చెరుకు

పొక్కా బొఎంగ్

Fusarium moniliforme

శీలీంధ్రం

క్లుప్తంగా

  • పైభాగం లేదా దెబ్బతిన్న కొమ్మ యొక్క వైకల్యం మరియు వక్రీకరణ.
  • లేత ఆకుల అడుగు భాగంలో పత్రహరితం కోల్పోయిన ప్యాచీలు కనిపించడం.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

చెరుకు

లక్షణాలు

ఈ వ్యాధి మూడు ప్రధాన దశల్లో వృద్ధి చెందుతుంది. మొదటి దశలో ప్రారంభ లక్షణాలుగా చిన్న ఆకుల అడుగు భాగంలో మరియు అప్పుడప్పుడు ఆకు ఈనెల మధ్యభాగాలపై పత్రహరితం కోల్పోయిన ప్యాచీలు కనిపిస్తాయి. ఆకులు ముడతలు పడి, వంకరగా మారి కుందించుకుపోతాయి. ప్రభావిత ఆకుల మొదలు భాగం తరచుగా సాధారణ ఆకుల కంటే చిన్నగా ఉంటుంది. టాప్ రాట్ తెగులు దశ అత్యంత తీవ్రమైన దశ, ఈ దశలో ఆకుల వైకల్యం చెందడం మరియు మెలి తిరిగినట్టు ఉండడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎర్రటి మచ్చలు కరిగిపోతాయి మరియు కుదురు మొదలు మొత్తం కుళ్ళిపోయి ఎండిపోతుంది. తెగులు తీవ్రత అధికంగా ఉన్నపుడు మొగ్గలు మొలకెత్తుతాయి మరియు కాండం భాగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నైఫ్ కట్ స్టేజ్ అని పిలువబడే మూడవ దశ కొమ్మ లేదా కాండం యొక్క పై తొక్కలో అడ్డంగా కోతలను చూపుతుంది. ఆకులు తొలగించినప్పుడు కాడలపై పెద్ద పెద్ద ప్రస్ఫుటమైన పత్రహరితం కోల్పోయి పాలిపోయిన ప్యాచీలు కనిపిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

అందుబాటులో ఉంటే, వ్యాధి నిరోధక లేదా మధ్యస్త నిరోధక విత్తన రకాలను ఉపయోగించండి.

రసాయన నియంత్రణ

నివారణ చర్యలు మరియు అందుబాటులో ఉన్న జీవ చికిత్సలతో పాటు ఎల్లప్పుడూ సమీకృత విధానాన్ని పరిగణలోకి తీసుకోండి. పొక్కా బొఎంగ్ వ్యాధిని సమర్థవంతంగా తగ్గించడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ వంటి శిలీంధ్ర నాశినులను వాడండి.

దీనికి కారణమేమిటి?

ఫ్యూసేరియం యొక్క వివిధ జాతుల వల్ల నష్టం జరుగుతుంది: ఫ్యూసేరియం సబ్‌గ్లుటినాన్స్, ఫ్యూసేరియం సచ్చరి, ఫ్యూసేరియం మోనిలిఫార్మ్ షెల్డన్. వ్యాధికారక సూక్ష్మ జీవులు ప్రధానంగా గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి మరియు గాలిలో ఉండే బీజాంశాలు కీటకాలు, కాండం మరియు కాయ తొలుచు పురుగులు లేదా మొక్క ఎదుగుతునప్పుడు సహజంగా ఏర్పడే పగుళ్ల వలన కలిగిన గాయాల ద్వారా మొక్కల ఆకులు, పువ్వులు మరియు కాండాలను ఆవాసంగా చేసుకుంటాయి. వ్యాధి సోకిన సెట్లు, పొలంలో పెట్టే నీరు, వర్షపు తుంపర్లు మరియు నేలల ద్వారా సెకండరీ ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. సాధారణంగా, పాక్షికంగా విచ్చుకున్న ఆకు అంచున ఉన్న కుదురు ద్వారా ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. కుదురులోకి ప్రవేశించే బీజాంశం మొలకెత్తుతుంది మరియు కుదురు ఆకు యొక్క అంతర్గత కణజాలంలోకి పెరుగుతుంది. దీని ఫలితంగా ఆకులు వైకల్యం చెంది కురచగా ఉంటాయి. వివిధ పర్యావరణ పరిస్థితులపై బీజాంశం వ్యాప్తి ఆధారపడి ఉంటుంది మరియు పొడి సీజన్‌ తర్వాత వచ్చే తేమతో కూడిన సీజన్‌లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో, ఆకులకి వచ్చే తెగుళ్లు వేగంగా వృద్ధి చెందుతాయి మరియు సాధారణంగా, వ్యాధి నిరోధక రకాలు కూడా కొన్నిసార్లు ఆకులపై తెగులు లక్షణాలను ప్రదర్శిస్తాయి. సహజ పరిస్థితులలో మొక్కల శిధిలాలలో వ్యాధికారక సూక్ష్మ జీవులు 12 నెలల పాటు జీవించి ఉండగలవు.


నివారణా చర్యలు

  • వ్యాధి రాకుండా నిరోధించడానికి ఆరోగ్యకరమైన సెట్లు/విత్తన పదార్థాన్ని ఉపయోగించండి.
  • 99% తేమతో 2.5 గంటల పాటు 54°C వద్ద తేమతో కూడిన వేడి గాలిలో వేడితో చికిత్స చేయబడిన పంటల నుండి సెట్లను ఉత్పత్తి చేయాలి.
  • ప్రభావిత పొలాల్లో పంట మార్పిడిని పాటించండి.
  • 'టాప్ రాట్' లేదా 'కత్తి కోత తెగులు' కనిపించే చెరకు లేదా సెట్‌లు కనిపించిన వెంటనే వాటిని పొలాల నుండి తొలగించాలి.
  • ప్రభావితమైన మొక్కను వేరు వ్యవస్థతో పాటు తొలగించి కాల్చివేయండి.
  • వ్యాధి సోకిన పంటను వీలైనంత త్వరగా కోయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి