పసుపు

పక్షి కన్ను తెగులు

Colletotrichum spp.

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకులు, కాండం, కాయలు లేదా పండ్లపై నీటితో తడిచినట్టు వున్న గాయాలు.
  • వివిధ రంగుల్లో అంచులు కలిగివున్న కోలాకారపు గాయాలు.
  • దిగువ కాండం భాగం ముదురు-గోధుమ రంగులో వుండి గట్టిగా అవుతుంది.
  • ఆకులు రాలిపోవడం, మొక్కలు వాలిపోవడం లేదా కొమ్మలు పైనుండి కిందకి చనిపోవడం జరుగుతుంది.

లో కూడా చూడవచ్చు

25 పంటలు
బాదం
ఆపిల్
అప్రికోట్
అరటి
మరిన్ని

పసుపు

లక్షణాలు

పంట రకం, వెరైటీ మరియు పర్యావరణ పరిస్థితులు లక్షణాల తీవ్రతను ప్రభావితం చేస్తాయి. ఆకులు, కాండం, కాయలు లేదా పండ్లలో బూడిద నుండి టాన్ రంగు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు వృత్తాకారం, కోలాకారం లేదా ఒక సక్రమంగా లేని ఆకారంలో మరియు ముదురు గోధుమ, ఎర్రటి లేదా ఊదా అంచులతో ఉంటాయి. అనుకూలమైన వాతావరణ పరిస్థితులలో, అవి చాలా ఎక్కువ అయ్యి, విస్తరించి ఒకదానితో మరొకటి కలిసిపోతాయి. ఈ ప్రక్రియలో ఇవి ముదురు గోధుమ లేదా నలుపు రంగులోకి మారుతాయి. వీటి కేంద్ర భాగం క్రమంగా బూడిద రంగులోకి మారుతుంది మరియు సంక్రమణ యొక్క తరువాతి దశలలో ఇది చిన్న చిన్న చెల్లాచెదురు చేయబడిన నల్లని మచ్చలను చూపిస్తుంది. కొన్ని పంటలలో ఆకుల మధ్యభాగం ఎర్రటి రంగులోకి మారడం కూడా సాధారణం. తీవ్రమైన సందర్భాల్లో, ఆకులు వాలిపోయి, ఎండిపోయి రాలిపోతాయి. దీనివల్ల మొక్క యొక్క అకాల విక్షేపం ఏర్పడుతుంది. కాండం మీద, గాయాలు పొడుగ్గా, నొక్కుకుపోయినట్టు ఉండి మరియు గోధుమ రంగులో మరియు ముదురు అంచులతో కూడా ఉంటాయి. ఇవి విస్తరించేటప్పుడు, గాయాలు కాండం యొక్క మొదలును చుట్టుముట్టవచ్చు. ఇది మొక్క వాలిపోవడం మరియు ఒక పక్కకు పడిపోవడానికి కారణమౌతుంది. సాధారణంగా కాండం లేదా కొమ్మలు పైనుండి కిందకి చనిపోవడం కూడా జరుగుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

విత్తడానికి ముందు విత్తనాలను వెచ్చని నీటిలో ముంచడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు (ఉష్ణోగ్రత మరియు సమయం, పంటపై ఆధారపడి ఉంటుంది). సంక్రమణను నియంత్రించడానికి జీవసంబంధ ఏజెంట్లు కూడా సహాయపడవచ్చు. ట్రైకోడెర్మా హర్జియనమ్ మరియు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, బాసిల్లస్ సబ్టిలిస్ లేదా బి. మైలోలిక్ఫేసియన్స్ అనే ఫంగస్ ఆధారిత ఉత్పత్తులను విత్తన చికిత్సలో భాగంగా ఉపయోగించవచ్చు. లక్షణాలను గుర్తించిన తర్వాత సేంద్రీయంగా ఆమోదించబడిన రాగి సూత్రీకరణలను వివిధ రకాల పంటలలో ఈ వ్యాధికి వ్యతిరేకంగా పిచికారీ చేయవచ్చు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవసంబంధమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి.రోజు ప్రారంభంలో పిచికారీ చేయండి మరియు వేడి వాతావరణంలో మందుల వాడకం నివారించండి. అలాగే, నాటడానికి ముందు విత్తన శుద్ధి చేయండి. నాటే ముందు విత్తనాలకు సీడ్ డ్రెస్సింగ్ చేయడం, శిలీంధ్రాలను చంపడానికి ఉపయోగపడుతుంది. అజోక్సిస్ట్రోబిన్, బోస్కాలిడ్, క్లోరోతలోనిల్, మనేబ్, మాంకోజెబ్ లేదా ప్రోథియోకోనజోల్ కలిగిన శిలీంద్ర నాశినులు సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి నివారణగా పిచికారీ చేయవచ్చు (దయచేసి మీ పంట కోసం నిర్దిష్ట సూత్రీకరణ మరియు సిఫార్సులను చెక్ చేయండి). ఈ ఉత్పత్తులలో కొన్నింటికి ప్రతిఘటన యొక్క కొన్ని సందర్భాలు వివరించబడ్డాయి. కొన్ని పంటలకు సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులో లేవు. చివరగా, విదేశాలకు ఎగుమతి చేస్తున్నప్పుడు, పంట కోత తర్వాత చికిత్సలతో పాటు ఫుడ్ గ్రేడ్ మైనం వాడడం ద్వారా పండ్లపై దీని సంభావ్యతను తగ్గించవచ్చు.

దీనికి కారణమేమిటి?

కొల్లెటోట్రిఖం ఎస్.పి.పి జాతికి చెందిన అనేక జాతుల శిలీంధ్రాల వల్ల లక్షణాలు సంభవిస్తాయి. అవి మట్టిలో, విత్తనాలతో సంబంధం కలిగి ఉంటాయి లేదా మొక్కల అవశేషాలు మరియు ప్రత్యామ్నాయ అతిధి మొక్కలపై నాలుగు సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. రెండు మార్గాల్లో ఈ తెగులు కొత్త మొక్కలకు సంక్రమిస్తుంది. మట్టి- లేదా విత్తనం ద్వారా వచ్చే బీజాంశం ఆవిర్భావం సమయంలో మొలకలకు సోకినప్పుడు, కణజాలాలలో వ్యవస్థాత్మకంగా పెరుగుతుంది. ఇతర సందర్భాల్లో, బీజాంశం వర్షపు తుంపర్ల ద్వారా మొక్క క్రింది భాగంలోని ఆకులపైకి చిమ్మబడుతుంది మరియు మొక్క పైకి వ్యాపించే సంక్రమణను ప్రారంభిస్తుంది. ఆకు లేదా పండ్ల గాయాలలో ఉత్పత్తి అయ్యే బీజాంశం వర్షపు తుంపర్లు, మంచు, పీల్చే కీటకాలు లేదా పొలంలో పనిచేసే కార్మికులచే మొక్కల ఎగువ భాగాలకు లేదా ఇతర మొక్కలకు చెదరగొట్టబడినప్పుడు ద్వితీయశ్రేణి అంటువ్యాధులు ప్రారంభమవుతాయి. చల్లటి నుండి వెచ్చని ఉష్ణోగ్రతలు (20 నుండి 30°C సరైన ఉష్ణోగ్రతలు) , అధిక పి హెచ్ ఉన్న నేలలు, సుదీర్ఘమైన ఆకు తడి, తరచుగా వర్షపాతం మరియు దట్టమైన పందిరి ఈ వ్యాధికి అనుకూలంగా ఉంటాయి. సమతుల్య ఎరువుల వాడకం వలన పంటలకు ఈ పక్షి కన్ను తెగులు సంక్రమించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • నీరు బాగా ఇంకే నెలల్లో సాగు చేయండి.
  • మొక్కలు తెగుళ్లను నిరోధించడంలో సహాయపడడానికి కంపోస్ట్ తో నేలను సంవృద్ధి చేయండి.వీలైతే తక్కువ వర్షపాతం వుండే ప్రాంతాలను ఎంచుకోండి.
  • పొలంలో మంచి డ్రైనేజ్ సౌకర్యం ఏర్పాటుచేసుకోండి.
  • ఆరోగ్యకరమైన మొక్కల నుండి లేదా ధృవీకరించబడిన మూలాల నుండి విత్తనాలను ఉపయోగించండి.
  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే నిరోధక రకాలను ఎంచుకోండి లేదా ఆరోగ్యంగా వున్న నారును కొనుగోలు చేయండి.
  • విత్తేటప్పుడు మొక్కల మధ్య ఎక్కువ అంతరాన్ని ఉంచండి.
  • వ్యాధి సంకేతాల కోసం పొలం లేదా తోటలను గమనిస్తూ వుండండి.
  • ఆకులు మరియు కాండం చుట్టూ గాలి ప్రసరణను మెరుగుపరచడానికి టమోటాలు వంటి పొడవైన మొక్కలకు కర్రలను కట్టండి పొలాల చుట్టూ ఉచ్చు పంటలు లేదా చెట్లను నాటండి.
  • ఉదాహరణకు మొక్కల అవశేషాలనుతొలగించడం ద్వారా పొలం లేదా పండ్ల తోటలో మంచి పారిశుద్ధ్యాన్ని పాటించండి.
  • ఆకులు తడిగా ఉన్నప్పుడు పొలాలలో యంత్రాలు లేదా కార్మికుల కదలికలను నివారించండి.
  • మీ పనిముట్లు మరియు పరికరాలను జాగ్రత్తగా శుభ్రం చేయండి.
  • వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి, మొక్కలు తడిగా ఉన్నప్పుడు తోటలకు దూరంగా ఉండండి మరియు ఉపయోగించిన తర్వాత అన్ని ఉపకరణాలను క్రిమిసంహారకమయ్యేలా చూసుకోండి (4 భాగాల నీటికి ఒక భాగం బ్లీచ్).
  • నీటిని పెట్టవలసి వస్తే ఉదయాన్నే దీనిని ప్లాన్ చేయండి.
  • మరియు రాత్రిపూట ముందు ఆకులు పొడిగా ఉండేలా చూసుకోండి.
  • మొక్కలకు ఓవర్ హెడ్ స్ప్రింక్లర్ తో కాకుండా డ్రిప్ పద్దతిలో నీరు పెట్టండి.
  • మొక్కలు తడిగా వున్నప్పుడు వాటిని తాకవద్దు.
  • తీవ్రమైన లక్షణాలను నివారించడానికి పంటను ముందుగానే కోయండి.
  • గాలి, వెలుతురు బాగా ప్రసరించే ప్రదేశంలో పండ్లను నిలువచేయండి.
  • మట్టిలో శిలీంధ్రం త్వరగా కుళ్ళిపోతుంది కాబట్టి మొక్కల అవశేషాలను భూమిపైనే వదిలివేయండి.
  • ప్రత్యామ్నాయంగా, కుళ్లడానికి అనుకూలంగా మొక్కల అవశేషాలను మట్టిలో బాగా లోతుగా పాతిపెట్టండి.
  • ఈ వ్యాధి సోకని పంటలతో (3-4 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ) దీర్ఘకాలిక పంట మార్పిడిని ప్లాన్ చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి