Alternaria porri
శీలీంధ్రం
లక్షణాలు ప్రధానంగా పరిసర సాపేక్ష ఆర్ద్రత (RH) పై ఆధారపడి ఉంటాయి. చిన్న, అసక్రమంగా, నొక్కినట్టున్న మరియు తెల్లటి మచ్చలు మొదట ముదురు ఆకులు మరియు పూల కాడలపై కనిపిస్తాయి. సాపేక్ష ఆర్ద్రత తక్కువగా ఉంటే, తదుపరి అభివృద్ధి గమనించబడదు. అయినప్పటికీ, అధిక RH వద్ద ఈ గాయాలు దీర్ఘవృత్తాకార గోధుమ లేదా ఊదా రంగు మచ్చలుగా అభివృద్ధి చెందుతాయి, వాటి కేంద్ర ప్రాంతంపై కేంద్రీకృత కాంతి మరియు చీకటి మండలాలు ఉంటాయి. కాలక్రమేణా, ఈ గాయాలు అనేక సెంటీమీటర్ల పొడవు వరకు విస్తరించి పసుపు రంగు హద్దును కలిగి ఉంటాయి. ఈ మచ్చలు ఒకదానితో మరొకటి కలిసిపోయి ఆకు లేదా పూల కాడను చుట్టుముట్టడం వలన ఎండిపోయి, మరణానికి కారణమవుతాయి. పంట కోత సమయంలో గాయాలైతే ఉల్లి గడ్డలపై కూడా, ప్రధానంగా మెడ వద్ద, దాడి చేయవచ్చు. ముదురు పసుపు రంగు నుండి ఎరుపు, ఉల్లిపాయల పైన లేదా లోపలి భాగాల్లో మెత్తటి కుళ్ళు కనిపిస్తుంది. ఉల్లి, వెల్లుల్లి మరియు ఉల్లి కాడలు ఈ వ్యాధి బారిన పడవచ్చు.
ఇప్పటివరకు ఈ వ్యాధికి సమర్థవంతమైన జీవ నియంత్రణ అందుబాటులో లేదు. క్లాడోస్పోరియం హెర్బరం అనే విరోధి ఫంగస్, ఆల్టర్నేరియా పోర్రీ అనే వ్యాధికారక జీవిని వివోలో సంపర్కాన్ని నిరోధించడానికి ఉపయోగించబడింది. ఇది సంక్రమణను 66.6% తగ్గిస్తుంది. ఇతర శిలీంధ్రాలు చాలా తక్కువ ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు పెన్సిలియం ఎస్ పి. (54%). అనేక విరోధకాల మిశ్రమం వాడకం వలన 79.1% వరకు తగ్గుతుంది. అయితే, ఈ ఫలితాలపై ఇప్పటివరకు వాణిజ్య ఉత్పత్తులు అభివృద్ధి చేయబడలేదు. ఆజాడిరక్టిన్ ఇండికా (వేప) మరియు డాతురా స్ట్రామోనియం (ఉమ్మెత్త కలుపు) యొక్క ద్రవ సారం ఈ ఊదా మచ్చ తెగులు జీవ నియంత్రణ పద్ధతి కొరకు ఉపయోగించవచ్చు.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. రక్షిత శిలీంద్ర నాశినులను మళ్ళీ మళ్ళీ వాడడం ద్వారా చాలా వాణిజ్య ఉల్లిపాయ పంటలను వోడా మచ్చ తెగులు నుండి రక్షించాలి. నాట్లు వేసిన నెల తర్వాత 15 రోజులకు ఒకసారి బోస్కాలిడ్, క్లోరోతలోనిల్, ఫెనామిడోన్ మరియు మాంకోజెబ్ (అన్నీ @ 0.20 నుండి 0.25%) వంటి శిలీంద్ర నాశినుల ఆధారిత ద్రావణాలను పిచికారీ చేయవచ్చు. రాగి శిలీంద్ర నాశినులు ఊదా మచ్చ తెగులు నియంత్రణ కోసం రిజిస్టర్ చేయబడ్డాయి, కానీ అవి పెద్దగా ప్రభావవంతంగా పనిచేయడంలేదు. నిరోధకత వృద్ధిని నివారించడానికి వివిధ కుటుంబాల నుండి ప్రత్యామ్నాయ శిలీంద్ర నాశినులను వాడాలి.
ఆల్టర్నేరియా పోర్రి అనే ఫంగస్ వల్ల ఊదా మచ్చ తెగులు సంక్రమిస్తుంది. శీతాకాలంలో ఇది తెగులు సోకిన పంట అవశేషాలపై లేదా నేల ఉపరితలానికి దగ్గరగా జీవిస్తుంది. వసంతకాలంలో వెచ్చని, తడి పరిస్థితులు ఏర్పడటంతో ఇది బీజాంశాల ఉత్పత్తితో దీని జీవిత చక్రాన్ని తిరిగి ప్రారంభిస్తుంది. గాలి, నీటిపారుదల నీరు లేదా వర్షం బీజాంశాలను ఆరోగ్యకరమైన మొక్కలు మరియు పొలాలకు వెదజల్లుతాయి. 21-30ºC ఉష్ణోగ్రత మరియు 80-90% సాపేక్ష ఆర్ద్రత ఈ తెగులుకు అనుకూల పరిస్థితులు. వ్యాధి సంభవం మరియు లక్షణం యొక్క తీవ్రత కూడా సీజన్ మరియు పొలం యొక్క పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇది స్టెంఫిలియం ఎండు తెగులుతో కలిసి సంక్రమించినప్పుడు నష్టం చాలా తీవ్రంగా ఉండవచ్చు. ప్రధానంగా క్యూటికల్ యొక్క మందం కారణంగా ఊదా రంగు మచ్చ తెగులుకు ప్రతిఘటన ఉంటుంది. పొలం పనులు లేదా ఇసుక దుమారం తర్వాత గాయపడటం వలన ఈ నిరోధకతను తగ్గిపొవచ్చు.