బార్లీ

బార్లీలో నల్ల బూజు తెగులు

Ustilago segetum var. hordei

శీలీంధ్రం

క్లుప్తంగా

  • నల్లని గింజలు.
  • ముడుతలు పడిన మరియు వికృతంగా మారిన కంకి కొనలు.
  • మొక్కల ఎదుగుదల తగ్గడం.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
బార్లీ

బార్లీ

లక్షణాలు

ప్రభావిత మొక్కలు సాధారణంగా కంకులు ఏర్పడేవరకు ఎటువంటి లక్షణాలను ప్రదర్శించవు. సాధారణంగా తెగులు సోకిన కంకులు, ఆరోగ్యకరమైన కంకులు ఏర్పడే సమయంలో లేదా కొంచెం ఆలస్యంగా ఏర్పడతాయి. అవి తరచుగా ప్రధానమైన ఆకు క్రింద ఉన్న కోశం ద్వారా బయటపడతాయి. గింజలు రంగు మారడం, నలుపు రంగు గింజలు అత్యంత స్పష్టమైన లక్షణం. తెగులు సోకిన కంకులలోని గింజలు గట్టి, బూడిద-తెలుపు పొరల్లో ఉంచబడతాయి. పంట కోత సమయానికి గింజలు పూర్తిగా బీజాంశంతో నింపబడతాయి. కంకి కొనలు వికృతంగా కనిపిస్తాయి. మొక్కల ఎదుగుదల కుంగిపోవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ట్రైకోడెర్మా హార్జియానం, టి.విరిడి మరియు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ వంటి జీవ-నియంత్రణ ఏజెంట్లతో విత్తనాలను శుద్ధి చేయడం వల్ల వ్యాధిని నియంత్రించడంలో శిలీంద్రనాశినుల కంటే తక్కువ ప్రభావవంతంగా ఉంటుంది.

రసాయన నియంత్రణ

నివారణ చర్యలు మరియు అందుబాటులో ఉన్న జీవ చికిత్సలతో కూడిన సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. ఒక కిలో విత్తనాలకు కార్బెండజిమ్ 50 WP (2.5 గ్రా), మాంకోజెబ్ 50 WP + కార్బెండజిమ్ 50 WP (1 గ్రా), కార్బాక్సిన్ 37.5 WP + థైరామ్ 37.5 WP (1.5 గ్రా) మరియు టెబుకోనజోల్ 2 DS (1.5 గ్రా) తో విత్తన శుద్ధి చేయడం ద్వారా పూర్తి వ్యాధి నియంత్రణ సాధించబడింది.

దీనికి కారణమేమిటి?

ఉస్టిలాగో సెగెటమ్ వర్ హార్డెయి అనే వ్యాధికారక జీవుల కారణంగా లక్షణాలు ఏర్పడతాయి. ఇది విత్తనం ద్వారా సంక్రమిస్తుంది, అంటే వ్యాధి సోకిన మొక్కల తలలు, ఆరోగ్యంగా వున్న గింజలకు బీజాంశాలను వ్యాప్తి చేస్తాయి. పంట కోత తర్వాత బార్లీని నూర్పిడి చేస్తున్నపుడు, బీజాంశ ద్రవ్యరాశి విడిపోయి అనేక బీజాంశాలు విడుదలవుతాయి. చాలా బీజాంశాలు ఆరోగ్యంగా వున్న గింజలపై పడి విత్తనం విత్తే వరకు నిద్రాణ స్థితిలో ఉంటాయి. బార్లీ విత్తనం మొలకెత్తడం ప్రారంభించినప్పుడు బీజాంశం కూడా మొలకెత్తుతుంది మరియు మొలకకు సోకుతుంది. వెచ్చని, తేమ, ఆమ్ల నేల మొలకలపై సంక్రమణకు అనుకూలంగా ఉంటుంది. 10°C మరియు 21°C మధ్య ఉష్ణోగ్రత కలిగిన నేల ఈ వ్యాధి అంకురోత్పత్తి కి అనుకూలంగా ఉంటుంది. కొన్నిసార్లు మసి బూజు తెగులు మరియు లూజ్ స్మట్ తెగులు మధ్య తేడాని గుర్తించడం కష్టం.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే వ్యాధి నిరోధక రకాలను ఉపయోగించండి.
  • నాటడానికి వ్యాధి రహిత విత్తనాలను ఉపయోగించండి.
  • విత్తనాలను మధ్యస్తంగా పొడిగా వుండే నేలలో విత్తండి.
  • 2.5 సెంటీమీటర్ల లోతులో విత్తనాలను నాటడం ద్వారా వ్యాధి సోకే అవకాశాన్ని తగ్గించవచ్చు.
  • వీలైతే ఆమ్ల నేలల్లో కాకుండా తటస్థ లేదా క్షార నేలలో బార్లీని నాటండి.
  • తెగులు సోకిన మొక్కలను వాటి వేర్లతో పాటు తొలగించి కాల్చివేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి