Alternaria spp.
శీలీంధ్రం
మొక్క రకం బట్టి ఈ తెగులు లక్షణాలు కొద్దిగా మారతాయి. విత్తనాల నుండి కొత్తగా మొలకెత్తే మొలకలు ఒక ప్రక్కకు వాలిపోతాయి. కేంద్రీకృతమైన వలయాలు కలిగిన వృత్తాకారపు గోధుమ రంగు నుండి బూడిద రంగు మచ్చలు ఆకులపైన ఏర్పడతాయి. కొన్నాళ్లకు ఈ మచ్చల మధ్యభాగం పల్చబడి పేపర్ వలే మారి ఎండిపోయి రాలిపోవచ్చు. దీనివలన తుపాకితో కాల్చిన రంధ్రాల వంటి రంధ్రాలు ( షాట్ హాల్) ఏర్పడతాయి. ఈ మచ్చలు పెద్దవై ఒకదానితో మరొకటి కలిసిపోయి ఆకులు ముందుగానే రాలిపోవచ్చు. నిర్జీవమైన కణజాలంతో విత్తనాలు చిన్నగా అయ్యి ముడుతలు పడి ఒక పరిమాణంలో లేని ముదురు రంగు మరియు గుంతలు పడిన ప్రాంతాలు ఏర్పడతాయి. పక్వానికి వచ్చిన కాయలపైన కూడా ఈ మచ్చలు ఏర్పడవచ్చు. ఈ కాయలు ముడుతలు పడి చిన్న చిన్న మరియు కుళ్లిపోయిన లక్షణాలతో వున్న రంగు కోల్పోయిన గింజలు కనిపిస్తాయి. కానీ మొక్కలు పక్వ దశకు వచ్చిన సమయంలో ఈ తెగులు సంక్రమించడం వలన దిగుబడిలో పెద్దగా నష్టం కలగదు మరియు దీని నియంత్రణకు ఎటువంటి నియంత్రణ పద్ధతులు సిఫార్స్ చేయబడలేదు.
ఈ ఆల్టర్నేరియా ఆకు మచ్చ తెగులును నిరోధించడానికి ఎటువంటి జీవన నియంత్రణ పద్దతి అందుబాటులో లేదు. సేంద్రియ చికిత్సలుగా కాపర్ ఆధారిత శీలింద్ర నాశినులను వాడవచ్చు. (సాధారణంగా ఒక లీటర్లుకు సుమారు 2.5 గ్రాములు) .
సీజన్ చివర్లో ఈ తెగులు సోకితే దీనిని నియంత్రించడానికి ఎటువంటి ప్రత్యేకమైన చర్యలు చేపట్టనవసరం లేదు. సీజన్లో ముందుగా ఈ తెగులు సంక్రమించినప్పుడు మరియు ఈ ఫంగస్ ఎదుగుదలకు అనుకూలమైన పరిస్థితులు వున్నప్పుడు శీలింద్ర నాశినులు వాడకాన్ని పరిగణలోకి తీసుకోండి. ఈ తెగులు లక్షణాలు బయటపడిన వెంటనే మాంకోజెబ్, అజోక్సిస్ట్రోబిన్ లేదా పైరాక్లోస్ట్రోబిన్ ఆధారిత ఉత్పత్తులను వాడవచ్చు. ఈ తెగులు బాగా విస్తరించేవరకు ఈ మందులు వాడకుండా ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే తెగులు తీవ్రత బాగా అధికంగా వున్నప్పుడు దీనిని విజయవంతంగా నియంత్రించడం కష్టం. శీలింద్ర నాశినులతో విత్తన శుద్ధి చేయడం వలన కూడా ఈ తెగులు సంక్రమించకుండా నిరోధించవచ్చు.
సొయాబీన్ పంటలో ఆల్టర్నేరియా ఆకు మచ్చ తెగులు జెనుస్ ఆల్టర్నేరియా spp. యొక్క అనేక రకాల ఫంగి కారణంగా ఏర్పడుతుంది. ఈ సూక్ష క్రిములు కాయల గోడలను చీల్చి లోపల గింజలకు సంక్రమించి వివిధ సీజన్ల మధ్యన మొక్కలకు ఈ తెగులు సంక్రమించేటట్టు చేస్తాయి. ఈ ఫంగస్ కలుపు మొక్కలు లేదా కుళ్ళకుండా వున్న పంట అవశేషాలపైన చలికాలంలో జీవించి ఉంటాయి. వేడి మరియు తేమ వాతావరణంలో ప్రధానంగా గాలి మరియు వర్షపు తుంపర్ల ద్వారా ఈ తెగులు రెండవ సారి సంక్రమిస్తుంది. ఆకులు తడిగా వునప్పుడు కొద్దీ గంటల్లోనే ఈ ఫంగస్ అంకురోత్పత్తి చెంది ఆకులపైన వుండే సహజ రంధ్రాల ద్వారా లేదా కీటకాల వలన కలిగిన గాయాల ద్వారా మొక్కల కణజాలంలోనికి ప్రవేశిస్తుంది. 20-27°C మధ్య ఉష్ణోగ్రత ఈ తెగులు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది. మొలకల దశలో మరియు మరియు సీజన్ చివరి దశలో ఆకులు పరిపక్వతకు వచ్చిన సమయంలో ఈ తెగులు సులభంగా సంక్రమించే అవకాశం ఉంటుంది. వర్షాకాలం తర్వాత వేసిన సొయాబీన్ పంటలో మరియు భౌతికమైన లేదా పోషకాల వత్తిడి వున్న మొక్కల్లో ఈ తెగులు సంక్రమించే అవకాశం అధికంగా ఉంటుంది.