Epicoccum sorghinum
శీలీంధ్రం
ప్రారంభ లక్షణాలు చిన్న, పొడవైన, కోలాకారపు మచ్చలను చూపిస్తాయి, ఇవి ముదురు ఆకుపచ్చ నుండి ఎరుపు-గోధుమ రంగు వరకు పసుపు వలయాలతో ఉంటాయి. పాత లక్షణాలు, క్రమరహిత రూపురేఖలు మరియు ఎరుపు-గోధుమ రంగు అంచులతో పెద్దగా, పొడవైన మచ్చలతో ఉంటాయి. ఈ మచ్చలు ఒకదానితో మరొకటి కలిసి పెద్ద ప్యాచీలుగా ఏర్పడతాయి, దీని ఫలితంగా రంగు పాలిపోవడం మరియు నిర్జీవమవ్వడం (క్లోరోసిస్ మరియు నెక్రోసిస్) జరుగుతుంది.
రింగ్ స్పాట్ తీవ్రతను తగ్గించడానికి కాల్షియం సిలికేట్ స్లాగ్‌ను మట్టి దిద్దుబాటుగా ఉపయోగించండి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఇప్పటివరకు, ఈ శిలీంధ్రాలకు వ్యతిరేకంగా రసాయన నియంత్రణ పద్ధతులు అభివృద్ధి చేయబడలేదు.
ఎపికోకమ్ సోర్గినమ్ అనే ఫంగస్ ఈ నష్టానికి కారణంగా ఉంటుంది. ఫంగస్ యొక్క బీజాంశాలు గాలి లేదా వర్షం ద్వారా వ్యాప్తి చెందడం వలన ఈ వ్యాధి విస్తరిస్తుంది. ఫంగస్ వృద్ధి చెందడానికి వెచ్చని, తేమతో కూడిన పరిస్థితులు అవసరం. ఇది సాధారణంగా బాగా ముదురు ఆకులను ప్రభావితం చేస్తుంది, అందువలన ఇది ఆర్ధిక ప్రాముఖ్యత అధికంగా లేని చిన్న వ్యాధిగా పరిగణించబడుతుంది.