కాఫీ

బ్రౌన్ ఐ మచ్చ తెగులు

Mycosphaerella coffeicola

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకులపై పసుపు రంగు వలయంతో గోధుమ రంగు మచ్చలు, బెర్రీలపై చిన్నవిగా ఉంటాయి, ఆకులు ముందుగానే రాలిపోవడం మరియు కాండం పైనుండి కిందకి చనిపోవడానికి తీవ్రమైన సంక్రమణ కారణమవుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
కాఫీ

కాఫీ

లక్షణాలు

దాదాపు 15 మిమీ వెడల్పు లో లేత గోధుమరంగు/బూడిదరంగు కేంద్రాలతో వృత్తాకార గోధుమ రంగు మచ్చలు, వాటి చుట్టూ వెడల్పాటి ముదురు గోధుమ మరియు పసుపు రంగు వలయాలు ఆకులపై కనిపిస్తాయి. ఈ మచ్చలు ఎక్కువగా ఈనెల మధ్య మరియు అంచుల వద్ద కూడా ఏర్పడతాయి. కొన్నిసార్లు ఈ మచ్చలు పెరిగి పెద్ద మచ్చలుగా మారుతాయి మరియు ఆకు మాడడం జరుగుతుంది. సాధారణంగా 600 మీటర్ల ఎత్తులో చల్లని, తేమ వాతావరణం వల్ల ఇది సంక్రమిస్తుంది. సాధారణంగా బెర్రీల పైన చిన్నగా, సుమారు 5 మిల్లీ మీటర్ల పరిమాణంలో ఏర్పడతాయి, కానీ కొన్నిసార్లు ఇవి మొత్తం బెర్రీని కప్పివేస్తాయి. ఆకులతో పోలిస్తే కాయలపైన ఇవి క్రమరహిత ఆకారంలో ఉంటాయి మరియు ప్రధానంగా ఎండకు గురైన వైపు ఉంటాయి. సంక్రమణ తీవ్రంగా ఉంటే లో ఆకులు ముందుగానే రాలిపోవడం మరియు కాండం పైనుండి కిందకి చనిపోవడం సంభవించవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఇప్పటి వరకు ఈ వ్యాధికి జీవ నియంత్రణ పరిష్కారం అందుబాటులో లేదు. మీకు ఏమైనా తెలిస్తే మమ్మల్ని సంప్రదించండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. అవసరమైతే, కాపర్స్ లేదా ట్రైజోల్స్ వంటి ఉత్పత్తులను ఉపయోగించండి. పుష్పించడం ప్రారంభమైనప్పుడు మూడు నెలల పాటు రాగి పిచికారీలను చేయండి. గమనిక, రాగి శిలీంద్ర నాశినులు ప్రయోజనకరమైన కీటకాలను కూడా చంపవచ్చు.

దీనికి కారణమేమిటి?

మైకోస్‌ఫారెల్లా కాఫీకోలా అనే ఫంగస్ వల్ల మచ్చలు ఏర్పడతాయి. ముఖ్యంగా పూత దశ తరువాత, అధిక తేమ, అధిక వర్షపాతం, వెచ్చని ఉష్ణోగ్రతలు మరియు కరువు ఒత్తిడి దీనికి అనుకూలంగా ఉంటుంది. ఆకు అవశేషాలలో వ్యాధికారక సూక్ష్మజీవి జీవించి ఉంటుంది. బీజాంశాలు, ముఖ్యంగా మొక్కలు తడిగా ఉన్నప్పుడు మరియు మొలకెత్తడానికి నీరు అవసరమైనప్పుడు గాలి మరియు వర్షపు తుంపర్లు మరియు మానవ కదలికల ద్వారా వ్యాప్తి చెందుతాయి. చిన్న చెట్లు మరియు నీడలో లేని చెట్లకు అధికంగా నష్టం వాటిల్లుతుంది.


నివారణా చర్యలు

  • 35-65% నీడతో, తగినంత స్థలం మరియు గాలి ప్రవాహంతో నర్సరీని ఏర్పాటు చేయండి.
  • తగినంత పోషకాలను, ముఖ్యంగా నత్రజని మరియు పొటాషియంను అందించండి.
  • డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయండి.
  • సిఫార్సు చేయబడిన పోషకాలను అందించడం మరియు సరైన డ్రైనేజీని ఏర్పాటు చేయడం ద్వారా తోటలలో మొక్కల ఒత్తిడిని తగ్గించండి.
  • పందిరిలో గాలి కదలికను అనుమతించడానికి వీలుగా మొక్కలను కత్తిరించండి.
  • సంక్రమణ తిరిగి ప్రారంభంకావడాన్ని నివారించడానికి కత్తిరించిన చెత్తను పొలం నుండి తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి