ద్రాక్ష

ద్రాక్షలో నల్ల కుళ్ళు తెగులు

Phyllosticta ampelicida

శీలీంధ్రం

క్లుప్తంగా

  • నల్లటి అంచుతో ఆకులపై మచ్చలు ఏర్పడతాయి.
  • చిగుర్లు, కాండం మరియు ఆకు కాడలు కూడా ప్రభావితమవుతాయి.
  • నల్ల పండు తెగులు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ద్రాక్ష

లక్షణాలు

ఆకులపై ఒక క్రమంలో లేని మచ్చలు కనిపిస్తాయి. ఇవి చుట్టూ ఒక నల్లని రేఖతో ఉంటాయి. చిగుర్లు, కాండం మరియు ఆకు కాడలపై కూడా ఈ మచ్చలు ఏర్పడతాయి ఆకు కాడలు కూడా ప్రభావితమైతే మొత్తం ఆకులు ఎండిపోతాయి. మొదట్లో ద్రాక్ష బూడిద రంగులోకి మారుతుంది. తరువాత ఈ మచ్చలు ఎరుపు-గోధుమ లేదా ఊదా రంగులోకి మారతాయి. పండు వికృతంగా మారి చివరికి కుంచించుకుపోతుంది మరియు నల్లని మమ్మీగా మారుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

వికసించే దశ పూర్తయిన వెంటనే మీరు బాసిల్లస్ తురింగియెన్సిస్‌ని పిచికారీ చేయవచ్చు.

రసాయన నియంత్రణ

నివారణా పద్ధతిలో రసాయనాలు వాడబడతాయి. కప్తాన్ + మైకోబుటానిల్ లేదా మాంకోజెబ్ + మైకోబుటానిల్‌తో వికసించడానికి సుమారు రెండు వారాల ముందు పిచికారీ చేయడం ప్రారంభించండి. మొగ్గలు వికసించే ముందు కార్బరిల్ లేదా ఇమిడ్‌క్లోప్రిడ్‌ను కూడా ఉపయోగించవచ్చు. వికసించిన తర్వాత మాంకోజెబ్ + మైకోబుటానిల్, ఇమిడాక్లోప్రిడ్ లేదా అజాడిరాచ్టిన్ ను పిచికారీ చేయండి. మొగ్గలు వికసించిన పది రోజుల తరువాత, మీరు మీ తీగలకు కప్తాన్ మరియు సల్ఫర్ మిశ్రమాన్ని కూడా వాడవచ్చు. చాలా ద్రాక్ష రకాలు వికసించిన మూడు నుండి నాలుగు వారాల తర్వాత సంక్రమణకు నిరోధకతను కలిగి ఉంటాయి కాబట్టి, ఆ సమయంలో రసాయనాల పిచికారీలను నివారించాలి.

దీనికి కారణమేమిటి?

ఫిలోస్టిక్ట యాంపెలిసిడా అనే ఫంగస్ వల్ల ఈ నష్టం జరుగుతుంది. ఈ వ్యాధికారకం ద్రాక్షతోటలో తెగులు సోకిన చిగుర్లు లేదా పండ్ల మమ్మీలలో లేదా నేల మీద చలికాలంలో జీవించి ఉంటుంది బీజాంశం తేలికపాటి వర్షపాతం ద్వారా బైట పడుతుంది మరియు తరువాత గాలి ద్వారా వెదజల్లబడుతుంది. 25°C మరియు 6 గంటలపాటూ స్థిరమైన ఆకు తడి దీనికి సరైన వృద్ధి పరిస్థితులు. వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణాన్ని ఫంగస్ ఇష్టపడుతుంది. పండ్ల దిగుబడి తగ్గుతుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే మరింత వ్యాధి నిరోధక రకాన్ని ఎంచుకోండి.
  • తీగ నుండి కుళ్ళిన పండు మమ్మీలను తొలగించండి.
  • పంట కోసిన తర్వాత తెగులు సోకిన కలప మరియు తీగలను తొలగించి నాశనం చేయాలి.
  • తరువాత ద్రాక్షతోట నుండి తెగులు సోకిన ఆకులను తొలగించండి.
  • మీ ద్రాక్షతోటలో కలుపు మొక్కలు లేకుండా ఉంచండి.
  • సరైన గాలి ప్రసరణ మరియు వెలుతురు సోకునట్లు చూడండి.
  • ఏపుగా వచ్చే దశకు ముందు ప్రతి సంవత్సరం తీగలను కత్తిరించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి