మొక్కజొన్న

మొక్కజొన్న కాడ కుళ్ళు తెగులు

Gibberella fujikuroi

శీలీంధ్రం

క్లుప్తంగా

  • బలహీనమైన కాడలు.
  • కాడలపై చిన్న, నల్లని శిలీంధ్ర నిర్మాణాలు.
  • కంకి పాలిపోతుంది.
  • మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

పర్యావరణ పరిస్థితి మరియు వ్యాధి యొక్క తీవ్రతను బట్టి లక్షణాలు మారవచ్చు. వ్యాధి సోకిన మొక్కలను వాటి అసాధారణ ఎత్తు వలన, పొడుగ్గా ఉండడం లేదా ఎదుగుదల లేకపోవడం మరియు పాలిపోయినట్టు ఉండడం వలన సులభంగా గుర్తించవచ్చు. గింజలు గాయాలను మరియు కుళ్ళడాన్ని ప్రదర్శిస్తాయి. కాండం మీద బెరడు రంగు పాలిపోతుంది, బూజు ఎదుగుదల, కుంగిపోవడం లేదా రోసెట్టింగ్ కనిపిస్తాయి. ఆకులు అసాధారణ రంగులు మరియు శిలీంధ్ర పెరుగుదలను ప్రదర్శిస్తాయి. నలుపు లేదా గోధుమరంగు మచ్చలు, పొక్కులు మరియు కంకి కుళ్లు తెగులుకు కంకులు ప్రభావితమవుతాయి. మొక్క మొత్తం తేమతో ఉంటుంది మరియు త్వరగా వృధ్ద్యాప్యము చెంది మొలకలు ఎండిపోతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

వ్యాధికారక సూక్ష్మ జీవులను వ్యాప్తి చెందించే కీటకాలను నియంత్రించడానికి వేప సారాలను పిచికారీ చేయండి. వ్యాధికారక సూక్ష్మ జీవులను అణచివేయడానికి ట్రైకోడెర్మా ఎస్పిపి వంటి జీవ నియంత్రణ ఏజెంట్లను పొలంలో పరిచయం చేయండి. కాడ కుళ్ళు తెగులును నియంత్రించడంలో సూడోమోనాస్ ఫ్లూరోసెన్స్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ రెండు పదార్ధాలను విత్తన చికిత్సగా, నేలపై ఉపయోగించవచ్చు. 250 కిలోల దిబ్బ ఎరువుతో నేలను బలపరచండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మీ విత్తనాలను నాటడానికి ముందు మాంకోజెబ్ 50% మరియు కార్బెండజిమ్ 25% ద్రావణంతో చికిత్స చేయండి.

దీనికి కారణమేమిటి?

మట్టిలో జీవించి వుండే గిబ్బెరెల్లా ఫుజికురోయ్ అనే ఫంగస్ వలన ఈ వ్యాధి వస్తుంది. వ్యాధికారక సూక్ష్మ జీవుల బీజాంశం గాలి మరియు వర్షంతో చెదరగొట్టబడి గాయాల ద్వారా మొక్కజొన్న కంకిలోకి ప్రవేశిస్తుంది. విత్తనాల అంకురోత్పత్తి నుండి పొత్తుల పట్టు పీచు ఆవిర్భావం వరకు మొక్కలు ప్రభావితమవుతాయి కాని తరువాతి దశలలో లక్షణాలు కనిపిస్తాయి. ఇది విత్తనాలు, పంట అవశేషాలు లేదా గడ్డి వంటి ప్రత్యామ్నాయ అతిథేయ మొక్కలపై మనుగడ సాగిస్తుంది. ఇది పట్టు, వేర్లు మరియు కాండాల ద్వారా బీజాంశం సంక్రమణ వలన వ్యాపిస్తుంది. ఇది మొక్కజొన్న కంకుల్లోకి ప్రధానంగా కీటకాలు తినడం వలన కలిగిన నష్టం వలన కలిగిన గాయాల ద్వారా ప్రవేశిస్తుంది. ఇది అంకురోత్పత్తి చెంది ప్రవేశ ప్రాంతాల నుండి గింజలను దీని ఆవాసంగా చేసుకుంటుంది. ప్రత్యామ్నాయంగా, వేర్లనుండి ప్రారంభించి మొక్కల వ్యవస్థ ద్వారా మొక్క పైకి విస్తరించవచ్చు. అనేక విస్తృతమైన పర్యావరణ (ఒత్తిడి) పరిస్థితులలో మొక్కలకు ఈ తెగులు సంక్రమించవచ్చు. అయితే, ముఖ్యంగా, వాతావరణం వెచ్చగా (26-28°C) మరియు తేమగా ఉన్నప్పుడు మరియు మొక్కలు పుష్పించే దశకు చేరుకున్నప్పుడు లక్షణాలు తీవ్రంగా మారతాయి


నివారణా చర్యలు

  • వ్యాధి లేని విత్తనాలు మరియు ఎస్సీ 637 వంటి తట్టుకునే రకాలు నాటండి.
  • మొక్కజొన్న మొక్కలలో మొత్తం ఒత్తిడిని తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన మరియు బలమైన కాండం వృద్ధి చెందేలా జాగ్రత్తలు తీసుకోండి.
  • కాండం కుళ్ళు తెగులు చరిత్ర ఉన్న పొలాల్లో వరుసల మధ్యన 70-90 సెం.మీ మరియు మొక్కల మధ్య 30-50 సెం.మీ.ల అంతరంతో మొక్కల జనాభాను ఎకరానికి 28,000 నుండి 32,000 మొక్కలకు పరిమితం చేయండి.
  • జాగ్రత్తగా నీటిపారుదల, కలుపు నియంత్రణ మరియు తగినంత నేల పోషక స్థాయిలను పాటించండి.
  • మొక్కలను జాగ్రత్తగా పర్యవేక్షించండి మరియు గింజ ఉపరితలంపై తెల్లటి గీతలు, లేత ఆకుల పసుపు మరియు పుష్పించే దశలో వాడిపోయిన లక్షణాలు మరియు చివరి దశలో తెగులు సోకిన కొమ్మ ఎర్రటి గోధుమ రంగులోకి మారుతుందేమోనని చూడండి.
  • వ్యాధికారక సూక్ష్మ జీవులను వ్యాపింపచేస్తాయి కాబట్టి కాండం తొలుచు పురుగుల జనాభాను నియంత్రించండి.
  • మొక్కల ఎదుగుదల యొక్క తరువాతి దశలలో ఎరువులను సరిగా వేయండి.
  • తెగులు సోకిన మొక్కలను తొలగించి పాతిపెట్టండి.
  • తెగులు సోకిన పంట అవశేషాలను పాతిపెట్టడానికి నేలను బాగా దున్నండి.
  • నిల్వ చేసే ప్రాంతాన్ని బాగా శుభ్రపరచండి.
  • నిల్వ చేసేముందు గింజల్లో తేమ 15% లేదా అంతకంటే తక్కువకు వచ్చేవరకు వేడిచేయండి.
  • తక్కువ తేమ మరియు తక్కువ ఉష్ణోగ్రత వద్ద గింజలను నిల్వ చేయండి.
  • చిక్కుళ్ళతో మూడు సంవత్సరాల తరువాత పంట మార్పిడిని ప్లాన్ చేయండి ఉదా.
  • బీన్స్ లేదా సోయాబీన్ వంటి వాటితో.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి