కాప్సికమ్ మరియు మిరప

పండు మిరపలో బూడిద తెగులు

Leveillula taurica

శీలీంధ్రం

క్లుప్తంగా

  • పౌడర్ లాంటి తెల్లని మచ్చలు ఆకు క్రిందిభాగంలో కనపడతాయి.
  • ఆకు పైభాగంలో పసుపు రంగు మచ్చలు కనపడతాయి.
  • పిండిలాంటి పదార్ధం ఆకులపైన కప్పేస్తుంది.
  • దీనిని తుడిచేయవచు.
  • తెగులు సోకిన భాగాలు ముడుతలు పడి ఆకులు రాలిపోతాయి.
  • మొక్క చనిపోవచ్చు.

లో కూడా చూడవచ్చు


కాప్సికమ్ మరియు మిరప

లక్షణాలు

లేవెఇల్లులా ఎక్కువగా ఆకులను ప్రభావితం చేస్తుంది కాని అప్పుడప్పుడు కొమ్మలకు, కాయలకు సోకుతుంది. మొట్టమొదటి లక్షణాలు ఆకుల దిగువ భాగంలో తెల్లని పొడి ఏర్పడి మరియు పసుపుపచ్చ మచ్చలు వేరు వేరుగా ఆకుల పై భాగంలో కనబడుతాయి. తరవాత తెల్లటి భాగంలో, పొడితో కూడుకున్న మచ్చలు కూడా ఆకు పైభాగంలో అభివృద్ధి అవుతాయి. ఈ తెగులు ముదిరేకొద్ది, సోకిన భాగాల ఆకులు రాలడం మరియు మొక్కలు చనిపోవడం కూడా జరగవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

తోటల కోసం పాలు-నీటి ద్రావణం సహజ శిలీంధ్రం వలె పని చేస్తుంది. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఆకులపై వాడండి. బూడిద తెగులు యొక్క రకాలు అవి సంక్రమించే మొక్కలను బట్టి మారుతూ ఉంటాయి మరియు ఈ తెగులుకు ఒకే విధమైన పరిష్కారం అన్ని రకాల పరిస్థితులలోను సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు. ఏ రకమైన మెరుగుదల కనిపించకపోతే వెల్లుల్లి లేదా సోడియం బైకార్బోనేట్ ద్రావణాలను ప్రయత్నించండి. వాణిజ్య జీవ చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. బూడిద తెగులుకు గురయ్యే పంటల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఏదైనా ఒక నిర్దిష్ట రసాయనిక పద్దతిని సిఫారసు చేయడం కష్టం. వెట్టబుల్ సల్ఫర్, ట్రైఫ్ ఫ్లూజిజోల్, మైక్లోబ్యుటనీల్ వంటి ఫంగైసైడ్స్ కొన్ని పంటలలో ఫంగస్ వృద్ధిని నియంత్రిస్తాయి.

దీనికి కారణమేమిటి?

ఫంగల్ ఆవశేషాలు చలికాలంలో ఆకు మొగ్గలలో మరియు మొక్క వ్యర్థాలలో వుంటాయి. గాలి, నీరు దగ్గర లోని మొక్కలకు తెగులు కారకాన్ని వ్యాప్తి చేస్తాయి. ఇది ఫంగస్ అయినప్పటికీ వేడి వాతావరణ పరిస్థితులలో కూడా వృద్ధి చెందుతుంది. ఇది 10-12°C ఉష్ణోగ్రతల వద్ద కూడా జీవించగలదు అయితే సాధారణ పరిస్థితులలో ఇది 30°C వరకు కూడ బతకగలదు. తక్కువ వర్షాలు మరియు సాధారణంగా ఉదయం కురిసే మంచు, బూడిద తెగులు ఉధృతిని పెంచుతుంది.


నివారణా చర్యలు

  • తెగులు తట్టుకునే విత్తన రకాలను ఉపయోగించండి.
  • మొక్కలకు సరైన గాలి వెలుతురు తగిలేటట్టు మొక్కలమధ్య ఎడం పాటించండి.
  • మొదటి సారి మచ్చలు కనిపించిన వెంటనే తెగులు సోకిన ఆకులను తొలగించండి.
  • తెగులు సోకిన మొక్కలను తాకిన తర్వాత ఆరోగ్యకరమైన మొక్కలను తాకవద్దు.
  • మట్టిపై రక్షక కవచం ఏర్పరచడం వలన మట్టి నుండి ఆకుల మీదికి ఈ తెగులు వెళ్లకుండా నిరోదిస్తుంది.
  • కొన్ని సందర్భాల్లో పంట మార్పిడి పనిచేస్తుంది.
  • సమతుల ఎరువులను వాడండి.
  • తీవ్ర ఉష్ణోగ్రత మార్పులను నివారించండి.
  • పంట కోసిన తర్వాత మొక్కల అవశేషాలు నేలలో కలియునట్లు లోతుగా కలియ దున్నండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి