Diaporthe vexans
శీలీంధ్రం
లక్షణాలు ఆకులు, కాండం మరియు పండ్లలో కనిపిస్తాయి. పండ్లపై ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. తేలికపాటి కేంద్రాలతో బూడిద నుండి గోధుమ రంగు చిన్న చిన్న మచ్చలు ఆకులపై కనిపిస్తాయి మరియు చివరికి అవి అధికమై ఆకు మొత్తం కప్పేయవచు. తీవ్రంగా తెగులు సోకిన ఆకులు పసుపు రంగులోకి మారి పగిలిన, నలిగిన కణజాలంతో ( ఆకు మాడు) తరువాత ఎండిపోతాయి. కాండంపై గోధుమ రంగు నుండి నల్లని పగుళ్లు మరియు నొక్కుకుపోయినట్టున్న కాంకర్లు వృద్ధి చెందుతాయి. ఇవి మొక్క మొదలు వద్ద కాండానికి చుట్టుకుపోయి నీరు మరియు పోషకాల రవాణాకు ఆటంకం కలిగించి చివరికి మొక్కను చంపుతాయి. పండ్లపై గోధుమ రంగు మృదువైన గాయాలు కనిపిస్తాయి. ఇవి విస్తరించేటప్పుడు తరచూ ఒకదానితో మరొకటి విలీనమై పండ్ల ఉపరితలం యొక్క అధిక భాగాన్ని కప్పి వాటి అంచులలో చిన్న నల్లని చుక్కల కేంద్రీకృత వలయాలను సృష్టిస్తాయి. చివరికి పండ్లు కుళ్ళిపోతాయి. ఆకులు మరియు కాండాల పాత గాయాలపై చిన్న చిన్న నల్లని చుక్కలు కూడా కనిపిస్తాయి. పొడి వాతావరణంలో తెగులు సోకిన పండు ముడుతలు పడి, ఎండిపోయి, మమ్మీ లాగ మారుతుంది.
వ్యాధి యొక్క సంభావ్యత మరియు తీవ్రతను తగ్గించడంలో సేంద్రీయ శిలీంద్ర నాశినులతో చికిత్సలు ఉపయోగపడతాయి. రాగి ఆధారిత ద్రావణ ఉత్పత్తులను (ఉదా. బోర్డియక్స్ మిశ్రమం) ఆకుల పిచికారీగా ఉపయోగించవచ్చు. వ్యాధి నిర్వహణలో ఉపయోగించబడుతున్న వేప సారం ఒక సురక్షితమైన మరియు పర్యావరణ అనుకూల పరిష్కారం. వేడి నీటి విత్తనాల చికిత్సను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. (56°C ఉష్ణోగ్రత వద్ద 15నిముషాలు).
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పొలంలో వ్యాధిని గుర్తించి, ఆర్థిక పరిమితులను చేరుకుంటే, శిలీంద్ర సంహారిణులతో చికిత్సలు సిఫార్స్ చేయబడతాయి. అజోక్సిస్ట్రోబిన్, బోస్కాలిడ్, కప్తాన్, క్లోరోతలోనిల్, కాపర్ ఆక్సిక్లోరైడ్, డితియోకార్బమేట్స్, మానెబ్, మాంకోజెబ్, థియోఫనేట్-మిథైల్, టోల్క్లోఫోస్-మిథైల్, పైరాక్లోస్ట్రోబిన్ వంటి పురుగుమందులు సాగు నియంత్రణ వ్యూహాలతో కలిపి ఆకులపైన పిచికారీగా ఉపయోగించినప్పుడు శిలీంద్ర సంహారిణి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. విత్తన చికిత్సలను కూడా ఉపయోగించుకోవచ్చు, ఉదాహరణకు థియోఫెనేట్ మిథైల్ (0.2%) తో.
వంకాయలకు మాత్రమే పరిమితం అయినట్లు కనిపించే ఒక వ్యాధికారక ఫోమోప్సిస్ వెక్సాన్స్ అనే ఫంగస్ వల్ల లక్షణాలు వస్తాయి. (టమోటా మరియు పండు మిరప యొక్క అంటువ్యాధులు కొన్ని సందర్భాల్లో రిపోర్ట్ చేసినప్పటికీ). పంట అవశేషాల్లో ఈ ఫంగస్ మనుగడ సాగిస్తుంది మరియు దాని బీజాంశం గాలి మరియు వర్షం ద్వారా ఆరోగ్యకరమైన మొక్కలకు వ్యాపిస్తుంది. ఇది విత్తనాలపైన మరియు వాటి లోపలికి కూడా ప్రవేశిస్తుంది అని భావించబడుతుంది. ఈ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటానికి ధృవీకరించబడిన విత్తనాలు మరియు ఆరోగ్యకరమైన మొలకల వాడకం చాలా ముఖ్యం. ఆకు కణజాలాల ప్రవేశం 6-12 గంటలలోపు జరుగుతుంది, మరియు సంక్రమణ మరియు వ్యాధి వృద్ధి చెందడానికి (27-35°C) వెచ్చని మరియు తేమతో కూడిన పరిస్థితులు అవసరం. స్టోరేజ్ గదులలో 30°C ఉష్ణోగ్రత మరియు 50% సాపేక్ష ఆర్ద్రత వద్ద పండ్లపైన గాయాలు సంభవిస్తాయి.