అల్లం

వేరు కుళ్ళు తెగులు

Pythium aphanidermatum

శీలీంధ్రం

క్లుప్తంగా

  • పసుపు పచ్చ ఆకులు.
  • కుళ్ళినపోయిన వేర్లు.
  • గోధుమ రంగులోనికి మారిన రైజోమ్ కణజాలం.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
అల్లం
పసుపు

అల్లం

లక్షణాలు

స్యుడో స్టెమ్స్ ఆకు తొడిమ వద్ద సంక్రమణ ప్రారంభమై పైకి క్రిందికి వ్యాపిస్తుంది. ప్రభావిత కాడ ప్రాంతంలోని కాండం ఉబ్బిపోయి, తరువాతి దశలో, వేరు కూడా సంక్రమణకు గురవుతుంది. దిగువ ఆకుల కొనలు లేత పసుపు రంగులోకి మారి క్రమంగా ఆకు కొనలకు వ్యాపిస్తాయి. సంక్రమణ ప్రారంభ దశలో ఆకుల మధ్య భాగం ఆకుపచ్చగా ఉంటాయి, కానీ అంచులు పసుపు రంగులోకి మారతాయి. పసుపు రంగులోకి మారిన తరువాత స్యుడో స్టెమ్స్ వాలిపోవడం, వాడిపోవడం మరియు ఎండిపోవడం జరుగుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

సూక్ష్మజీవుల కార్యకలాపాలు మరియు పోషక లభ్యతను పెంచడానికి ప్రతి మల్చింగ్ తర్వాత ఆవు పేడ నీళ్ళను మరియు ద్రవ పశువుల ఎరువును చల్లండి. వ్యాధి నిరోధకతను కలిగిన లేదా తట్టుకునే రకాలను నాటండి. మొక్కజొన్న, పత్తి లేదా సోయాబీన్‌తో పంట మార్పిడి చేయండి. ట్రైకోడెర్మా యొక్క విరుద్ధ జాతులైన టి. విరిడే, టి. హర్జియానమ్ మరియు టి. హమాటం వంటి జాతులు వ్యాధికారక శిలీంధ్ర పెరుగుదలను నిరోధిస్తాయి (40గ్రా/చ.మీ).

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. వ్యాధి సంక్రమించకుండా నివారించేందుకు, నిల్వ చేయడానికి ముందు మరియు నాటడానికి ముందు విత్తన రైజోమ్‌లను మాంకోజెబ్ 0.3% తో 30 నిమిషాల పాటు చికిత్స చేయండి.

దీనికి కారణమేమిటి?

నైరుతి రుతుపవనాల ప్రారంభంతో నేలలో తేమ పెరగడంతో పైథియం అఫనిడెర్మాటం అనే మట్టిలో పుట్టే ఫంగస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఫంగస్ రెండు విధాలుగా మనుగడ సాగిస్తుంది. ఒకటి, ఇది విత్తనాల కోసం ఉంచిన వ్యాధిగ్రస్తమైన రైజోమ్‌లలో, మరియు రెండవది, క్లామిడోస్పోర్స్ మరియు ఓస్పోర్‌ల వంటి వాటి ద్వారా వ్యాధి సోకిన రైజోమ్‌ల నుండి మట్టి లోకి చేరుకుంటుంది. చిన్న మొలకలు దీనికి ఎక్కువగా గురవుతాయి మరియు నెమటోడ్ ముట్టడి ద్వారా వ్యాధి తీవ్రమవుతుంది. 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత మరియు నేలలో అధిక తేమ ఈ వ్యాధికి అనుకూలంగా ఉండే ముఖ్యమైన ముందస్తు కారకాలు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల పొలంలో నీరు నిలిచి ఉండే పరిస్థితులు కూడా పొలంలో వ్యాధి తీవ్రతను పెంచుతాయి.


నివారణా చర్యలు

  • సరైన డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి, నాటడానికి బాగా ఆరిన నేలలను ఎంచుకోండి.
  • వ్యాధి సోకిన మొక్కలను తొలగించడం మరియు నాశనం చేయడం వంటి ఫైటోసానిటరీ చర్యలను అనుసరించండి.
  • నాటే సమయంలో ఎకరానికి 4-4.8 టన్నుల పచ్చి ఆకులతో (వైటెక్స్ నెగుండో) కప్పిపెట్టండి.
  • నాటిన 40 నుండి 90 రోజులకు ఎకరానికి 2 టన్నులతో తిరిగి మల్చింగ్ చేయండి కనీసం 2-3 సంవత్సరాలు పంట మార్పిడి చేయండి.
  • మట్టి కి సవరణలు చేయటానికి చ.మీ కు 250 గ్రాముల వేప చెక్క మరియు సున్నం వేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి