Peronosclerospora sorghi
శీలీంధ్రం
తెల్లటి బూజు పెరుగుదల ఆకుల ఎగువ మరియు దిగువ ఉపరితలం రెండింటిపైనా ఏర్పడుతుంది. కణుపులు కురచగా మారడం వల్ల మొక్కలు కుంగిపోయి గుబురుగా కనిపిస్తాయి. మొక్కజొన్న కుచ్చులో ఇంకా విచ్చుకోని మగ పువ్వుల తొడిమలపై కూడా ఈ బూజు పెరుగుతుంది. కుచ్చులో చిన్న పెద్ద లార్వాలు కనపడతాయి.
వ్యాధి నిరోధక రకాలు మరియు సంకర జాతి రకాలను సాగు చేయండి.
నివారణ చర్యలు మరియు అందుబాటులో ఉన్న జీవ చికిత్సలతో కూడిన సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. మెటాలాక్సిల్ మరియు మాంకోజెబ్ వంటి క్రియాశీల పదార్ధాలను కలిగి ఉన్న అంతర్వాహిక శిలీంద్ర నాశినులతో విత్తన శుద్ధి చేయండి.
ఫంగస్ వల్ల ఈ నష్టం జరుగుతుంది, ఇది ఆకు రెండు వైపులా తెల్లటి బూజులాగా పెరుగుతుంది. వ్యాధి సోకిన మొక్కజొన్న గింజలలో నిద్రాణ స్థితిలో ఉన్న మైసిలియం కారణంగా మరియు నేలలోని ఓస్పోర్స్ ద్వారా ప్రాధమికంగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఫంగస్ అతిధేయ కణజాలాన్ని ఆవాసంగా చేసుకున్న తర్వాత, స్పోరాంగియోఫోర్స్ స్టోమాటా నుండి ఉద్భవించి, కోనిడియాను ఉత్పత్తి చేస్తాయి, ఇవి వర్షం మరియు గాలి తుంపర్ల ద్వారా రెండవసారి సంక్రమణను వ్యాపింపచేస్తాయి.