Phyllachora maydis
శీలీంధ్రం
మొదటి లక్షణాలు ఆకు రెండు వైపులా చిన్న పరిమాణంలో, ఉబ్బెత్తుగా ఉండి, నల్లటి కేంద్రంతో పసుపు-గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ముదురు అంచులతో కూడిన వృత్తాకార, గోధుమరంగు గాయాలతో చుట్టుముట్టబడి ఉండవచ్చు. సాధారణంగా వీటిని "చేప కన్ను" అని పిలుస్తారు. వృత్తాకార, కోలాకారపు, కొన్నిసార్లు కోణీయ లేదా క్రమరహిత మచ్చలు కలిసిపోయి 10 మిమీ పొడవు వరకు చారలను ఏర్పరుస్తాయి. మొత్తం ఆకు మచ్చలతో కప్పబడి ఉండవచ్చు మరియు చుట్టుపక్కల ఆకు పదార్థం ఎండిపోతుంది. లక్షణాలు మొదట దిగువ ఆకులపై కనిపించి తర్వాత ఎగువ ఆకులకు వ్యాపిస్తాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే పై తొక్క మరియు ఆకు తొడుగులపై కూడా ఈ మచ్చలు కనిపిస్తాయి. 21 నుండి 30 రోజుల తర్వాత ఆకులు పూర్తిగా చనిపోవచ్చు. దీని వలన మొక్కజొన్న మార్కెట్ సామర్థ్యం తగ్గుతుంది.
ఇప్పటివరకూ ఈ వ్యాధికి వ్యతిరేకంగా ఎటువంటి జీవ నియంత్రణ పరిష్కారం అందుబాటులో ఉన్నట్టు తెలియదు. మీకు ఏదైనా తెలిస్తే దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
అందుబాటులో ఉంటే జీవ సంబంధిత చికిత్సలతో పాటు నివారణా చర్యలతో కూడిన సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. ఇప్పటివరకూ ఈ వ్యాధికి ఎటువంటి రసాయన చికిత్స ఉన్నట్టు తెలియదు. మీకు ఏదైనా తెలిస్తే దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
ఫిలాచోరా మేడిస్, మోనోగ్రాఫెల్లా మేడిస్ మరియు హైపర్‌పారాసైట్ కోనియోథైరియం ఫైలాచోరే అనబడే మూడు ఫంగల్ జాతుల పరస్పర చర్య వల్ల లక్షణాలు ఏర్పడతాయి: . P. మేడిస్ ద్వారా తెగులు సంక్రమించిన రెండు లేదా మూడు రోజుల తరువాత, గాయాలను M. మేడిస్ ఆక్రమిస్తుంది. ఈ శిలీంధ్రం మొక్క అవశేషాల్లో 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించగలదు. గాలి మరియు వర్షం ద్వారా బీజాంశాలు వ్యాప్తి చెందుతాయి. 16-20°C యొక్క చల్లని ఉష్ణోగ్రతలు మరియు అధిక సాపేక్ష ఆర్ద్రత వ్యాధి వ్యాప్తికి అనుకూలంగా ఉంటాయి. అందువల్ల నదీతీరాలకు సమీపంలో ఉన్న పొలాలు ఈ వ్యాధికి గురవుతాయి.