Diplocarpon mali
శీలీంధ్రం
వేసవి చివరిలో ముదురు ఆకుల పైభాగంలో ముదురు మచ్చలు(5-10 మిమీ) కనిపించడం ప్రారంభిస్తాయి. వసంత ఋతువులో మరియు వేసవి ప్రారంభంలో వర్షాల తర్వాత లక్షణాలు స్థిరంగా కనిపిస్తాయి. ముదురు ఆపిల్ మొక్కల ఆకులు లేత వాటి కంటే ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతాయి. సాధారణంగా ఈ మచ్చలు బూడిద, గోధుమ రంగుతో, కొనల వద్ద కొద్దిపాటి ఊదా రంగుతో ఉంటాయి. వ్యాధి లక్షణాలు ఆకు యొక్క పైభాగంలో ముదురు ఆకుపచ్చ వృత్తాకార అతుకుల రూపంలో కనిపిస్తాయి, ఇవి కొంత కాలానికి 5-10 మిమీ పరిమాణంలో ముదురు గోధుమ రంగు ఆకు మచ్చలుగా మారుతాయి. పరిపక్వతకు వచ్చినప్పుడు ఇది ఆకుల దిగువ భాగంపై కూడా వృద్ధి చెందుతుంది. వాణిజ్య సాగు రకాలలో, వివిధ పరిమాణాలలో (3-5 మిమీ వ్యాసం) వృత్తాకార ముదురు గోధుమ రంగు మచ్చలను ఏర్పరచడం ద్వారా పండుపై కూడా ఈ ఫంగస్ దాడి చేస్తుంది. ఉపరితలంపై తరచూ చిన్న అలైంగిక ఫలాలు కనిపిస్తాయి. అధిక సంఖ్యలో గాయాలు ఏర్పడినప్పుడు అవి ఒకదానితో మరొకటి కలిసిపోయి, చుట్టు పక్కల భాగాలు పసుపు రంగులోకి మారుతాయి. ఇలాంటి తీవ్రమైన ముట్టడి ఆకులు రాలుటకు దారితీస్తుంది. తరచుగా కానప్పటికీ ఈ ఫంగస్ పండ్లకు కూడా సంక్రమించగలదు.
యాసిడ్-క్లే మైకో-సిన్, ఫంగూరాన్ (కాఫర్ హైడ్రాక్సైడ్), క్యూరాషియో ( లైమ్ సల్ఫర్) లేదా సల్ఫర్ ప్రతి ఉత్పత్తిని సంవత్సరానికి 10-12 సార్లు పిచికారీ చేయండి. అదేవిధంగా, ఓవర్ వింటర్ ఆకులపై యూరియాను చల్లడం వల్ల ప్రాధమిక ఇన్నోకులం స్థాయిని తగ్గిస్తుంది.
అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణా చర్యలతో కూడిన సమగ్ర సస్య రక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. తెగులు సోకిన తర్వాత నివారణకు ఉపక్రమించడానికంటే సోకకుండా ముందు శిలీంద్ర నాశినులను వాడడం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. మాంకోజెబ్, డోడిన్ మరియు ట్రిఫ్లోక్సిస్ట్రోబిన్ వంటి క్రియాశీల పదార్ధాలు కలిగిన శిలీంద్ర నాశినులను వాడండి. ఇవి తెగులు సంక్రమణను గణనీయంగా తగ్గిస్తాయి. పంట కోసిన తర్వాత కాపర్-ఆక్సిక్లోరైడ్ ను వాడండి. సమర్థవంతమైన నియంత్రణ మరియు తెగుళ్ల నిరోధకతను పెంచుకునే అవకాశాలను తగ్గించడానికి డోడిన్ + హెక్సాకొనజోల్, జినెబ్ + హెక్సాకొనజోల్, మాంకోజెబ్ + పైరాక్లోస్ట్రోబిన్ కలయికలో శిలీంద్ర నాశినులను వాడండి. మాంకోజెబ్ (0.3%), కాపర్ ఆక్సిక్లోరైడ్ (0.3%), జినెబ్ (0.3%), మరియు హెచ్ ఎం 34.25 ఎస్ ఎల్ (0.25%), డోడిన్ (0.075%) మరియు డితియానాన్ (0.05%) రక్షణాత్మకమైన స్ప్రేలు ఈ రంగంలో పూర్తి వ్యాధి నియంత్రణను అందించాయి.
డిప్లోకార్పాన్ మాలి యొక్క శిలీంద్రం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. స్పష్టంగా కనిపించే లక్షణాలను ప్రదర్శించడానికి శిలీంద్రానికి దాదాపు 40 రోజులు పడుతుంది. సాధారణంగా అస్కోస్పోర్స్ ద్వారా ప్రారంభమవుతాయి, ఇవి ఓవర్‌వింటర్డ్ ఆకులపై ఉత్పత్తి చేయబడతాయి. సాధారణంగా బీజాంశం విడుదలకు వర్షం అవసరం. 23.5°C మరియు 20 మిమీ వర్షపాతం దీనికి అనుకూలంగా ఉంటుంది. ఇది వృద్ధి చెందడానికి 25°C రోజువారీ ఉష్ణోగ్రత మరియు 20 మిమీ వర్షపాతం అవసరం. ఆపిల్ పండు యొక్క వృద్ధి దశల్లో అధిక వర్షపాతం మరియు 20-22°C ల మితమైన ఉష్ణోగ్రత ఈ వ్యాధికి అనుకూలంగా ఉంటుంది.