Alternaria solani
శీలీంధ్రం
ఆకు మాడు తెగులు యొక్క లక్షణాలు ముదురు ఆకులు, కాండం మరియు పండ్ల మీద కనిపిస్తాయి. ఆకుల పై బూడిద నుండి గోధుమరంగు మచ్చలు కనిపిస్తాయి. మధ్య భాగం లో "బుల్స్ ఐ" రూపంలో మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల చుట్టూ కాంతివంతమైన పసుపు వలయాలు ఏర్పడతాయి. ఈ తెగులు విస్తరించే కొలదీ మొత్తం ఆకులు రంగు కోల్పోయి రాలిపోతాయి. దీనివలన మొక్కల ఆకులు చాలా వరకు రాలిపోతాయి. ఇదేవిధమైన మధ్యలో ఖాళీ వున్న ముదురు కేంద్రీకృత మచ్చలు కాండంపై మరియు బంగాళా దుంప పైన ఏర్పడతాయి. ఒక సక్రమమైన ఆకారంలో లేని, కొద్దిగా నొక్కినట్టు వున్న మచ్చలు దుంప పైభాగంలో ఏర్పడతాయి. ఈ మచ్చల క్రింద దుంప కణజాలం గోధుమ రంగుతో తోలు లేదా కార్క్ వలే ఉంటుంది.
సేంద్రీయంగా నమోదు చేయబడిన బాసిల్లస్ సబ్టిలిస్ లేదా రాగి ఆధారిత శిలీంద్రనాశకాల ఆధారిత ఉత్పత్తుల వాడకం ఈ వ్యాధికి చికిత్స చేస్తుంది.
వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణా చర్యలతో కూడిన జీవసంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ ఫంగస్ పైన పనిచేసే చాలా రకాల శీలింద్ర నాశినులు అందుబాటులో వున్నాయి. అజోక్షీ అజొక్సిస్ట్రోబిన్, పైరాక్లోస్ట్రోబిన్, డైఫెనోకోనజోల్, బోసకలైడ్,క్లోరోతలోనిల్, ఫెనామిడోన్, మానేబ్, మాంకోజెబ్, ట్రైఫ్లోక్సీస్ట్రోబిన్ మరియు జిరామ్ ల మిశ్రమాల ఆధారిత శిలీంద్రనాశినులను ఈ తెగులును నియంత్రించడానికి ఉపయోగించవచ్చు. ఒకొక్క సారి ఒకొక్క రకం మందులను వాడడం సిఫారసు చేయబడినది. వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఈ మందులను సమయానుసారం వాడాలి. కోసిన పంటలో ఈ పురుగుల మందుల అవశేషాలు లేకుండా ఉండడానికి పంట కోతలు చేసే కొద్ది సమయానికి ముందుగా ఈ మందులను ఉపయోగించడం మంచిది.
ఈ తెగులు లక్షణాలు ఆల్ట్రనేరియా సోలని అనే ఫంగస్ వలన ఏర్పడతాయి. ఈ ఫంగస్ తెగులు సోకిన పంట అవశేషాలపైన లేదా ఇతర మొక్కలపైన జీవించి ఉంటుంది. నర్సరీ లో కొనుగోలు చేసిన మొలకలపై అంతకు ముందే ఈ ఫంగస్ వుండే అవకాశం ఉంటుంది. ముదురు మొక్కలలో క్రింది భాగంలోని ఆకులు కలుషితమైన మట్టిని తాకడం వలన ఈ తెగులు వాటికీ సంక్రమిస్తుంది. 24-29°C ఉష్ణోగ్రతల వద్ద మరియు 90% కాని ఎక్కువ వున్న తేమ వద్ద ఈ ఫంగస్ త్వరగా వృద్ధి చెందుతుంది. ఈ ఫంగస్ ఆకు పైపొరలోనుండి చొచ్చుకుని వెళ్లడం ద్వారా లేదా ఆకులపై వున్న గాయాల ద్వారా లేదా ఆకు రంధ్రాల ద్వారా సంక్రమిస్తుంది. అధిక కాలం తడి వాతావరణం ఉండడం (లేదా ఒకసారి తడి ఒకసారి పొడి వాతావరణం) ఈ ఫంగస్ కు అనుకూలంగా ఉంటుంది. బీజాంశాల ఉత్పత్తి మరియు విడుదల గాలి ద్వారా వర్షపు చినుకుల ద్వారా లేదా పైనుండి మొక్కలకు నీరు పెట్టడం ద్వారా వ్యాపిస్తాయి. బాగా అధిక వర్షపాతం పడిన తర్వాత ఈ తెగులు సోకే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ తెగులు ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాలలో పంటకు చాలా అధికంగా నష్టం కలగచేస్తుంది.