పుచ్చకాయ

కాటనీ లీక్

Pythium aphanidermatum

శీలీంధ్రం

క్లుప్తంగా

  • గోధుమరంగు , మృదువైన , కుళ్ళిన భాగాలు పండ్లపై కనిపిస్తాయి.
  • తెల్లని ప్రత్తిలాంటి ఎదుగుదల పండుపై కనిపిస్తుంది.
  • కొత్తగా మొలకెత్తిన మొలకలు చనిపోతాయి.

లో కూడా చూడవచ్చు

4 పంటలు
దోసకాయ
పుచ్చకాయ
గుమ్మడికాయ
కీర దోస

పుచ్చకాయ

లక్షణాలు

నేలతో ప్రత్యక్ష సంబంధంలో కలిగిన పండ్లపై మృదువైన, కుళ్ళిన ప్రాంతాలుగా అభివృద్ధి చెందే గోధుమ రంగు ప్రాంతాలుగా లక్షణాలు ప్రారంభమవుతాయి. తేమతో కూడిన పరిస్థితులలో, తెల్లటి, పత్తి లాంటి పెరుగుదల కనిపిస్తుంది మరియు పండు యొక్క ఈ కుళ్ళిన ప్రాంతాన్ని కప్పివేస్తుంది. నర్సరీలో, అదే వ్యాధికారకం చిన్న మరియు పెద్ద మొలకలకు నష్టం కలిగించి వాటి మరణానికి కారణమవుతుంది. ఇది వేర్లకు కూడా నష్టం కలిగించి అవి కుళ్లిపోయేటట్టు చేస్తుంది: మొక్క పోషకాలను తీసుకోలేనందున ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. పైథియం వల్ల కలిగే పండ్ల తెగులు ఫైటోఫ్థోరా మరియు స్క్లెరోటినియా వల్ల కలిగే పండ్ల తెగులు లాగా కనిపిస్తుంది. వాటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి, గుర్తుంచుకోండి: పైథియం ప్రత్తి లేదా షేవింగ్ క్రీమ్ లాగ కనిపిస్తుంది. ఫైటోఫ్తోరా పిండి లేదా పొడి లాగా కనిపిస్తుంది. స్క్లెరోటినియా, కాండం మీద కూడా కనిపించే నల్లటి గట్టి మచ్చలతో మందపాటి తెల్లటి దూదిలాగ ఉంటుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులుకి ధ్రువీకరించబడిన మరియు వర్తించగలిగే జీవ నియంత్రణ లేదు.

రసాయన నియంత్రణ

లక్షణాలు కనిపించిన తర్వాత, ప్రభావితమైన మొలకలు లేదా పండ్లను రక్షించలేము. సంక్రమణను నివారించడానికి, విత్తనాలు మరియు మొలకలకి రసాయన చికిత్సలను వర్తించండి. నాటడానికి ముందు విత్తనాలను శుద్ధి చేయండి మరియు సిఫార్సు చేసిన సాంద్రతలో మొలకలని ముంచండి. అదనంగా, ఉపరితల మట్టి చికిత్సలను కూడా ఉపయోగించండి. ఈ చికిత్సల ప్రభావం నీటిపారుదల లేదా వర్షపాతం ద్వారా మట్టి యొక్కపైన అంగుళం ప్రాంతానికి శిలీంద్ర నాశిని చేరుకోవడంపై ఆధారపడి ఉంటుంది.

దీనికి కారణమేమిటి?

కాటనీ లీక్‌కు కారణమయ్యే వ్యాధికారక సూక్ష్మజీవి మట్టిలో నివసిస్తుంది! వేడి, తేమతో కూడిన వాతావరణం మరియు నీరు నిలిచే ప్రాంతాలు దీనికి అనుకూలంగా ఉంటుంది . ఇది సాగునీటి ద్వారా వ్యాపిస్తుంది. ఇది చాల సులభంగా మొక్క యొక్క కణాలలోకి ప్రవేశించి మొక్క పోషకాలను సంగ్రహించకుండా అడ్డుకుంటుంది మరియు ప్రభావితమైన భాగాలు కుళ్లిపోయేటట్టుచేస్తుంది. కత్తిరింపు లేదా ఆకులను తొలగించడం వల్ల కలిగే గాయాలు మొక్కలు దీనికి ఎక్కువగా ప్రభావితమవుతాయి, తద్వారా వ్యాధికారక సూక్ష్మజీవి సులభంగా వ్యాప్తి చెందుతుంది.


నివారణా చర్యలు

  • పొలంలో సరైన మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి.
  • వీలైతే, ఎతైన బెడ్లు మరియు బిందు సేద్యం ఏర్పాటు చేసుకోండి.
  • ఈ తెగులుకు ఆతిధ్యం ఇవ్వని గడ్డి జాతి మరియు ధాన్యపు పంటలతో పంటభ్రమణం చేయండి.
  • వాతావరణం చల్లగా వున్నప్పుడు మొక్కలను నాటండి.
  • మొక్కల మధ్య ఎక్కువ అంతరాన్ని దూరంగాఉంచండి.
  • పండ్లు నేలకి తగలకుండా అవరోధాలను సృష్టించండి, ఇది చిన్న సాగుదారులకు ఆచరణాత్మకంగా ఉంటుంది.
  • పండ్లను వైర్, కలప లేదా తీగల పైభాగంలో ఉంచండి.
  • పొడి ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్‌తో ప్లాస్టిక్ మల్చ్‌ని ఉపయోగించండి, కానీ అధిక వర్షపాతం ఉండే ప్రాంతాల్లో జాగ్రత్త వహించండి, ఎందుకంటే ఇది నీటిని పట్టిఉంచి పండ్లు కుళ్లిపోయేటట్టు చేస్తుంది.
  • బ్లీచ్ ద్రావణంతో మీ వ్యవసాయ పనిముట్లు, కుండలు మరియు ట్రేలను క్రమం తప్పకుండా శుభ్రపరచండి మరియు కలుషితమైన మట్టిని ఉపయోగించకండి.
  • తడి వాతావరణంలో పండ్లను కోయవద్దు మరియు ప్యాక్ చేయవద్దు.
  • ఆరోగ్యంగా కనిపించే వాటిని మాత్రమే కోయండి మరియు ప్యాక్ చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి