క్యాబేజీ

రింగ్ స్పాట్

Mycosphaerella brassicicola

శీలీంధ్రం

క్లుప్తంగా

  • చుట్టూ పసుపు రంగు వలయంతో నల్లటి మచ్చలు.
  • మచ్చల లోపల ముదురు రంగు కేంద్రీకృత వలయాలు.
  • ఆకులు పసుపు రంగులోకి మారుతాయి.
  • ఆకులు అకాలంగా రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
క్యాబేజీ
కాలీఫ్లవర్

క్యాబేజీ

లక్షణాలు

సాధారణంగా ముదురు ఆకులపై లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి, కానీ లేత ఆకులు ప్రభావితమైతే లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. ప్రారంభంలో ఆకు ఉపరితలంపై చుట్టూ పసుపు రంగు వలయంతో, 3-5 మిమీ పరిమాణంలో చిన్న ముదురు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఆకుపచ్చ-గోధుమ లేదా బూడిద-నలుపు రంగులో వుండి ఆకు ఈనెల వరకు పరిమితం చేయబడతాయి.చివరికి 2-3 సెం.మీ. పరిమాణానికి చేరతాయి. మచ్చల లోపల చిన్న నల్లటి చుక్కలు కేంద్రీకృత వలయాలుగా ఏర్పడతాయి. ఈ మచ్చలు కలిసిపోయి ఆకు పసుపు రంగులోకి మారవచ్చు. సంక్రమణ తీవ్రంగా వుంటే అది ఆకులు అకాలంగా రాలిపోవడానికి దారితీస్తుంది. ఆకు ఈనెల రింగ్ స్పాట్ ఫంగస్ వల్ల ఏర్పడిన మచ్చలు ఆల్టర్నేరియా జాతుల వల్ల కలిగిన మచ్చలు వలే కనిపిస్తాయి. ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే రింగ్ స్పాట్ గాయాలు బూడిద రంగులో ఉంటాయి మరియు అవి కేంద్రీకృత రింగులలో పిన్‌ హెడ్ పరిమాణంలో నలుపు రంగు చుక్కలను కలిగి ఉంటాయి. నేలకి పైన వున్న మొక్క అన్ని భాగాలూ లక్షణాలను చూపించవచ్చు. గాయాలు నల్లటి ఫలాల నుండి ముదురు రంగు కేంద్రీకృత వలయాలను, పసుపురంగు జోన్ చుట్టూ ఖచ్చితమైన అంచులను కలిగి ఉంటాయి. తీవ్రమైన సంక్రమణలో ఈ మచ్చలు ఒకదానితో మరొకటి కలిసిపోతాయి మరియు మొత్తం మొక్క ప్రభావితమై నల్లబడవచ్చు. విత్తన కాడలలో ఈ ఫంగస్, 2,4-డి అనే కలుపు నాశిని వల్ల కలిగే గాయం లాంటి వక్రీకరణకు కారణమవుతుంది. నిల్వ చేసిన క్యాబేజీపై ముదురు రంగు గాయాలు ఏర్పడవచ్చు మరియు లోతుగా చొచ్చుకుపోవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఇప్పటి వరకూ ఈ వ్యాధికి వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న జీవ నియంత్రణా పద్ధతి గురించి మాకు తెలియదు. లక్షణాల సంభవం లేదా తీవ్రతను తగ్గించడానికి ఏదైనా విజయవంతమైన పద్ధతి మీకు తెలిస్తే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. విత్తనాలు నాటడానికి ముందు తీరం లేదా మాంకోజెబ్‌తో చికిత్స చేయండి. చల్లని మరియు తేమతో కూడిన వాతావరణంలో క్లోరోథనోనిల్, మాంకోజెబ్ లేదా రాగిని పిచికారీ చేయాలి. అధిక సంఖ్యలో గాలిలో ఉండే బీజాంశాల కారణంగా కూరగాయల ఉత్పత్తి ఎక్కడ అధికంగా జరుగుతుందో అక్కడ దీన్ని నియంత్రించడం కష్టం. పర్యావరణ పరిస్థితులు చల్లని మరియు తడిగా ఉన్న ప్రదేశం ఈ వ్యాధి వ్యాప్తి మరియు సంక్రమణకు అనుకూలంగా ఉంటుంది.

దీనికి కారణమేమిటి?

గాలి ద్వారా వ్యాప్తి చెందే మైకోస్‌ఫారెల్లా బ్రాసిసికోలా అనే వ్యాధికారకం వల్ల నష్టం జరుగుతుంది. బీజాంశాలు నీటి తుంపర్లు, గాలి మరియు వర్షం ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఫంగస్ పునరుత్పత్తి కోసం కనీసం నాలుగు రోజులు ఉండే 100% సాపేక్ష ఆర్ద్రత కాలం అవసరం.16-20°C ఉష్ణోగ్రతలు మరియు పేలవమైన నేల డ్రైనేజి వ్యాధికారకం యొక్క పెరుగుదలకు తోడ్పడతాయి. ఈ వ్యాధి ఎక్కువగా విత్తనాల ఉత్పత్తికి సంబంధించిన సమస్య, మరియు విత్తనాలు వ్యాధికారక కారకాన్ని కలిగి ఉండవచ్చు. ఫంగస్ సోకిన కలుపు మరియు పంట అతిధేయ మొక్కలపై లేదా అవశేషాలలో కూడా శీతాకాలం అంతా జీవించి ఉంటుంది. బీజాంశాలు గాలి ద్వారా వ్యాపిస్థాయి. చల్లని తేమ వాతావరణం వ్యాధి వృద్ధికి అనుకూలంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే వ్యాధి నిరోధక రకాలను ఉపయోగించండి.
  • ఆకు మచ్చల కోసం మీ నర్సరీని గమనిస్తూ వ్యాధి సోకిన ఆకును తొలగించండి లేదా ఎక్కువ ఆకులకు మచ్చలు ఉంటే, మొలకలను నాశనం చేయండి.
  • మీ పొలంలో ఆరోగ్యకరమైన మొలకలను మాత్రమే నాటండి.
  • మీ పొలంలో మరియు పొలం చుట్టూ ఉన్న కలుపు మొక్కలను తొలగించండి మరియు నాశనం చేయండి, ఎందుకంటే అవి ప్రత్యామ్నాయ హోస్ట్‌లు కావచ్చు.
  • పంట అవశేషాలను సేకరించి తగలబెట్టడం లేదా పూడ్చడం ద్వారా నాశనం చేయండి.
  • ప్రత్యామ్నాయంగా నేలను దున్నడం ద్వారా మీరు ప్రభావిత అవశేషాలను తిరిగి మట్టిలో కప్పెట్టవచ్చు.
  • పొలంలో తిరిగి నాటడానికి ముందు అవశేషాలు పూర్తిగా కుళ్ళిపోయే వరకు వేచి ఉండండి.
  • ఈ వ్యాధికి ఆతిధ్యం ఇవ్వని రకాలతో 2-3 సంవత్సరాల పాటు పంట మార్పిడి పరిగణలోకి తీసుకోండి.
  • వేడి నీటితో 122°F వద్ద 30 నిమిషాల పాటు విత్తన చికిత్స చేయండి.
  • ఇది విత్తనాల ద్వారా కలిగే ఇన్నోక్యులమ్‌ను తొలగించడానికి ఉపయోగపడుతుంది.
  • ప్రతి విత్తన లాటును కొద్ది పరిమాణంలో చికిత్స చేసి అన్ని విత్తనాలను శుద్ధి చేయడానికి ముందు అంకురోత్పత్తిని పరీక్షించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి