క్యాబేజీ

పండు మిరపలో కోవనేఫోరా ఎండు తెగులు

Choanephora cucurbitarum

శీలీంధ్రం

క్లుప్తంగా

  • సాధారణంగా ఈ ఫంగస్ మొక్క పైభాగాలను ముందు ఆశించి తర్వాత క్రిందకు పెరుగుతుంది.
  • ఆకులు మరియు మొగ్గలు తడిగా అయ్యి వెండి రంగులోకి మారి కుళ్ళడం మొదలవుతుంది.
  • పండు క్రింద కొంత భాగం గోధుమరంగు నుండి నల్లని రంగులోకి మారుతుంది.
  • తెగులు సోకిన కణజాలంపై ఒక పొర ఫంగస్ పెరుగుదల కనిపిస్తుంది.

లో కూడా చూడవచ్చు

21 పంటలు
చిక్కుడు
కాకరకాయ
క్యాబేజీ
కాలీఫ్లవర్
మరిన్ని

క్యాబేజీ

లక్షణాలు

ముందుగా పువ్వులు, పూమొగ్గలు లేదా మొక్క ఎదుగుతున్న భాగాలు ముదురుగా అయ్యి వాలిపోవడం జరుగుతుంది. ( బ్లాసమ్ బ్లెయిట్) తర్వాత ఇది నీటిలో నానినట్టు వుండే మచ్చలను తయారు చేసి మొక్క క్రింద భాగాలకు వ్యాపిస్తుంది. ఇవి చూడడానికి వెండి రంగులో ఉంటాయి. పాత మచ్చలు నిర్జీవంగా మారి ఎండిపోయినట్టు కనిపిస్తాయి. దీనివలన ఎండిపోయిన ఆకు చివర్లు మరియు అంచులు ఎండిపోయినట్టు అవుతాయి. కాండం పైన గోధుమరంగు నుండి నల్లని రంగులో కుళ్లిపోయిన గుర్తులు కనిపిస్తాయి. మొత్తానికి మొక్క మొత్తం ఎండిపోయి వాడిపోవచ్చు. లేత పండ్లపైన క్రిందిభాగంలో నల్లని కుళ్ళిన మెత్తని పదార్ధం వృద్ధి చెందుతుంది. దీనిని దగ్గర్నుండి చూస్తే ఈ తెగులు సోకిన కణజాలం పైన వెండి రంగు వెంట్రుకల వంటి పెరుగుదల కనిపిస్తుంది. మొలకలలో ఈ తెగులు ఫైతోప్తోరా ఎండు తెగులు వలె కనిపిస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులును నియంత్రించడానికి ఎటువంటి జీవ నియంత్రణ పద్ధతులు అందుబాటులో లేవు. బెనిన్ లో బాక్త్రం సబ్టిలిన్ ను పరీక్షించినప్పుడు సానుకూల ఫలితాలు వచ్చాయి. ఇది కోవనేఫోరా కుకుర్బిటారం కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కానీ పండు మిరప పైన ఇప్పటి వరకు ఎటువంటి ప్రయోగాలు జరపలేదు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణా చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ ఫంగస్ పై పనిచేసే ఎటువంటి శీలింద్ర నాశినులు లేవు. అందువలన నివారణా చర్యలు చేపట్టడం చాలా ముఖ్యం . ఈ తెగులు లక్షణాలను తగ్గించడం కోసం శీలింద్ర నాశినులతో ఈ ఫంగస్ ను నియంత్రించడం మంచిదే కానీ పువ్వులు చాలా త్వరగా వస్తూ ఉండి వెంటనే ఈ ఫంగస్ వాటికి సంక్రమించడం వలన వీటిని నియంత్రించడం చాలా కష్టమైన పని.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు కోవనేఫోరా కుకుర్బిటారం అనే అవకాశవాద ఫంగస్ వలన కలుగుతాయి. కీటకాల వలన మరియు పొలంలో పనిచేస్తున్నప్పుడు యంత్రాల వలన కలిగిన గాయాల ద్వారా ఈ ఫంగస్ మొక్క లోకి ప్రవేశిస్తుంది. దీని బీజాంశాలు గాలి ద్వారా, నీరు చిమ్మడం ద్వారా, లేదా బట్టలు, పనిముట్లు మరియు పొలంలో ఉపయోగించే సామాగ్రి ద్వారా వ్యాపిస్తాయి. సుదీర్ఘ కాలం వర్షాలు పడినపుడు, అధిక తేమ మరియు అధిక ఉష్ణోగ్రతలు వున్నప్పడు ఈ ఫంగస్ బాగా వృద్ధి చెందుతుంది. ఉష్ణ మండల వాతావరణంలో, వర్షాకాలంలో ఈ ఫంగస్ పండు మిరప పంటకు అధిక స్థాయిలో నష్టం కలగచేస్తుంది. ఈ పరిస్థితులకు తట్టుకోలేని పంటలకు ఈ తెగులు వలన బాగా నష్టం కలుగుతుంది. ఈ తెగులును ఫైతోప్తోరా తెగులుకు తేడా తెలుసుకోవడానికి ఉదయం సమయాలలో కణజాలాన్ని బూడిద రంగు వెంట్రుకలకోసం గమనించండి.


నివారణా చర్యలు

  • ఈ తెగులు లక్షణాల కోసం పొలాన్ని గమనిస్తూ వుండండి.
  • పొలంలో మరియు పొలం చుట్టు ప్రక్కల ఈ తెగులు సోకే అవకాశం వున్న ఇతర ప్రత్యామ్న్యాయ మొక్కలను తొలగించి నాశనం చేయండి.
  • మట్టి గట్టిపడడాన్ని నివారించి వీలైతే మంచి మురుగు నీటి సౌకర్యాన్ని ఏర్పాటుచేసుకోండి.
  • మొక్కలను నాటుతున్నప్పుడు మొక్కల మొదళ్ళ వద్ద మట్టి క్రుంగి ఉండకుండా చూడండి.
  • మొక్కలను ఎతైన గట్లపైన వేసి మొక్కల మధ్యన సరైన అంతరాన్ని ఏర్పాటుచేయండి.
  • మొక్కలకు పైనుండి నీరు పెట్టవద్దు.
  • వీలైనంత వరకు ఆకులను పొడిగా ఉంచండి.
  • అధిక మోతాదులో పోషకాలను వాడవద్దు.
  • దీనివలన మొక్కల పైన గుబురుగా ఆకులు పెరుగుతాయి.
  • ఈ తెగులు సోకని మొక్కలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి