Ascochyta gossypii
శీలీంధ్రం
అస్కోచ్యత ఎండు తెగులు సాధారణంగా సీజన్ మొదట్లో సంక్రమిస్తుంది. గుండ్రని లేత గోధుమ రంగు లేదా తెల్లని చుక్కలు మొలకల మొదటి ఆకులపైన మరియు మొలకల క్రింది ఆకులపైన ఏర్పడతాయి. ఈ మచ్చలు బాగా పెద్దది అయ్యి వంగ పండు- గోధుమ రంగు అంచులు కలిగి ఉంటాయి. తరువాత ముదురు ఆకులపైన ముదురు గోధుమ రంగు అంచుతో రాగి రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఒకదానితో మరొకటి కలసిపోయి చాలా అధికంగా రాగి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల మధ్య భాగం లేత గోధుమ లేదా బూడిద రంగులోకి మారి పేపర్ వలే అయిపోయి చివరకు రాలిపోతాయి. చాలా రోజుల వరకూ మబ్బులు మరియు తేమ వాతావరణం వున్న సమయంలో పొడవుగా వున్న నల్లని లేదా బూడిద రంగు పొక్కులు కాండంపైన కనపడతాయి. ఇక్కడ కూడా చిన్న చిన్న నల్లని పొక్కులు ఈ మచ్చలపైన కనిపిస్తాయి. కొన్నాళ్లకు ఈ పొక్కులు ఎండిపోయి చీలికలు ఏర్పడి కాండం చుట్టూ ఏర్పడతాయి. ఈ తెగులు పువ్వులపైన దాడి చేయదు. కానీ ప్రత్తి కాయలు సగం తెరుచుకుని లోపల ప్రత్తి బూడిద రంగులోకి మారిపోతుంది.
ఇప్పటివరకు ఈ తెగులుకు ఎటువంటి జీవన నియంత్రణ చికిత్స అందుబాటులో లేదు. బోర్డెయక్స్ మిశ్రమం వంటి కాపర్ ఆధారిత శీలింద్ర నాశినులు వాడి ఈ తెగులు విస్తరించకుండా చేయవచ్చు. గమనిక, ఇది మొక్కలలో విషపూరిత స్పందన కలగచేయవచ్చు.
వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. నాటే ముందు తీరం లేదా తీరం + థియాబెండజోల్ తో విత్తన శుద్ధిని చేయవచ్చు. మొక్కలు అప్పటికే ఎదిగి ఉంటే నివారణ చర్యగా క్లోరోతలోనిల్ ఆధారిత ఆకుల పిచికారీను ఉపయోగించవచ్చు. ఈ తెగులును గుర్తించిన వెంటనే ఆకులపైన శీలింద్ర నాశినులను ఒకదాని తర్వాత ఇంకొకటి మార్చి మార్చి వాడడం సిఫార్స్ చేయబడినది. (బొస్కలిడ్, మాంకోజెబ్, పైరాక్లోస్ట్రోబిన్ + ఫ్లూక్సాపైరోక్సడ్). దిగుబడి నష్టాలను తగ్గించడానికి మొక్కల ఎదుగుదల దశ మొత్తం ఈ మందులను వాడవలసివుంటుంది.
అస్కోచ్యత ఎండు తెగులు ప్రత్తి పండించే చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ తెగులు అస్కోచ్యత గోస్సిప్పి అనే ఫంగస్ వలన కలుగుతుంది. అనుకూల పరిస్థితులలో ఇది పంట అవశేషాల పైన చాలా సంవత్సరాలవరకు జీవిస్తుంది. ఇది గాలి ద్వారా మరియు వర్షం ద్వారా వ్యాప్తి చెందే బీజాంశాలను కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వ్యాపింపచేస్తుంది. చల్లని, మేఘాలతో కూడిన మరియు వర్షపు వాతావరణ పరిస్థితులు, అధిక తేమ, ఉదయం పూట మంచు. మరియు అధిక సమయం ఆకులపైన తేమ (2 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం) ఈ తెగులు విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఫంగస్ 5-30°C ఉష్ణోగ్రతల వద్ద కూడా బాగా వృద్ధి చెందుతుంది. కానీ 15-25°C మధ్యన దీని ఎదుగుదలకు బాగా అనుకూలమైన ఉష్ణోగ్రతగ ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే మొక్కలు ఎదిగే దశలో చాలా సార్లు ఈ తెగులు సంభవించే అవకాశం ఉంటుంది. దీనివలన చాలా వరకూ దిగుబడిలో నష్టం కలగదు. కానీ దీనికి అనుకూల పరిస్థితులలో దిగుబడి నష్టం కలిగే అవకాశం ఉంటుంది.