Rhizoctonia solani
శీలీంధ్రం
40-50 రోజులలో పూత దశకు ముందు వ్యాధి సోకుతుంది ఐతే లేత మొక్కలకు కూడా సోకవచ్చు. ఆకులు, తొడుగులు, కాండాలపై లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. ఆకులు ఇంకా తొడుగుల మీద, నానబెట్టిన, రంగుమారిన కేంద్రీకృత బ్యాండ్లు మరియు వృత్తాలు కనబడుతాయి, చాలా తరచుగా గోధుమ రంగు,లేదా బూడిదరంగులో కనిపిస్తాయి. సాధారణంగా, లక్షణాలు నేల తరవాత వచ్చే మొదటి మరియు రెండవ ఆకు తొడుగు మీద కనిపిస్తాయి. కాలక్రమేణా, చిన్న, వృత్తాకార, నలుపు వర్ణాలతో ఒక సున్నితమైన లేత గోధుమ రంగులో దూదివంటి పదార్థం వ్యాధి సోకిన కణజాలం మీద అభివృద్ధి చెంది తరువాత పిలక వరకు వ్యాపిస్తుంది. అభివృద్ధి చెందుతున్న లోపలి భాగం పూర్తిగా దెబ్బతిని పెరగక ముందే ఆకుల యొక్క ఊక పగుళ్ళుతో ముందుగానే ఎండిపోతుంది. సంక్రమణ తీవ్రత పిలక అభివృద్ధి దశల మీద ఆధారపడి ఉంటుంది. మొలకలు ప్రభావితమైతే, పెరుగుతున్న పాయింట్లు చనిపోయి, ఒక వారంలోగా మొక్కలన్నీకూడా ఎండినట్టు అయిపోతాయి.
ఈ తెగులు సంక్లిష్టత మరియు తీవ్రతను తగ్గించడానికి, మొక్కజొన్న విత్తనాలు 1% సోడియం హైపోక్లోరైట్ ద్రావణంలో మరియు 5% ఇథనాల్ లో 10 నిమిషాల పాటు స్టెరిలైజ్ చేసిన తర్వాత నీటిలో మూడుసార్లు కడిగి ఆరబెట్టండి. బాసిల్లస్ సబ్లిటిస్ కలిగి ఉన్న సమ్మేళనాలతో అదనపు చికిత్స చేయడం వలన దీని పనితనాన్ని పెంచుతుంది. ఫంగస్ ట్రైకోడెర్మా హర్జియానం లేదా T. విరిడి కలిగి ఉన్న ఉత్పత్తులు ఈ తెగులు వ్యాప్తిని పరిమితం చేయడానికి విజయవంతంగా ఉపయోగించబడ్డాయి.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మొక్కజొన్న విత్తనాలు క్యాప్టన్, థిరామ్ లేదా మెటాలాక్సిల్ తో మూడు సార్లు కడిగి ఆరబెట్టాలి. ఈ తెగులుకు సులభంగా లోనయ్యే రకాలను వాడినప్పుడు ఇంకా వాతావరణ పరిస్థితులుఈ తెగులు వ్యాప్తికి అనుకూలంగా వున్నప్పుడు శిలీంద్ర నాశీనులవాడకం ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది. ప్రొపికోనజోల్ ఉత్పత్తులు ఈ తెగులు లక్షణాల తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడతాయి.
మట్టిలో వుండే రైజోక్టోనియా సోలని అనే ఫంగస్ ద్వారా ఈ తెగులు లక్షణాలు కనబడుతాయి. ఈ ఫంగస్, మట్టిలో మరియు పంట శిధిలాల మీద లేదా గడ్డి కలుపు మొక్కలపై జీవించగలదు. తేమ మరియు ఉష్ణోగ్రతలు (15 నుండి 35°C, అనువైన ఉష్ణోగ్రత 30°C) మొక్కలు ఎదిగే దశలో ఈ ఫంగస్ మరల ఎదగడం ప్రారంభించి అప్పుడే నాటబడిన అతిధేయ మొక్కలను ఆశిస్తుంది. 70% సాపేక్ష ఆర్ద్రత వద్ద ఈ తెగులు చాల తక్కువగా వృద్ధి చెందుతుంది. అయితే 90-100% R.H వద్ద, అత్యధిక స్థాయిలో ఈ తెగులు వృద్ధి చెంది వ్యాపిస్తుంది. నీటి పారుదల వలన వరదలు మరియు పరికరాలు మరియు దుస్తులు వలన సూక్ష్మ జీవులు వున్న మట్టిని రవాణా చేయడం వలన ఈ శిలీంధ్రాలు వ్యాప్తిచెందుతాయి. ఈ తెగులు ఉష్ణమండల, ఉప ఉష్ణమండలాలలో, తేమ మరియు వేడి వాతావరణంలో మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ ఫంగస్ ను పురుగుల మందులతో నియంత్రించడం చాలా కష్టం అందువలన ఈ తెగులు సోకకుండా నివారణా పద్దతులను అవలంబించడం అవసరం.