Pythium spp.
శీలీంధ్రం
వేరు కుళ్ళు తెగులు మొలకలు మరియు మొక్క ఎదిగే రెండు దశలలో సోకవచ్చు. మొలకలు రాకముందు మరియు వచ్చిన తర్వాత కూడా ఇది మొక్కలకు సంక్రమించవచ్చు. మొలకలు రాకముందు సంక్రమించినట్లైతే విత్తనాలు వేసిన వెంటనే ఈ ఫంగస్ విత్తనాలలో నివాసం ఏర్పరచుకుంటుంది. దీనివలన విత్తనాలు కుళ్లిపోయి అంకురోత్పత్తి ఆగిపోతుంది. మొలకలు వచ్చిన తర్వాత మొలకల ఎదుగుదల తగ్గిపోతుంది. కాండం మొదళ్లవద్ద కుళ్లిపోవడం మొదలవుతుంది. నీటిలో తడిచినట్టున్న మెత్తని సన్నని బూడిద రంగు, గోధుమరంగు లేదా నల్లని మచ్చలు కనపడతాయి. లేత మొక్కలు లేదా చెట్లు రంగు కోల్పోయి వాలిపోవడం మొదలవుతుంది. చివరకు మొదలు వద్ద నరికేసినట్లై కూలిపోతాయి. తెల్లని లేదా బూడిద రంగు బూజు ఈ చనిపోయిన మొక్కలపై లేదా మట్టిపై ఏర్పడతాయి. మొలకలు బాగా అధిక మొత్తంలో నష్టపోతే మళ్ళీ కొత్త మొలకలు వేయాల్సి ఉంటుంది.
ట్రైకోడెర్మా విరిడే, బెయువేరియా బస్సియన లేదా బ్యాక్టీరియల్ స్యుడోమోనాస్ ఫ్లోరెస్సెన్స్ వంటి జీవ శీలింద్ర నాశినులను విత్తన శుద్ధి కొరకు ఉపయోగించవచ్చు లేదా మొక్కలు వేస్తున్నప్పుడు వేర్ల చుట్టూ వేయడం వలన మొలకలు రాకముందు వచ్చే వేరు కుళ్ళు తెగులును నివారించవచ్చు. కొన్ని పరిస్థితులలో, కాపర్ ఆధారిత శీలింద్ర నాశినులను లేదా బోర్డెయక్స్ తో విత్తన శుద్ధిని చేయడం ద్వారా ఈ తెగులు సంక్రమించకుండా లేదా తెగులు తీవ్రత అధికంగా ఉండకుండా చేయవచ్చు. ఇంట్లో తయారుచేసుకోగల యుపటోరియం కన్నబినం మొక్కల సారం ఈ ఫంగస్ఎదుగుదలను పూర్తిగా అరికడుతుంది. "స్మోక్ వాటర్" ను పొలంలో ఉపయోగించడం ( మొక్కలను కాల్చి ఆ బొగ్గును నీటిలో కలపడం) వలన కూడా ఈ ఫంగస్ ను నియంత్రించవచ్చు.
వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణా చర్యలతో కూడిన జీవసంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పొలంలో పని చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, నివారణా చర్యలు తీసుకోవడం వలన ఈ తెగులు పంటకు సంక్రమించకుండా చేయవచ్చు. ఈ తెగులు సోకిన చరిత్ర వున్న పొలాలు సరైన మురుగు నీటి పారుదల సౌకర్యం లేని పొలాలలో ముందు జాగ్రత్తగా శీలింద్ర నాశినులను వాడడం మంచిది. మెటలాక్సేల్-M తో విత్తన శుద్ధి చేసి మొలకలు రాకముందు ఈ తెగులు సంక్రమించకుండా నివారించవచ్చు. మేఘావృత వాతావరణంలో కప్టాన్ @ 31.8% లేదా మెటలాక్సిల్-ఎం @ 75% తో ఆకులపై పిచికారీ చేయడం కూడా సహాయపడుతుంది. మట్టి లేదా మొక్క యొక్క మొదళ్ళ వద్ద నాటిన సమయం నుండి ప్రతి 15 రోజులకు ఒకసారి కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా కప్తాన్ తో తడపాలి.
ఈ తెగులు చాలా రకాల పంటలను ఆశించవచ్చు. ఇది జెనస్ పాలిథియం అనే ఫంగస్ వలన సంక్రమిస్తుంది. ఈ ఫంగస్ మట్టిలో కానీ పంట అవశేషాలపైన కానీ సంవత్సరాల తరబడి జీవించి ఉంటుంది. చలికాలంలో వెచ్చగా వున్నప్పుడు, వర్షాకాలంలో లేదా మట్టిలో బాగా అధికంగా తేమ వున్నప్పుడు మొక్కలు బాగా దగ్గరగా నాటినప్పుడు ఈ తెగులు త్వరితంగా వృద్ధిచెందుతుంది. నీరు నిలిచి వున్నపుడు లేదా అధిక నత్రజని వాడినా మొక్కలు బలహీనంగా వున్నప్పుడు ఈ తెగులు బాగా వృద్ధిచెందుతుంది. కలుషితమైన పరికరాల వలన లేదా పనిముట్ల వలన, బట్టలు , చెప్పులకు అంటిన మట్టి ద్వారా ఈ ఫంగస్ బీజాంశాలు వ్యాప్తి చెందుతాయి. మొక్కల ఏ దశలోగా ఈ తెగులు సంక్రమించవచ్చు. అంకురోత్పత్తి జరుగుతున్న విత్తనాలు లేదా లేత మొలకలకు ఈ తెగులు సులభంగా సంక్రమిస్తుంది. ఈ తెగులు ఒక సీజన్ నుండి ఇంకొక సీజన్ కు విస్తరించే అవకాశం తక్కువ. కానీ ఈ తెగులు సోకడానికి అనుకూలమైన పరిస్థితులు వున్నప్పుడు ఇది మళ్ళీ తరువాత సీజన్ పంటకు కూడా సంక్రమిస్తుంది.