Pseudoperonospora cubensis
శీలీంధ్రం
పంట పంటకి మధ్యన చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ డౌనీ మైల్డ్యూ వలన ఆకుల పైభాగంలో కోణాకారపు పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ అంతర్నాళ క్లోరోసిస్ మెల్లగా పసుపు రంగు నుండి గోధుమ రంగు మొజాయిక్ నమూనాలోకి మారుతుంది. దీనిని ఇతర వైరస్ తెగుళ్లతో పోల్చకూడదు. ఆకుల క్రింది భాగంలో నీటిలో నానినట్టు వున్న మచ్చలు ఏర్పడతాయి. చల్లని వాతావరణంలో మరియు దీర్ఘకాలం అధిక తేమ వాతావరణం వున్నప్పుడు ఈ మచ్చల క్రింది భాగంలో మృదువైన మరియు నురగగా వుండే బూడిద రంగు బూజు ఆకు క్రింద పెరుగుతుంది. ఈ ఫంగస్ మొక్క నుండి పోషకాలను గ్రహించడం వలన ఇది లేత చిగుర్లు, పువ్వులు, లేదా పండ్లను ఎదగకుండా చేసి చనిపోయేటట్టు చేస్తుంది. దీనివలన ఎదుగుదల తగ్గి దిగుబడి పడిపోతుంది. పౌడర్లి మైల్డ్యూ తో పోలిస్తే ఈ పైపూత ఆకుల క్రిందిభాగంలో మాత్రమే ఏర్పడుతుంది. ఇది ప్రధాన ఈనె వెంబడే పెరుగుతుంది. దీనిని తొలగించడం అంత సులభం కాదు.
ఈ ఫంగస్ పై పోరాడటానికి వాణిజ్య పరమైన ఉత్పత్తులు అందుబాటులో వున్నాయి. తెగులు తీవ్రత తక్కువగా వున్నప్పుడు ఏమి వాడకుండా వాతావరణం మెరుగయ్యేవరకు ఎదురుచూడడం మంచిది. కొన్ని పరిస్థితులలో తెగులు సంక్రమించకముందు బోర్డియాక్స్ మిశ్రమం వంటి కాపర్ ఆధారిత సేంద్రియ శిలీంద్ర నాశినులు వాడడం వలన మొక్కలు ఈ ఫంగస్ వలన కలుషితం కాకుండా ఉంటాయి. .
వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. శిలీంధ్ర నాశినులు మొక్కలు కలుషితం కాకుండా చేస్తాయి కానీ వీటిని ఆకుల క్రింది భాగంలో పిచికారీ చేయాలి. మాంకోజెబ్, క్లోరోతలోనిల్ లేదా కాపర్ ఆధారిత శిలీంద్ర నాశినులను ఉపయోగించవచ్చు. తెగులు సంక్రమించిన తర్వాత వీడే శిలీంద్ర నాశినులను ఈ తెగులు లక్షణాలను గుర్తించిన వెంటనే ఉపయోగించాలి. సాధారణంగా మొఫెనోక్సామ్, స్ట్రోబిల్లురిన్స్, ఫ్లూపికోలైడ్, ఫేమక్సడోన్+సైమోక్సానిల్ సయజోఫామిడ్ మరియు జక్సామైడ్ లను వాడవచ్చు. వీటిలో కొన్ని ఉత్పత్తులు ఈ ఫంగస్ నిరోధకతను కలిగివుండడం గమనించబడినది.
ఈ లక్షణాలు వాటర్ మోల్డ్స్ సమూహానికి చెందిన స్యుడోపేరోనోస్పోరా కుబెన్సీస్ అనే ఫంగస్ వలన కలుగుతుంది. ఇది జీవించడానికి పచ్చని జీవించివున్న మొక్కల అవసరం ఉంటుంది. నీడతో వున్న చల్లని, తడి మరియు తేమ వాతావరణంలో (భారీ తేమ, పొగ మంచు, నీటి బిందువులు) మరియు 15-23°C ఉష్ణోగ్రతల వద్ద ఇది చాలా అధికంగా నష్టం కలగచేస్తుంది. శీతాకాలంలో తెగులు సోకిన మొక్కల అవశేషాలలో లేదా చిగుర్లలో లేదా ఇతర అతిథేయ మొక్కపై ( పంటలు మరియు కలుపు మొక్కలు) జీవిస్తుంది. అనుకూల పరిస్థితులలో గాలి, సుడిగాలి మరియు వర్షపు చినుకులు దీని బీజాంశాలను ఆరోగ్యంగా వున్న ఇతర మొక్కల కణజాలానికి విస్తరింపచేస్తాయి. ఒక్కసారి ఇవి అతిథేయ మొక్కలపైకి చేరిన తర్వాత ఇవి మొలకెత్తి ఆకుల క్రిందిభాగంలో వుండే సహజ రంధ్రాల నుండి లోపలకు ప్రవేశించడానికి వీలైన నిర్మాణాలను ఉత్పత్తి చేస్తాయి. అప్పుడు ఇవి వ్యాపించడం మొదలుపెట్టి ఆకుల అంతర్గత కణజాలాన్ని మించి పెరిగి ఆకుల పైభాగంలో బూజును వ్యాపింపచేస్తాయి. అక్కడ ఇవి మరిన్ని బీజాంశాలను ఉత్పత్తి చేసి ఈ తెగులును మరింతగా వ్యాపింపచేస్తాయి.