Peronospora hyoscyami
శీలీంధ్రం
ఎండ తగలని ముదురు ఆకులపై ఒకొక్కటిగా లేదా సమూహాలుగా పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. అదనంగా, ఆకు దిగువ భాగంలో ఏ మచ్చల క్రింద దట్టమైన బూడిదరంగు బూజు కనిపిస్తుంది. మచ్చలు వ్యాప్తి చెంది చివరికి ఆకులు రాలిపోతాయి. చివరగా, మొక్క ఎదగాల్సిన దానికంటే తక్కువగా ఎదుగుతుంది. కొన్నిసార్లు, కాండం అంతటా ఈ ఫంగస్ వ్యాపిస్తుంది. దీనివల్ల ఏ వయసులోనైనా మొక్క ఎదుగుదల ఆగిపోయి వాడిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ కాండం లోపల గోధుమ రంగు గీతలు కనిపిస్తాయి. చనిపోయిన లేదా చనిపోతున్న మొలకల ప్యాచీలు నర్సరీలో వ్యాధి ఉనికికి ఒక సంకేతం. మొదట, ఆకుల పైభాగం సాధారణంగా కనిపించవచ్చు, కానీ ఒకటి లేదా రెండు రోజుల తర్వాత, పసుపురంగు మచ్చలు అభివృద్ధి చెందుతాయి. మొలకల చనిపోవడం ప్రారంభమవుతుంది మరియు లేత గోధుమ రంగులోకి మారుతాయి.
ప్రస్తుతానికి, నీలి బూజు తెగులును నియంత్రించడానికి ఎటువంటి జీవ సంబంధితఉత్పత్తులు అందుబాటులో లేవు.
సమశీతోష్ణ మరియు ఉపఉష్ణమండల ప్రాంతాల్లో రసాయనికంగా నీలం రంగు బూజు తెగులు నియంత్రణకు చాలా సమయం అవసరం అవుతుంది. డిథియోకార్బమేట్స్ లేదా అవశేష కార్యకలాపాలతో కూడిన అంతర్వాహిక ఉత్పత్తులు ఉపయోగించబడతాయి. మీ ప్రాంతంలో నియంత్రించబడిన పురుగుమందులను ఉపయోగించండి. మందును ఎలా వాడాలో తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ లేబుల్ పై సూచనలను చదవండి. మీకు నచ్చిన పురుగుమందులకు సంబంధించి వ్యాధికారకం యొక్క నిరోధకత గురించి మీరు తెలుసుకోండి. అంతర్వాహిక సంక్రమణలో రసాయన పిచికారీలు ప్రభావవంతంగా పనిచేయవు.
నీలి బూజుకి కారణమయ్యే పెరోనోస్పోరా హైయోస్కియామి అనే మొక్క వ్యాధికారకం ద్వారా నష్టం జరుగుతుంది. ఇది పొగాకు మొక్కలను ప్రభావితం చేసే ఫంగల్ వ్యాధి. ఇది గాలి ద్వారా ఎగిరే బీజాంశం మరియు తెగులు సోకిన అంటూ మొక్కల ద్వారా వ్యాపిస్తుంది. ఒకసారి ఇది మొక్కలను తాకితే, మొక్కల కణజాలాన్ని సోకడం ద్వారా పెరుగుతుంది. సరైన అనుకూల పరిస్థితులలో, మొదట ఫంగస్ సంక్రమించిన తర్వాత 7-10 రోజులలోపు తదుపరి తరం బీజాంశాలను ఉత్పత్తి చేస్తుంది. శిలీంధ్రం బీజాంశాలను ఉత్పత్తి చేయడానికి చల్లని, తడి మరియు మేఘావృత వాతావరణం అవసరం మరియు ఈ వాతావరణ పరిస్థితులలో ఇది తీవ్రతరం కావచ్చు. ఎండ, వేడి మరియు పొడి వాతావరణంలో ఈ శీలింద్రం ఎదుగుదల తక్కువగా ఉంటుంది.