ఉల్లిపాయ

ఉల్లిలో స్టెంఫిలియం ఆకు ఎండు తెగులు

Pleospora allii

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకుల పైన చిన్న, నీటిలో నానినట్టు వున్న, తెలుపు నుండి లేత పసుపు మచ్చలు.
  • కాలక్రమేణా, తోలు రంగు నుండి గోధుమ రంగు మధ్య భాగంతో గుంటలు లాంటి పొడవైన, గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.
  • నిర్జీవమైన పెద్ద ప్రాంతాలు కణజాలం విస్తృతంగా ఎండిపోవడానికి కారణమవుతాయి.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
వెల్లుల్లి
ఉల్లిపాయ

ఉల్లిపాయ

లక్షణాలు

ప్రారంభ లక్షణాలలో, ఆకుల పైన చిన్న చిన్న, నీటిలో నానినట్టు వున్న తెలుపు నుండి లేత పసుపు మచ్చలు ఉంటాయి. సాధారణంగా, ఈ మచ్చలు ప్రబలంగా ఉన్న గాలికి ఎదురుగా ఉన్న ఆకుల వైపు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. కాలక్రమేణా, ఈ చిన్న మచ్చలు ఆకు మొన వెంట పెరుగుతాయి మరియు ఇవి నొక్కినట్టు వున్న అండాకారం లేదా పొడవైన గోధుమ రంగు మచ్చలుగా, తోలు నుండి ఊదా రంగు మధ్య ప్రాంతంతో ఇవి ఒకదానితో మరొకటి కలిసిపోతాయి. వాటి మధ్యలో కేంద్రీకృత మండలాలు కూడా వృద్ధి చెందుతాయి. తరువాత దశల్లో పెద్ద నిర్జీవ ప్రాంతాలు ఏర్పడతాయి. ఇవి ఆకు లేదా విత్తన కాండాన్ని చుట్టుముట్టి కణజాలం విస్తృతంగా ఎండిపోవడానికి కారణమవుతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

సాంప్రదాయిక శిలీంద్ర నాశినులకు దగ్గరగా ఉన్న సమర్థతతో స్టెంఫిలియం ఆకు ఎండు తెగులు యొక్క జీవ నియంత్రణ కోసం అజాడిరక్టిన్ ఇండికా (వేప) మరియు డాతురా స్ట్రామోనియం (ఉమ్మెత్త వీడ్) యొక్క సారం ఉపయోగించవచ్చు. గ్రీన్ హౌస్ పరిస్థితులలో, ట్రైకోడెర్మా హర్జియానం మరియు స్టాచీబోట్రిస్ చార్టరమ్ ఆధారంగా ఉత్పత్తులను నివారణ లేదా నిర్ములన కొరకు వాడకం వలన వ్యాధి సంభవత మరియు తీవ్రత తగ్గుతాయి (రెండు సందర్భాల్లోనూ 70%).

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. అజోక్సిస్ట్రోబిన్ + డైఫెనోకొనజోల్, బోస్కాలిడ్ + పైరాక్లోస్ట్రోబిన్, క్లోరోతలోనిల్, ఐప్రోడియోన్, మాంకోజెబ్ మరియు ప్రోక్లోరాజ్ మొదలగు పదార్థాలు కలిగిన ద్రావణం ఎస్. వేసికేరియం పెరుగుదలను తగ్గించడంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. ఫంగస్ కు(చల్లని మరియు పొడి వాతావరణం) అనుకూలం కానీ పరిస్థితులు వున్న సమయంలో ఈ మందులను వాడాలి. సాధారణంగా, ఒకదాని తర్వాత మరొక ఉత్పత్తుల వాడకం వలన శిలీంద్ర నాశినుల ప్రభావం మెరుగు పడుతుంది.

దీనికి కారణమేమిటి?

స్టెంఫిలియం వెసికారియం అని పిలువబడే ప్లీస్పోరా అల్లి అనే ఫంగస్ కారణంగా స్టెమ్ఫిలియం ఆకు ఎండు తెగులు సంక్రమిస్తుంది. అందువల్లనే దీనికి ఈ పేరు వచ్చింది. ఇది తెగులు సోకిన మొక్కల అవశేషాలపై జీవిస్తుంది మరియు వసంతకాలంలో అనుకూలమైన వాతావరణ పరిస్థితులలో తిరిగి వృద్ధి చెందడం ప్రారంభిస్తుంది. ఇది గాలి ద్వారా సమీప మొక్కలకు వ్యాపించే బీజాంశాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది సాధారణంగా ఆకు కొనలు, మునుపటి వ్యాధుల వల్ల కలిగిన గాయాలు లేదా దెబ్బతిన్న కణజాలం (ఉదా. కీటకాలు లేదా వడగళ్ళు నుండి) వంటి చనిపోయిన మరియు చనిపోతున్న ఉల్లి కణజాలంపై దాడి చేస్తుంది. సుదీర్ఘమైన వెచ్చని, తడి వాతావరణం వ్యాధి వృద్ధికి ప్రోత్సాహకరంగా ఉంటాయి. వాతావరణం వెచ్చగా (18-25°C) మరియు ఆకు ఉపరితలం 24 గంటలకు పైగా తడిగా ఉంటే ఆరోగ్యకరమైన ఆకులు కూడా దాడికి గురవ్వవచ్చు. సాధారణంగా ఆకులకే సంక్రమణ పరిమితం అవుతుంది మరియు ఉల్లిగడ్డలను ప్రభావితం చేయదు. లేత ఆకుల కన్నా ముదురు ఆకులు ఈ తెగులుకు గురయ్యే అవకాశాలుఎక్కువగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • నిరోధక రకాలను ఎంచుకోండి (చాలానే అందుబాటులో ఉన్నాయి).
  • ఆకు తడి ఎక్కువ కాలం ఉండటానికి వీలులేకుండా మొక్కల వరుసలను ప్రస్తుత గాలి దిశలో విత్తండి.
  • మంచి గాలి ప్రవాహాన్ని కలిగి ఉండటానికి మొక్కల సాంద్రతను తగ్గించండి.
  • నాటడానికి ముందు పొలాలలో తగినంత నీటి పారుదల ఉండేలా చూసుకోండి.
  • వ్యాధి తీవ్రతను పెంచే నత్రజనిని అధికంగా వాడకండి.
  • పంట తర్వాత సాగు ద్వారా మొక్కల అవశేషాలను తొలగించి పాతిపెట్టండి.
  • 3-4 సంవత్సరాలకు ఒక సారి పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి