శనగలు & సెనగ పప్పు

శనగలో పొడి వేరు కుళ్ళు

Macrophomina phaseolina

శీలీంధ్రం

క్లుప్తంగా

  • తేమ ఒత్తిడి పరిస్థితులకు పంట గురైనప్పుడు డ్రై రూట్ రాట్ వ్యాధి ఎక్కువగా ఉంటుంది.
  • ఇది అనుకూలమైన పరిస్థితులలో 50 - 100% దిగుబడి నష్టానికి దోహదం చేస్తుంది.
  • వ్యాధికారకం విత్తనం ద్వారా మరియు నేల ద్వారా వృద్ధి చెందుతుంది.
  • పుష్పించే దశలో లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి: ఆకు కాడ మరియు ఆకుల వాలిపోవడం మరియు పచ్చదనం కోల్పోవడం.


శనగలు & సెనగ పప్పు

లక్షణాలు

శనగ పొలాలలో, వ్యాధి యొక్క ఆగమనం మొక్కలు అక్కడక్కడ ఎండిపోయినట్టు కనిపిస్తుంది. వ్యాధి యొక్క మొదటి లక్షణాలు ఆకుల పసుపు రంగులోకి మారడం మరియు ఎండిపోవడం. ఈ సోకిన ఆకులు సాధారణంగా ఒకటి లేదా రెండు రోజుల్లో పడిపోతాయి మరియు వచ్చే రెండు లేదా మూడు రోజుల్లో మొత్తం మొక్క చనిపోతుంది. ప్రభావిత మొక్కల ఆకులు మరియు కాండం సాధారణంగా గడ్డి రంగులో ఉంటాయి, అయితే కొన్ని సందర్భాల్లో, దిగువ ఆకులు మరియు కాడలు గోధుమ రంగును చూపుతాయి. ప్రాధానమైన వేరు, పొడి మట్టిలో చాలా నల్లగా మరియు పెళుసుగా ఉంటుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఆకు, మొదలు, బెరడు, పండ్ల గుజ్జు మరియు నూనె సారంలైన సజల సారం మరియు వేప నూనె, నేల ద్వారా కలిగే వ్యాధికారక M. ఫసోలినా పెరుగుదలను నిరోధిస్తాయి. ట్రైకోడెర్మా వైరైడ్ మరియు ట్రైకోడెర్మా హర్జియానమ్ వంటి విరోధి వ్యాధికారక / బయో కంట్రోల్ ఏజెంట్లు వ్యాధి సంభవం తగ్గించడంలో సహాయపడతాయి. విత్తన శుద్ధి కోసం టి.హర్జియనం + పీ. ఫ్లోరెసెన్స్ (కిలో విత్తనాలకు 5గ్రా) కలయికను వాడి ఆపైన విత్తనాలు నాటే సమయంలో 250 కిలోగ్రాముల పశువులపెంటకు 2.5 కిలోగ్రాముల టి.హర్జియనం + పీ. ఫ్లోరెసెన్స్ ను కలపండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే నివారణ చర్యలు మరియు జీవ చికిత్సలతో సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ ఎంచుకోండి. పొడి వేరు కుళ్ళు యొక్క రసాయన నియంత్రణ ప్రభావవంతంగా ఉండదు, ఎందుకంటే M. ఫసోలినా విస్తృతమైన అతిధేయ పరిధిని కలిగి ఉంటుంది మరియు ఎక్కువ కాలం మట్టిలో ఉంటుంది. ముఖ్యంగా విత్తన దశలో హానికి లోబడే శనగలో నష్టాలను తగ్గించడంలో శిలీంద్ర సంహారిణుల విత్తన చికిత్స కొంతవరకు ప్రభావవంతంగా ఉంటుంది. కార్బెండజిమ్ మరియు మాంకోజెబ్‌తో శిలీంద్ర సంహారిణి విత్తన చికిత్సలు, తరువాత నేలను తడపడం వలన వ్యాధి సంభవం గణనీయంగా తగ్గుతుంది.

దీనికి కారణమేమిటి?

మట్టి ద్వారా వ్యాప్తి చెందే ఈ వ్యాధి శిలీంధ్ర దారాలు లేదా మాక్రోఫోమినా ఫేసోలినా అనే ఫంగస్ యొక్క శిలీంధ్ర దారాలు లేదా బీజాంశాలచే కలిగుతుంది. పరిసర ఉష్ణోగ్రతలు 30 - 35°C మధ్య ఉన్నప్పుడు లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. ఉష్ణోగ్రత పెరుగుదల మరియు తరచుగా తేమ ఒత్తిడితో, సాధారణంగా ఉష్ణమండల తేమతో కూడిన ప్రాంతాల్లో ఫంగస్ మరింత తీవ్రంగా మారుతుంది. ఈ వ్యాధి సాధారణంగా పుష్పించే మరియు కాయ దశలలో కనిపిస్తుంది, సోకిన మొక్కలు పూర్తిగా ఎండిపోయినట్లు కనిపిస్తాయి. అతిధేయ పంట లేనప్పుడు, ఇది మట్టిలో అందుబాటులో ఉన్న చనిపోయిన సేంద్రియ పదార్థాలపై పోటీ సాప్రోఫైట్‌గా మనుగడ సాగిస్తుంది. M. ఫసోలినా అనుకూల పరిస్థితులలో 50 - 100% దిగుబడి నష్టాన్ని కలిగిస్తుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే తట్టుకునే రకాలను ఎంచుకోండి.
  • పరిపక్వత సమయంలో అధిక ఉష్ణోగ్రతను నివారించడానికి పరిపక్వత త్వరగా చెందే రకాలను విత్తండి, తద్వారా సంక్రమణ తగ్గుతుంది.
  • వ్యాధి లక్షణాల కోసం పొలమును క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • నేలలో తేమను కాపాడుకోండి.
  • లోతుగా దున్ని, సోకిన మొక్కల అవశేషాలను మట్టిలో నుండి తొలగించి నాశనం చేయండి.
  • పంటకోతల తర్వాత, మట్టిని క్రిమిసంహారక చేయడానికి నేల సోలరైజేషన్ ఉపయోగించండి.
  • ఎత్తైన మడులలో మీ పంటను పండించండి మరియు నాటడానికి ముందు దాన్ని లేతగా దున్నండి.
  • ఈ తెగులు సోకని పంటలతో 3 సంవత్సరాల పంట మార్పిడి ప్లాన్ చేయండి, ఉదాహరణకు, జొన్న లేదా మెంతితో .

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి