Peronospora manshurica
శీలీంధ్రం
డౌనీ బూజు యొక్క ప్రారంభ లక్షణాలు లేత మొక్కలపై సంభవిస్తాయి, అయితే ఈ తెగులు పొలంలో మొక్కలు పూర్తిగా వృద్ధి చెందే చివరి దశ వరకు లేదా పునరుత్పత్తి ప్రారంభమయ్యే తొలి దశ వరకు వృద్ధి చెందదు. ప్రారంభంలో చిన్న, సక్రమంగా లేని , పాలిపోయిన పసుపు మచ్చలు ఆకు పైభాగాన కనిపిస్తాయి. తరువాత, అవి పసుపు రంగు అంచుతో బూడిద-గోధుమ రంగులోకి మారుతాయి. ఆకుల దిగువ భాగంలో, వ్యాధికారక సూక్షజీవుల ఉనికి కారణంగా బూడిద రంగు మచ్చలు మసక గా కనిపిస్తాయి. తరచుగా, ఈ లక్షణాలు పందిరి అంతటా దిగువ స్థాయిలో కనిపిస్తాయి. కాయలకు సోకినప్పుడు, కాయల లోపల పెంకు కట్టినట్టు వున్న శిలీంధ్రం లాంటి పెరుగుదల కనిపిస్తుంది. తెగులు సోకిన గింజ నిస్తేజమైన తెల్లని రూపాన్ని కలిగి ఉంటుంది మరియు పాక్షికంగా లేదా పూర్తిగా ఫంగస్‌తో కప్పబడి ఉంటుంది. గాయం పరిమాణం మరియు ఆకారం, ఆకు వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. పాత గాయాలు పసుపు లేదా ఆకుపచ్చ అంచులతో బూడిద గోధుమ రంగు నుండి ముదురు గోధుమ రంగులోకి మారవచ్చు. తీవ్రంగా తెగులు సోకిన ఆకులు పసుపు నుండి గోధుమ రంగులోకి మారి ముందుగానే రాలిపోతాయి.
ఈ రోజు వరకు, ఈ వ్యాధికారకానికి వ్యతిరేకంగా జీవసంబంధ నియంత్రణ పద్ధతి గురించి మాకు తెలియదు. సంభవం లేదా లక్షణాల తీవ్రతను తగ్గించడానికి ఏదైనా విజయవంతమైన పద్ధతి మీకు తెలిస్తే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. విత్తన చికిత్స కోసం మెటలాక్సిల్, ఆక్సాడిక్సిల్ వంటి శిలీంద్ర నాశినులను మాన్‌కోజెబ్, మనేబ్ లేదా జినెబ్‌తో కలిపి వాడండి.
పెరోనోస్పోరా మన్షూరికా అనే ఫంగస్ లాంటి జీవి వల్ల డౌనీ బూజు తెగులు సోకుతుంది. పొలంలో, మందపాటి గోడల విశ్రాంతి బీజాంశంగా ఆకు శిధిలాలలో మరియు అప్పుడప్పుడు విత్తనాలపై, శీతాకాలంలో ఇది జీవించి ఉంటుంది. పూత దశ ప్రారంభమైన తర్వాత ఈ వ్యాధి చాలా సాధారణంగా సంక్రమిస్తుంది. లేత ఆకులు ఈ తెగులుకు చాలా ఎక్కువగా ప్రభావితమవుతాయి మరియు తెగులు సోకిన ఆకులు అధికంగా మొక్కల పైభాగంలో కనిపిస్తాయి. ఎదిగిన సోయాబీన్ మొక్కలపై మచ్చల సంఖ్య పెరగవచ్చు మరియు పాత ఆకులపై ఈ మచ్చల పరిమాణం చిన్నగా ఉంటుంది. మితమైన ఉష్ణోగ్రతలు (20-22°C) మరియు అధిక తేమ ఈ తెగులుకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా, వాతావరణంపై ఈ తెగులు వృద్ధి ఆధారపడి ఉంటుంది. తేమ తగ్గినప్పుడు, బూజు తెగులు వ్యాధికారకం దెబ్బతింటుంది మరియు భవిష్యత్తులో వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉంటుంది. అధిక తేమ మరియు స్థిరమైన వర్షపాతం సంభవించినప్పుడు, బూజు తెగులు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.