ఆలివ్

నియోఫాబ్రియా ఆకు మచ్చ

Neofabraea spp.

శీలీంధ్రం

క్లుప్తంగా

  • చిన్న వృత్తాకార నిర్జీవ కణజాల ఆకు గాయాలు.
  • రెమ్మలు మరియు కొమ్మలపై ఎర్రటి-గోధుమ రంగు గాయాలు మరియు అప్పుడప్పుడు కొమ్మలపై పుండ్లు ఏర్పడతాయి.
  • పండ్లపై చుట్టూ పసుపు వలయంతో ముదురు రంగు మచ్చలు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
ఆలివ్

ఆలివ్

లక్షణాలు

తోటలో యాంత్రిక పద్ధతుల్లో పంట కోసిన తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా శీతాకాలం చివరిలో మరియు వసంతకాలం ప్రారంభంలో ఆకులపై లక్షణాలు కనిపిస్తాయి. ఆకులపై 3 నుండి 4 మిమీ వ్యాసం కలిగి కొద్దిగా నొక్కుకుపోయినట్టుగా ఉన్న గాయాలు ఏర్పడతాయి. మొదట్లో ఇవి చిన్న చిన్న గుండ్రటి పాలిపోయిన (పసుపు) గాయాలుగా ఏర్పడతాయి. ఈ గాయాలు వసంత ఋతువులో మరియు వేసవి ప్రారంభంలో నిర్జీవ కణజాలంగా మారుతాయి. గాయపడిన కొమ్మలలో 0.5 నుండి 3 సెం.మీ పొడవు ఉన్న పుండ్లను గమనించవచ్చు, ఇది కొమ్మల మరణానికి కారణమవుతుంది. తీవ్రమైన సంక్రమణ ఆకులు రాలిపోవడానికి దారితీస్తుంది. దీనివలన తదుపరి సీజన్‌లో ఉత్పత్తి దెబ్బతింటుంది. పండ్లపై కొద్దిగా నొక్కుకుపోయినట్టు ఉన్న ముదురు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల చుట్టూ పాలిపోయిన వలయం ఏర్పడుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఇప్పటివరకు ఈ వ్యాధికి సమర్థవంతమైన జీవ నియంత్రణ చికిత్సలు అందుబాటులో లేవు.

రసాయన నియంత్రణ

ఈ ప్రత్యేకమైన సమస్య ఇటీవలి సంవత్సరాలలో గమనించబడింది. రసాయన నియంత్రణ అధ్యయనాలు ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న దశలో వున్నాయి. ఈ సమస్యకు పంటకోత తర్వాత రక్షిత పిచికారీలు పరిష్కారం చూపించవచ్చు. వ్యాధికారక సూక్ష్మ జీవుల వ్యాప్తిలో కత్తిరింపు మరియు యాంత్రిక పంట కోత సాధనాల పాత్రను అధ్యయనం చేయవలసివుంటుంది. మీ స్థానిక వ్యవసాయ శాస్త్రవేత్త నుండి మీ ప్రాంతం కోసం నవీకరించబడిన సమాచారాన్ని పొందండి.

దీనికి కారణమేమిటి?

నియోఫాబ్రేయా మరియు ఫ్లైక్టెమా జాతులు రెండూ వ్యాధితో సంబంధం కలిగి ఉన్నాయి. ఆలివ్ పరిశ్రమ విస్తరించిన మరియు పంట విస్తీర్ణం పెరిగిన ప్రాంతాల్లో ఇటీవలి సంవత్సరాలలో ఆలివ్ తోటలలో ఈ వ్యాధి లక్షణాలు నాటకీయంగా పెరిగాయి. కత్తిరింపు మరియు కోత యొక్క యాంత్రీకరణ ఆకులు, రెమ్మలు మరియు కొమ్మలలో గాయాల సంఖ్యను పెంచుతుంది. చెట్లకు గాయాలైతే వ్యాధి సంక్రమణ జరుగుతుంది.


నివారణా చర్యలు

  • అన్ని సాగు రకాలకు ఈ వ్యాధి సంక్రమించే అవకాశం లేదు.
  • బ్లాంక్వెటా సాగు రకానికి ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • అర్బెక్వినా మరియు పిక్వల్ రకాలకుఈ వ్యాధి సంక్రమించే అవకాశం మధ్యస్థంగా ఉంటుంది.
  • ఈ వ్యాధి సంక్రమించడానికి ఉత్పత్తి యొక్క యాంత్రీకరణ కారణం కాబట్టి నివారణ చర్యలను నిర్వచించడం కష్టం.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి