మామిడి

మామిడిలో స్టెమ్ ఎండ్ రాట్ తెగులు (కాడ చివర కుళ్ళు తెగులు)

Lasiodiplodia theobromae

శీలీంధ్రం

క్లుప్తంగా

  • పండ్లు, బెరడు మరియు ఆకులు రంగు మారతాయి.
  • కొమ్మలు చనిపోతాయి.
  • ఆకులు రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

మామిడి

లక్షణాలు

రెమ్మలు చనిపోయి చెట్టు నుండి రాలిపోవచ్చు. ఇన్ఫెక్షన్ పాయింట్ చుట్టూ క్యాంకర్లు కనిపిస్తాయి, తరువాత ఇవి చెక్క నిర్జీవంగా మారడం (ప్రభావిత మొక్క భాగం నల్లబడటం) పైనుండి క్రిందకి చనిపోవడానికి కారణమవుతాయి. కొమ్మలు కూడా జిగురు బిందువులను స్రవిస్తాయి, తరువాత ఇవి చాలా కొమ్మలను కవర్ చేస్తాయి. పండ్లు కుళ్లిపోవడం ఎక్కువగా పంట కోత తర్వాత గమనించవచ్చు మరియు కాడ చివరలో కుళ్లిపోవడం ప్రారంభమవుతుంది. దీని ప్రభావానికి గురైన భాగం మొదట బూడిద రంగులోకి మారుతుంది మరియు తరువాత నల్లగా మారుతుంది. తీవ్రమైన ముట్టడిలో పండు పూర్తిగా కుళ్లిపోయి మమ్మీలా మారుతుంది. పండ్ల కండ కూడా రంగు మారిపోతుంది. పండ్లలో, కాడ దగ్గరిభాగంలో పై తొక్క ముదురు రంగులోకి మారుతుంది. ప్రభావిత ప్రాంతం విస్తరించి వృత్తాకార, నల్ల పాచ్ లా ఏర్పడుతుంది. ఇది తేమతో కూడిన ఉష్ణోగ్రతలో వేగంగా విస్తరించి రెండు లేదా మూడు రోజుల్లో మొత్తం పండును పూర్తిగా నల్లగా మారుస్తుంది. పండు గుజ్జు మెత్తబడి గోధుమ రంగులోకి మారుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

బాసిల్లస్ సబ్టిలిస్ మరియు క్శాంతోమోనాస్ ఒరిజా పివి. ఒరిజా లను ఈ వ్యాధిని నియంత్రించడానికి ఉపయోగించవచ్చు. ట్రైకోడెర్మా హర్జియానమ్ ను కూడా ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. వ్యాధి వ్యాప్తిని నివారించడానికి మీరు కత్తిరింపు తర్వాత పెద్ద కోతలపై శిలీంద్ర నాశినులు (పెయింట్స్, పేస్ట్) వాడవచ్చు. కార్బెండజిమ్ (50 డబ్ల్యు పి) లేదా థియోఫనేట్-మిథైల్ (70 డబ్ల్యు పి) ను 1 పి పి ఎం . ఏ ఐ లేదా అంత కంటే ఎక్కువ వ్యాధి తీవ్రతను తగ్గించడానికి పిచికారీ చేయండి. పంట కోతకు 15 రోజుల ముందు కార్బెండజిమ్ (0.05%) మరియు ప్రొపికోనజోల్ (0.05%) ల పిచికారీ, స్టెమ్ ఎండ్ రాట్ తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉన్నట్లు తేలింది. పంటకోత తర్వాత వేడి నీరు మరియు కార్బెండజిమ్‌తో చికిత్స, సెమ్ ఎండ్ రాట్‌కు వ్యతిరేకంగా పాక్షికంగా ప్రభావం చూపిస్తుంది నియంత్రిత వాతావరణ నిల్వ సమయంలో స్టెమ్ ఎండ్ రాట్ నియంత్రణ కోసం, ప్రోక్లోరాజ్ తరువాత వేడి కార్బెండజిమ్, ఈ రెండింటితో చికిత్స అవసరం.

దీనికి కారణమేమిటి?

మట్టిలో వుండే ఫంగస్ లాసియోడిప్లిడియా థియోబ్రోమే వల్ల ఈ నష్టం జరుగుతుంది, ఇది విస్తృత అతిధి మొక్కల పరిధిని కలిగి ఉంటుంది మరియు ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలు అంతటా కనిపిస్తుంది. ఇది పొలంలో పంటను మరియు నిల్వ చేసిన పంటను కూడా దెబ్బతీస్తుంది. పంట అవశేషాలపై ఇది పైక్నిడియాగా మనుగడ సాగిస్తుంది. బీజాంశం గాలి మరియు వర్షపు తుంపర్ల ద్వారా చెదరగొట్టబడుతుంది మరియు తాజాగా కత్తిరించిన లేదా దెబ్బతిన్న మొక్కల భాగాల ద్వారా అతిధి మొక్కలలోకి ప్రవేశిస్తుంది. నీటి ఒత్తిడికి గురైన మొక్కలు మరింత తీవ్రమైన లక్షణాలను చూపుతాయి. అధిక ఉష్ణోగ్రతలు మరియు అధిక వర్షపాతం వ్యాధికి అనుకూలంగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • మంచి పరిశుభ్రతా ప్రమాణాలను పాటించండి.
  • తడి వాతావరణంలో కత్తిరింపు మానుకోండి మరియు కత్తిరింపు గాయాలను తగ్గించండి.
  • తెగులు సోకిన మొక్కల భాగాలను తొలగించండి.
  • పండించిన పండ్లను 48°C వేడి నీటిలో 20 నిమిషాలపాటు ముంచి ఉంచండి.
  • మీ పండ్లను 10°C లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి