ప్రత్తి

బూడిద ఆకు మచ్చ తెగులు

Stemphylium solani

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకుల పైభాగంలో తెల్లని మధ్య భాగంతో చుట్టూ వంగ పండు రంగు అంచులతో కేంద్రీకృతమైన నమూనాలో మచ్చలు ఏర్పడతాయి.
  • ఆకుల కణజాలంపై పగుళ్లు ఏర్పడి తుపాకీ గుళ్ల నమూనాలో కనిపిస్తాయి.
  • ఇది పొటాషియం లోపం లక్షణాలను పోలి ఉంటుంది.

లో కూడా చూడవచ్చు

7 పంటలు
ప్రత్తి
వంకాయ
వెల్లుల్లి
ఉల్లిపాయ
మరిన్ని

ప్రత్తి

లక్షణాలు

ఆకుల పైభాగంలో తెల్లని మధ్య భాగంతో చుట్టూ వంగ పండు రంగు అంచులతో కేంద్రీకృతమైన నమూనాలో మచ్చలు ఏర్పడతాయి. ఆకుల కణజాలంపై పగుళ్లు ఏర్పడి తరువాత ఇవి రాలిపోయి తుపాకీ గుళ్ల నమూనాలో కనిపిస్తాయి. ముందుగా ఈ మచ్చలు మొక్క పైభాగంలో వున్న ఆకుల అంచుల వద్దనుండి మొదలై క్రమంగా ఆకు లోపలవరకు విస్తరిస్తాయి. పోషకాల అవసరం అధికంగా ఉండడంతో పైభాగంలో వుండే ఆకులకు ఈ తెగులు సంక్రమించే అవకాశాలు చాలా అధికంగా ఉంటుంది. సరైన సమయంలో ఈ తెగులును గుర్తించి పొటాషియంతో చికిత్స చేస్తే ఈ తెగులు ద్వీతీయం అవుతుంది.కానీ దీని వలన ఆకులన్నీ ముందుగానే రాలిపోయి దిగుబడి తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం వుంటుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ శీలింద్రాన్ని నియంత్రించడానికి ఇప్పటి వరకూ ఎటువంటి జీవన నియంత్రణ పద్దతి అందుబాటులో లేదు. దీనిని నివారించేందుకు నివారణ చర్యలను చేపట్టండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులు చికిత్సకు శీలింద్ర నాశినులు (పైరా క్లొస్ట్రోబిన్, పైరా క్లొస్ట్రోబిన్ + మెట్కోనజోల్) అందుబాటులో వున్నాయి కానీ వీటి వాడకం ఆర్ధికంగా లాభసాటి కాకపోవడం వలన వీటి వాడకం సిఫార్స్ చేయబడదు.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు స్టెమ్ఫిలియామ్ సోలని అనే ఫంగస్ వలన ఏర్పడతాయి. అధిక తేమ, తరుచుగా వర్షపాతం, మరియు అధిక సమయం కరువు పరిస్థితులు ఈ తెగులును అనుకూలంగా ఉంటాయి. పుష్పించే దశ లేదా ప్రత్తి కాయాలు ఏర్పడే సమయంలో శారీరక లేదా పోషకాల వత్తిడి కూడా ఒక ముఖ్యమైన కారకంగా ఉంటుంది. ఈ తెగులు సంక్రమించడానికి పొటాషియం లోపం ఒక ముఖ్య కారణం కానీ కరువు, కీటకాల వత్తిడి లేదా మట్టిలో నెమటోడ్లు ఉండడం కూడా దీనికి కారణం కావచ్చు. వీటి బీజాంశాలు ఇతర మొక్కలపైకి వెదజల్లబడడానికి గాలి కూడా సహాయకారిగా ఉంటుంది. 20-30°C ఉష్ణోగ్రత ఈ ఫంగస్ వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది. జెనెరే ఆల్ట్రనేరియా మరియు సేర్కుస్పోరా ఫంగస్ తో కలసి ఇది ఒక సంక్లిష్ట తెగులుగా ఆకృతిని సంతరించుకోవచ్చు. ప్రత్తి, టొమాటో, బంగాళా దుంప, పండు మిరప, వంగ మరియు ఉల్లి పంట ఈ తెగులుకు ప్రత్యామ్న్యాయ అతిధులుగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • అవసరమైతే పొటాషియంను ముందస్తు ఎరువుగా వేయండి.
  • పొటాషియం అవసరం తక్కువగా వుండే దీర్ఘకాలిక రకాలను పండించండి.
  • ఈ తెగులు లక్షణాలకు పొలాన్ని క్రమం తప్పక గమనిస్తూ వుండండి.
  • సమతుల ఎరువులను వాడి మొక్కలు మంచి సత్తువతో ఎదిగేటట్టు చూడండి.
  • పొటాషియం అధికంగా వుండే ఎరువులను సమయానుసారం( వాయిదాల పద్దతిలో), ముఖ్యంగా ఇసుక నేలల్లో, వేయండి.
  • అవసరమైతే పుష్పించే దశ మొదలైన ముందు నాలుగు వారాలలో ఆకులపైన పిచికారీ చేయండి.
  • ఈ సమస్యను పరిష్కరించడం కోసం పొటాషియంను అధికమొత్తంలో ఉపయోగించకండి.
  • మొక్కలు కరువు వత్తిడికి గురికాకుండా ఉండడానికి క్రమం తప్పకుండా నీరు పెట్టండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి