Alternaria triticina
శీలీంధ్రం
చిన్న మొక్కలు వ్యాధికారక నిరోధకతను కలిగి ఉంటాయి. మొక్కకి క్రింది భాగంలో వున్న ఆకులకు దిగువ ఆకులు ఎల్లప్పుడూ ముందుగా ఈ తెగులు లక్షణాలను బహిర్గతపరుస్తాయి. ఇది క్రమంగా ఎగువ ఆకులకు వ్యాపిస్తుంది. ఏ తెగులు చిన్న, కోలాకారపు, రంగు కోల్పోయిన మచ్చలుగా మొదలవుతుంది, ఇవి దిగువ ఆకులపై ఒక క్రమ పద్దతిలో లేకుండా చెల్లాచెదురుగా ఉంటాయి, క్రమంగా ఎగువ ఆకులకు వ్యాపిస్తాయి. కాలక్రమేణా ఈ మచ్చలు పెదవి అయ్యి ఒక క్రమ పద్దతిలో లేని ముదురు గోధుమ లేదా బూడిద పల్లపు మచ్చలుగా వృద్ధి చెందుతాయి. ఇవి ప్రకాశవంతమైన పసుపు అంచులను కలిగి ఉండవచ్చు మరియు 1 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వ్యాసం వరకు పెరుగుతాయి. తేమతో కూడిన పరిస్థితులలో, నల్లటి కోనిడియా పొడితో కప్పబడి ఉండవచ్చు. ఈ తెగులు తరువాతి దశలలో ఈ మచ్చలు ఒకదానితో ఇంకొకటి కలిసిపోతాయి. ఫలితంగా మొత్తం ఆకు చనిపోతుంది. ఈ తెగులు తీవ్రమైన సందర్భాల్లో, ఆకు తొడుగులు, ఈకలు మరియు పై రేకలు కూడా ప్రభావితమవుతాయి మరియు కాలిపోయినట్టు ఉంటాయి.
ఒక కిలో విత్తనాలకు @ 2.5 గ్రాముల విటావాక్స్ తో శుద్ధి చేయడం ద్వారా విత్తనాల ద్వారా జరిగే తెగులు సంక్రమణలను నియంత్రించవచ్చు. ట్రైకోడెర్మా విరిడే మరియు విటావాక్స్ మిశ్రమం తెగుళ్ల వ్యాప్తిని మరింత సమర్థవంతంగా అడ్డుకుంటుంది (98.4% వరకూ). మొదటి మరియు రెండవ స్ప్రేలలో 2-3% యూరియాను జినెబ్‌తో కలపండి. సజల వేప ఆకు సారాలను ఉపయోగించండి. విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే ఐనోక్యులమ్ తగ్గించడానికి శిలీంద్ర నాశినులు మరియు వేడి నీటి చికిత్సలు ఉపయోగించబడుతున్నాయి. తెగులు మరింత వ్యాపించకుండా నియంత్రించడానికి ట్రైకోడెర్మా విరిడే (2%) మరియు టి. హర్జియనం (2%), ఆస్పెర్‌గిల్లస్ హ్యూమికోలా మరియు బాసిల్లస్ సబ్టిలిస్‌లను తరచుగా ఉపయోగిస్తున్నారు.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. A. ట్రిటిసినాను శిలీంద్ర నాశినులను ఉపయోగించడం ద్వారా 75% వరకూ వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు పంట దిగుబడిని పెంచవచ్చు. మాంకోజెబ్, జిరామ్, జినెబ్ (0.2%), థైరామ్, ఫైటోలాన్, ప్రొపినెబ్, క్లోరోథలోనిల్ మరియు నాబామ్, ప్రొపికోనజోల్ (0.15%), టెబుకోనజోల్ మరియు హెక్సాకోనజోల్ (0.5%) వంటి శిలీంద్ర నాశినులను ఉపయోగించండి. మాంకోజెబ్‌కు ఈ తెగులు నిరోధకత పెరగకుండా నిరోధించడానికి, శిలీంద్ర నాశినుల మిశ్రమాలను ఉపయోగించండి.
ఆల్టర్నేరియా ట్రిటిసినా అనే ఫంగస్ వల్ల ఈ నష్టం జరుగుతుంది. ఇన్ఫెక్షన్ మట్టి ద్వారా మరియు విత్తనం ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన విత్తనాలు ఆరోగ్యకరమైన వాటి కంటే చిన్నవిగా ఉంటాయి మరియు కుంచించుకుపోయి తరచూ గోధుమ రంగులోకి మారుతాయి. ఈ తెగులు సోకిన నేలల్లో నాటినప్పుడు లేదా సోకిన పంట అవశేషాలతో (ఉదా., వర్షపు తుంపర్ల వలన లేదా ప్రత్యక్ష ప్రత్యక్షంగా అంటుకోవడం వలన ) మొక్కలు ప్రభావితమవుతాయి. వేసవిలో, ఈ ఫంగస్ రెండు నెలల వరకూ మట్టి పైన తెగులు సోకిన పంట అవశేషాలలో జీవించి ఉంటుంది మరియు కప్పబడివున్న పంట అవశేషాలలో నాలుగు నెలల వరకూ జీవించి ఉంటుంది. నాలుగు వారాల కంటే తక్కువ వయస్సు గల చిన్న గోధుమ మొలకలకు ఈ ఎ. ట్రిటిసినా సంక్రమించలేకపోవడం వలన మొక్కల వయసు పెరగడంతో పాటూ ఈ తెగులు సంక్రమించే అవకాశాలు పెరుగుతాయి. మొక్కలు ఏడు వారాల వయస్సు వచ్చేవరకు సాధారణంగా లక్షణాలు కనిపించవు. 20-25° C ఉష్ణోగ్రతలు ఈ తెగులు సంక్రమించడానికి మరియు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు పంట దిగుబడి నష్టాలు 80% మించి ఉండవచ్చు.