జొన్న

జొన్నలో తుప్పు తెగులు

Puccinia purpurea

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకుల క్రిందిభాగంలో సన్నటి మచ్చలు నెమ్మదిగా, ఊదా రంగులో కొద్దిగా ఉబ్బిన స్ఫోటములుగా పెరుగుతాయి.
  • ఇవి వృత్తాకారం నుండి గుడ్డు ఆకారంలో చెల్లాచెదురుగా లేదా పట్టీలుగా ఉంటాయి.
  • ఆకు కాడలు మరియు పూల గుత్తి కాడలపై కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

జొన్న

లక్షణాలు

సాధారణంగా 1-1.5 నెలల వయస్సు గల మొక్కలలో ఈ తెగులు లక్షణాలను గమనించవచ్చు. వేర్వేరు రంగుల (ఊదా, తోలు రంగు లేదా ఎరుపు) సూక్షమైన చుక్కలు మొదట కింద ఆకులపై కనిపిస్తాయి. నిరోధక రకాల్లో లక్షణాలు అంతకన్నా వృద్ధి చెందవు. ఇతర మొక్కల రకాలలో ఇవి బీజాంశాలతో నిండినప్పుడు ఈ మచ్చలు పొడిగా ఊదా రంగులో కొద్దిగా పెరిగిన స్ఫోటములుగా మారతాయి. ఇవి వృత్తాకారం నుండి గుడ్డు ఆకారంలో చెల్లాచెదురుగా లేదా పట్టీలుగా ఉంటాయి మరియు మొక్క పరిపక్వం చెందుతున్నప్పుడు మరింత ముదురు రంగులోకి మారతాయి. ఆకు కాడలు మరియు పూల గుత్తి కాడలపై కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ తెగులు అధికంగా సోకే అవకాశం వున్న మొక్కల్లో ఈ స్ఫోటములు మొత్తం మొక్కను కప్పివేయవచు అలాగే తెగులు సోకిన పొలాలు గోధుమ రంగులో కనిపిస్తాయి. పుష్ప గుచ్చాల కాడలు లేదా ఆకు కాడలపైన కూడా ఇవి కనిపిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

పుక్కినియా పర్పురియాకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ చికిత్స ఇప్పటివరకు అందుబాటులో లేదు. ఈ వ్యాధితో పోరాడటానికి సహాయపడేది ఏదైనా మీకు తెలిస్తే దయచేసి మమల్ని సంప్రదించండి. మీ నుండి సమాచారం కొరకు ఎదురుచూస్తూ ఉంటాము.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. శిలీంద్ర నాశినుల వాడకం ప్రయోజనకరంగా ఉంటుంది. తెగులును నియంత్రించడానికి హెక్సాకోనజోల్ (0.1%), డైఫెన్కోనజోల్ (0.1%) మరియు ప్రొపికోనజోల్ (0.1%) ఆధారంగా ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. లక్షణాలు కనిపించిన వెంటనే 15 రోజుల వ్యవధిలో ఈ శిలీంద్రనాశకాలను రెండు సార్లు పిచికారీని సిఫార్స్ చేయబడింది.

దీనికి కారణమేమిటి?

మట్టి మరియు తెగులు సోకిన మొక్కల అవశేషాలలో తక్కువ సమయం మాత్రమే జీవించి వుండే పుస్కినియా పర్పురియా అనే ఫంగస్ వల్ల ఈ తెగులు సంక్రమిస్తుంది. అందువలన ఇది ప్రత్యామ్నాయ అతిధి మొక్కలైనటు వంటి గడ్డి లేదా కొన్ని కలుపు మొక్కలపై శీతాకాలంలో జీవించవలసి వుంటుంది. ఉదాహరణకు క్రీపింగ్ వుడ్‌సోర్రెల్ (ఆక్సాలిస్ కార్నికులాటా). గాలులు మరియు వర్షం ద్వారా బీజాంశాలను చాలా దూరం వరకు రవాణా చేయబడవచ్చు. అధిక సాపేక్ష ఆర్ద్రతలు (దాదాపు 100%), మంచు, వర్షం మరియు చల్లని ఉష్ణోగ్రతలు (10-12°C) ఈ తెగులు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటాయి. వేడి, పొడి వాతావరణం ఫంగస్ అభివృద్ధికి మరియు తెగులు సంభవించడానికి ఆటంకం కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో, తెగులు తీవ్రంగా సోకిన ఆకులు ఎండిపోవడం మరియు నాశనం అవ్వడం జరుగుతుంది.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక మొక్కల రకాలు స్థానికంగా లభిస్తాయి.
  • ధృవీకరించబడిన మూలాల నుండి సేకరించిన ఆరోగ్యకరమైన విత్తనాలను ఉపయోగించండి.
  • తెగులు సోకిన పొలాల నుండి సేకరించిన విత్తనాలను ఉపయోగించవద్దు.
  • సంక్రమణకు అనుకూలమైన పరిస్థితులను నివారించడానికి సీజన్ ప్రారంభంలో నాటండి.
  • త్వరగా పక్వానికి వచ్చే స్వల్పకాలిక వంగడాలను ఉపయోగించండి.
  • తెగులు సంకేతాల కోసం పొలాన్ని గమనిస్తూ వుండండి.
  • తెగులు సోకిన మొక్కలను తొలగించి నాశనం చేయండి (ఉదాహరణకు వాటిని కాల్చడం ద్వారా).
  • ఇతర అతిధి మొక్కలతో క్రాస్ ఇన్ఫెక్షన్ నివారించడానికి మంచి కలుపు నిర్వహణను ప్లాన్ చేయండి.
  • ఈ తెగులు సోకని పంటలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి