కాఫీ

కాఫీ పంటలో తుప్పు తెగులు

Hemileia vastatrix

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకుల దిగువ భాగంలో చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు మరియు మరియు పైభాగంలో వాటికి సంబంధించి పత్రహరితం కోల్పోయిన అతుకులు కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
కాఫీ

కాఫీ

లక్షణాలు

కాఫీ మొక్క ఆకులపై 2-3 మిమీ వ్యాసం కలిగిన పసుపు రంగు మచ్చ వృద్ధి చెందడం ప్రారంభ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ మచ్చలు పెద్ద గుండ్రని మచ్చలుగా విస్తరిస్తాయి, ఇవి ప్రకాశవంతమైన నారింజ నుండి ఎరుపు రంగులోకి మారుతాయి మరియు చివరకు పసుపు అంచుతో కూడిన గోధుమ రంగులోకి మారుతాయి. ఈ సంబంధిత మచ్చలు ఆకు దిగువ భాగంలో నారింజ నుండి గోధుమ రంగు వరకు పౌడర్ లాగా కనిపించే బీజాంశాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. చివరికి ఆకులు రాలిపోతాయి. ఆకులు లేకపోవడం వల్ల, కిరణజన్య సంయోగక్రియ జరగదు మరియు మొక్కలకు పోషకాలు అందకపోవడం వల్ల కాఫీ దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

వ్యాధిని నియంత్రించడానికి వాణిజ్యపరమైన జీవ నియంత్రణ వ్యూహాలు ఎక్కువగా అందుబాటులో లేవు. వ్యాధిని నియంత్రించడంలో నివారణను పరిగణనలోకి తీసుకోవడం అత్యంత ప్రభావవంతమైన ఫలితాలను అందిస్తుంది.

రసాయన నియంత్రణ

నివారణ చర్యలు మరియు అందుబాటులో ఉన్న జీవ చికిత్సలతో పాటు ఎల్లప్పుడూ సమీకృత విధానాన్ని పరిగణలోకి తీసుకోండి. వ్యాధికి అనుకూలమైన పర్యావరణ కారకాలు సంభవించే ముందు ఒకసారి మరియు ఈ కాలం ముగిసిన తర్వాత మరొకసారి బోర్డియక్స్ మిశ్రమం లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 50% డబ్ల్యు జి యొక్క రోగనిరోధక మందును పిచికారీ చేయవచ్చు.

దీనికి కారణమేమిటి?

హెమిలియా వాస్టాట్రిక్స్ అనే ఫంగస్ వల్ల నష్టం జరుగుతుంది. కాఫీ తుప్పు తెగులు చాలా త్వరగా వ్యాపిస్తుంది మరియు ఫంగస్ వ్యాప్తిలో పర్యావరణ కారకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. గాలి లేదా నీరు ఈ తెగులు వ్యాప్తికి అత్యంత ముఖ్యమైన సాధనాలుగా ఉంటాయి. గాలివాటుకి దుమ్ము మరియు శిలీంధ్ర బీజాంశాలు పొలం నుండి కొట్టుకుపోయి మరొక పొలంలో మొక్కలకు సంక్రమిస్తాయి లేదా వర్షం కురిసినప్పుడు ఈ బీజాంశాలు నేలమీద పడి మొక్కపై చిమ్మినప్పుడు అవి వ్యాపిస్తాయి. తడి తేమతో కూడిన వాతావరణంలో కాఫీ తుప్పు తెగులు బాగా వృద్ధి చెందుతుంది మరియు ఆకులపై వర్షపు తుంపర పడడం వలన ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు బీజాంశం వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన చెట్ల కాఫీ బీన్స్ చాల పేలవంగా అభివృద్ధి చెందుతాయి మరియు బరువు తక్కువగా ఉంటాయి. కాఫీ తుప్పు వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రాంతంలో 75% కంటే ఎక్కువ దిగుబడి నష్టాన్ని కలిగిస్తుంది.


నివారణా చర్యలు

  • ఒకటి కంటే ఎక్కువ కాఫీ విత్తన రకాలను నాటండి మరియు ఒకే రకం పంటలను వేయకండి.
  • దీర్ఘకాల తేమను నిరోధించడానికి మరియు చెట్ల పందిరిలోకి శిలీంధ్ర నాశినులను సులభంగా పిచికారీ చేయడానికి వీలుగా మొక్కల మధ్యన ఎక్కువ అంతరం మరియు సరైన కత్తిరింపును ప్రాక్టీస్ చేయండి.
  • వ్యాధి వ్యాప్తికి సహజ అడ్డంకులుగా పనిచేసే మొక్కలు మరియు పొదలను ఎక్కువగా ఉపయోగించండి.
  • కాఫీ లో తుప్పు తెగులును సమర్థవంతంగా నిరోధించడానికి ఆరోగ్యకరమైన కాఫీ చెట్లకు సరైన పోషకాలను అందించండి.
  • తెగులు సోకిన మొక్కలను నాశనం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి