Mycosphaerella pinodes and Phoma medicaginis var. pinodella
శీలీంధ్రం
బ్లాక్‌స్పాట్ వలన కాండం, ఆకులు, కాయలు మరియు విత్తనాలపై గాయాలు ఏర్పడతాయి. తేమతో కూడిన పరిస్థితులలో, ప్రారంభ లక్షణాలు సాధారణంగా మొక్కల పందిరి క్రింద, దిగువ ఆకులు మరియు కాండం మీద కనిపిస్తాయి. సక్రమమైన ఆకారంలో లేని చిన్న, ముదురు గోధుమ రంగు మచ్చలు ఆకు ఉపరితలంపై చెదరగొట్టబడినట్టు ఉంటాయి. తేమతో కూడిన పరిస్థితులు కొనసాగినట్లైతే మచ్చలు పెద్దవిగా మారి ఒకదానితో మరొకటి కలిసిపోతాయి, దీని వలన క్రింది ఆకులు పూర్తిగా మాడిపోతాయి. కాండం క్రింది భాగంలోని గాయాలు ఊదా-నలుపు చారల వలె కనిపిస్తాయి, ఇది మొక్కల మొదలు వద్ద కుళ్ళిపోవడానికి కారణమౌతాయి. మొక్కలు వాలిపోయి పడిపోతాయి. కాయలపై ఊదా-నలుపు రంగు మచ్చలు ఏర్పడి ఒకదానితో మరొకటి కలిసిపోయి నొక్కుకుపోయినట్టు ఉండే మచ్చలుగా మారతాయి. తెగులు సోకిన గింజలు రంగు మారి ఊదా గోధుమ రంగులో కనిపిస్తాయి.
వ్యాధి నిరోధక రకాలను సాగు చేయండి.
నివారణ చర్యలు మరియు అందుబాటులో ఉన్న జీవ చికిత్సలతో పాటు ఎల్లప్పుడూ సమీకృత విధానాన్ని పరిగణలోకి తీసుకోండి. మాంకోజెబ్ వంటి శిలీంద్ర నాశినులతో విత్తన శుద్ధి సిఫార్సు చేయబడింది.
మైకోస్ఫేరెల్లా పినోడ్స్, ఫోమా మెడికాగినిస్ వర్ అనే ఫంగస్ వల్ల నష్టం జరుగుతుంది. పినోడెల్లా విత్తనం ద్వారా, మట్టి ద్వారా లేదా బఠానీ మొక్కల ఆశేషాల ద్వారా సంక్రమిచవచ్చు. సాధారణంగా, ముందు పంట అవశేషాలపై ఉత్పత్తి చేయబడిన శిలీంధ్ర బీజాంశాలు గాలి ద్వారా కొత్త పంటకి సంక్రమిస్తుంది. మొక్కలు ఎదిగే ఏ దశలోనైనా ఇది సంక్రమించవచ్చు. వ్యాధి సోకిన మొక్కలపై ఉత్పత్తి చేయబడిన బీజాంశం గాలి మరియు వర్షపు తుంపర్ల ద్వారా ప్రక్కనే ఉన్న ఆరోగ్యకరమైన మొక్కలపైకి కూడా బదిలీ చేయబడుతుంది. వ్యాధి సోకిన విత్తనాలను విత్తడం ద్వారా కూడా వ్యాధి సోకవచ్చు. తడి వాతావరణంలో, వ్యాధి వేగంగా వ్యాప్తి చెందవచ్చు. పొడి వాతావరణం ఉన్న సంవత్సరంలో, వ్యాధి సోకిన విత్తనాలను నాటడం వలన వ్యాధిగ్రస్తమైన పంటను ఉత్పత్తి చేయకపోవచ్చు, కానీ తడి వాతావరణ పరిస్థితుల్లో వ్యాధి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ శిలీంధ్రం చాలా సంవత్సరాలు మట్టిలోజీవించి ఉండగలదు.