అల్లం

అల్లం పంటలో ఆకు మచ్చ తెగులు

Phyllosticta zingiberis

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకులపై నీటిలో తడిచినట్టు వున్న మచ్చలు.
  • తెలుపు మచ్చల చుట్టూ ముదురు అంచు మరియు పసుపు రంగు వలయం.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
అల్లం

అల్లం

లక్షణాలు

ఈ వ్యాధి లేత ఆకులపై చిన్న, కోలాకారపు నీటిలో తడిచిన మచ్చలుగా మొదలవుతుంది. తరువాత ఇవి చుట్టూ ముదురు అంచుతో మరియు పసుపు రంగు వలయంతో మధ్యలో తెల్లని మచ్చలుగా మారతాయి.ఈ మచ్చలు విస్తరించి ఒకదానితో మరొకటి కలిసిపోయి పెద్ద నిర్జీవ గాయాలను ఏర్పరుస్తాయి. ఆకులో ఎక్కువ భాగం వీటితో కప్పబడినప్పుడు, అది ఎండిపోయి చివరికి చనిపోతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ వ్యాధికి జీవ నియంత్రణ విధానం గురించి ఈ రోజు వరకు మాకు తెలియదు. వ్యాధి సంభవం లేదా లక్షణాల తీవ్రతను తగ్గించడానికి ఏదైనా విజయవంతమైన పద్ధతి మీకు తెలిస్తే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. ఈ వ్యాధిని మొదటి సారి గుర్తించినప్పుడు బోర్డియక్స్ మిశ్రమం లేదా హెక్సాకోనజోల్(0.1%), ప్రాపికోనజోల్(0.1%)కలిగిన శిలీంధ్ర నాశినులను లేదా కార్బెన్డిజమ్ + మాంకోజెబ్ మిశ్రమాన్ని పిచికారీ చేయండి. 20 రోజుల అంతరంతో మరలా 2 సార్లు ఆకులపైన పిచికారీ చేయండి.

దీనికి కారణమేమిటి?

మట్టితో జీవించే శిలీంధ్రాలైన ఫైలోస్టిక్టా జింగిబెరిస్ వల్ల ఈ లక్షణాలు సంభవిస్తాయి. మట్టిలో లేదా వ్యాధి సోకిన మొక్కల అవశేషాల్లో వుండే బీజాంశం ద్వారా ప్రాథమిక సంక్రమణ సంభవిస్తుంది. ద్వితీయ సంక్రమణకు గాలి మరియు వర్షపు తుంపర్లు కారణంమౌతాయి. అధిక తేమ మరియు 20°C మరియు 28°C మధ్య ఉష్ణోగ్రతలు వ్యాధికారకానికి అనుకూలంగా ఉంటాయి. ఈ వ్యాధి రైజోమ్‌ల సంఖ్య మరియు పరిమాణంలో గణనీయమైన తగ్గింపుకు దారితీస్తుంది. రెండు వారాల వయసున్న ఆకులు ఈ వ్యాధి కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే మధ్యస్త నిరోధక రకాలను సాగు చేయండి.
  • ఆకులను త్రుంచి తొలగించండి/లేదా వ్యాధి సోకిన మొక్కలను వేర్ల నుండి తొలగించి నాశనం చేయండి.
  • మట్టి పైకి చిమ్మకుండా ఉండడానికి పచ్చి ఆకులతో మట్టిని కప్పండి.
  • ఈ వ్యాధి మళ్ళీ రాకుండా పంట భ్రమణం సహాయపడవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి