Phakopsora gossypii
శీలీంధ్రం
ముందుగా ముదురు ఆకులపైన ఈ తెగులు లక్షణాలు కనపడతాయి. ఇవి చిన్న చిన్న ప్రకాశవంతమైన పసుపు నుండి నారింజ రంగులో వున్నబుడిపెలుగా కనపడతాయి. ఇదే రంగులో వీటికన్నా పెద్ద మరియు చూడడానికి గరుకుగా వున్న బుడిపెలు క్రింది భాగంలో ఏర్పడతాయి. ఈ తెగులు విస్తరిస్తున్నకొలదీ చుట్టూ పసుపురంగు వలయాలతో ఇవి పెద్దగా ఉబ్బినట్టువున్న పాలిపోయిన గోధుమరంగు ఫంగస్ బుడిపెలుగా మారతాయి. ఇవి పగిలి బీజాంశాలు విడుదల చేస్తాయి. ఇవి తరుచుగా కలిసిపోయి ముదురురంగు మచ్చలుగా మారతాయి. కాండంపైన మరియు ఆకు కాడలపైన ఈ బుడిపెలు సాగినట్టుగా ఉండి పెద్దగా వుబ్బకుండా ఉంటాయి. ఈ తెగులు మరింత విస్తరిస్తునప్పుడు ఆకులు ముందుగానే రాలిపోయి పత్తి కాయల పరిమాణం తగ్గిపోతుంది.
దీని తీవ్రతను తగ్గించడానికి 1% కోరింబియా సిట్రోడోరియా, సింబోపొగన్ నర్డుస్ ౦.5%, మరియు తిముస్ వల్గారిస్ 0.3 % లను ఉపయోగిస్తున్నారు.
వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణా చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. దీనిని నియంత్రించడానికి సరైన శీలింద్ర నాశినిని ఎంచుకోవడం మరియు సరైన సమయంలో ఉపయోగించడం చాలా ముఖ్యం. హెక్సాకోనజోల్ మరియు ప్రొపికోనజోల్ ఆధారిత శీలింద్ర నాశినులను (ఒక లీటరుకు 1-2 మిల్లీలీటర్లు) విత్తనాలు నాటిన 75 రోజుల తర్వాత నుండి 15 రోజులకు ఒకసారి చొప్పున 120 రోజుల వరకు వాడడం వలన దిగుబడి నష్టాన్ని నివారించవచ్చు. గ్రమ్మ గడ్డిపైన బీజాంశాలు ఏర్పడకముందు మాంకోజెబ్ 0.25% ను పిచికారీ చేయండి.
ఫాకోస్పోరా గోస్సిపి అనే ఫంగస్ వలన సంక్రమించే ఈ తెగులు ప్రత్తిలో ఒక తీవ్రమైన తెగులు ఇది విత్తనాలవలన కానీ మట్టి వలన కానీ సంక్రమించదు. ఇది జీవించడానికి ఆకుపచ్చని జీవించివున్న కణజాలం కావాలి. సీజన్లో తెగులు సంక్రమించిన గ్రమ్మ గడ్డి కి ( బౌటిలోవా spp.) వున్న బుడిపెల నుండి సంక్రమించిన బీజాంశాలు పొడవాటి గోధుమరంగు లేదా నల్లని చుక్కలను ఆకులపైన ఉత్పత్తి చేస్తాయి. తరువాతి సీజన్ ప్రారంభంలో ఇలా గడ్డిపైన ఉత్పత్తి అయిన బీజాంశాలు పత్తి పంటను ఆశించి వాటి జీవన చక్రాన్ని పూర్తిచేస్తాయి. ఈ బీజాంశాలు ఆకులపైన రంధ్రాలు లేదా గాయాల ద్వారా కాకుండా మొక్కల కణాలలోకి ప్రత్యక్షంగా చొచ్చుకుపోతాయి. అధిక తేమ, ఆకులపై తడి మరియు వెచ్చని ఉష్ణోగ్రతలు ఈ తెగులుకు అనుకూలంగా ఉంటుంది.