప నుండి తయారు చేసిన నేచురల్ ఎక్సట్రాక్ట్స్ కూడా శిలీంధ్రం పెరుగుదలను నెమ్మదింపజేయడంలో సహాయపడతాయి. ఈ జీవసంబంధమైన చికిత్సలను సీజన్ ప్రారంభంలో లేదా వ్యాధికి వాతావరణ పరిస్థితులు మొదట అనుకూలంగా మారినప్పుడు ప్రారంభిస్తే ఉత్తమంగా పనిచేస్తాయి
వ్యాధి చెట్టు అంతటా విస్తృతంగా వ్యాపించే అవకాశం రాకముందే, ఒక రక్షణ కవచంలా స్ప్రేలను పిచికారీ చేయాలి. ఈ శిలీంధ్రం అనేక బీజాలను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి, మొక్క యొక్క అత్యంత సున్నితమైన పెరుగుదల దశలను కవర్ చేసేలా సరైన సమయంలో మందులను పిచికారీ చేయడం ముఖ్యం. వివిధ రకాల నివారణ పద్ధతులను ఉపయోగించడం వల్ల, కాలక్రమేణా శిలీంధ్రం ఈ మందులకు నిరోధకతను పెంచుకోకుండా నివారించవచ్చు.
వ్యాధి సోకిన ఆకులు మరియు పాత మొక్కల అవశేషాలపై జీవించే ఒక శిలీంధ్రం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ బీజాంశాలను, నేల పైనుండి లేదా పాత ఆకుల నుండి ఆరోగ్యంగావున్న కొత్తఆకులపై వర్షపు చినుకులు చిమ్మినప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ శిలీంధ్రం వెచ్చని వాతావరణంలో మరియు అధిక తేమలో, ముఖ్యంగా వర్షాకాలంలో వృద్ధి చెందుతుంది. ఇది ఆకులోని చిన్న సహజ రంధ్రాలు లేదా చిన్న గాయాల ద్వారా ప్రవేశిస్తుంది. అధిక నత్రజని స్తాయిలు మొక్కల పెరుగుదలను మృదువుగా మరియు లేతగా మార్చి, చెట్టుపై శిలీంధ్రం దాడి చేసే అవకాశాన్ని పెంచుతుంది. ఒకసారి ఇది ప్రారంభమైతే, ఈ శిలీంధ్రం ఆకులపై ఉన్న నల్లటి మచ్చలలో కొత్త బీజాలను ఉత్పత్తి చేస్తుంది, వాటిని గాలి మరియు వర్షం తోటలోని ఇతర చెట్లకు వ్యాపింపజేస్తాయి.