Alternaria alternata
శీలీంధ్రం
లక్షణాలు సాధారణంగా వేసవికాలంలో కనిపిస్తాయి మరియు ఆకులపై 3 నుండి 7 మిమీ వ్యాసం కలిగిన కోణాకారంలో లేదా వృత్తాకార మచ్చలు ఏర్పడతాయి. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో లేదా ఈ వ్యాధి సోకే అవకాశం ఉన్న రకాల్లో, ఇవి 3 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన పొక్కులుగా మారతాయి. ఆకు ఈనెలపై మరియు ఆకు కాడలు మరియు ప్రధాన ఈనెలపై కూడా నల్లటి గాయాలు ఏర్పడతాయి. తీవ్రమైన ముట్టడి ఆకులు వాడిపోయి రాలిపోయేలా చేస్తుంది. అపరిపక్వ పండ్లపై, చాలా చిన్న పరిమాణంలో గోధుమ రంగు లేదా నల్ల మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు పక్వానికి వచ్చిన పండ్లపై కొంత పెద్దవిగా ఉంటాయి (1 నుండి 5 మిమీ వ్యాసం) మరియు చుట్టూ ఎర్రటి వలయం ఉంటుంది. పండ్లపై బూజు వృద్ధి చెందడం ప్రారంభమవుతుంది, ఇది పండ్లు కుళ్లిపోవడానికి దారితీస్తుంది. తెగులు తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ఉత్పత్తి నాణ్యత గణనీయంగా తగ్గుతుంది.
వ్యాధి సోకిన భాగాలను కత్తిరించిన తర్వాత చెట్లు మరియు కోతలపై బోర్డియక్స్ మిశ్రమాన్ని పిచికారీ చేయండి. ప్రత్యామ్నాయంగా, ఆకులు మరియు పండ్లపై వెల్లుల్లి లేదా హార్స్ టైల్ ను రాయండి. మీరు బాసిల్లస్ సబ్టిలిస్ ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించవచ్చు, ఇది ఫంగస్ యొక్క సహజ శత్రువు.
అందుబాటులో ఉన్నట్లయితే నివారణ చర్యలు మరియు జీవసంబంధమైన చికిత్సలతో కూడిన సమీకృత తెగులు నిర్వహణను ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. వేసవి ప్రారంభంలో, పండ్లు పక్వానికి రాకముందు ఈ వ్యాధికి చికిత్సలు ప్రారంభించాలి. థియోఫనేట్-మిథైల్, మానెబ్, రాగి లాంటి క్రియాశీల పదార్ధాలు కలిగిన ఉత్పత్తులు బాగా పనిచేస్తాయి. ముట్టడిని తగ్గించడానికి కనీసం రెండు సార్లు వీటిని వాడాలి. వాడిన సమయం, చెట్టు వయస్సుకి సర్దుబాటు మరియు సిఫార్సు చేయబడిన మోతాదు యొక్క వాడకంపై చికిత్సల ప్రభావం ఆధారపడి ఉంటుంది.
ఆల్టర్నేరియా జాతికి చెందిన మూడు శిలీంధ్రాల సమూహం, ఇతర ఆల్ట్రనేరియా ఆల్టర్నేటా ద్వారా లక్షణాలు కలుగుతాయి. ఇవి మట్టిలో లేదా మొక్కల అవశేషాలపై నిద్రాణస్థితిలో ఉంటాయి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఇవి బీజాంశాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ బీజాంశాలు గాలి, వర్షం ద్వారా చెట్లపైకి రవాణా చేయబడతాయి. అధిక తేమతో కూడిన అధిక ఉష్ణోగ్రతలు, పొగమంచు ఏర్పడటం, వర్షం మరియు ఎండ ఒకదాని తర్వాత మరొకటి రావడం మరియు పోషకాల లోపం పిస్తాపై వ్యాధి వృద్ధి చెందడానికి ప్రధాన కారకాలు. బోట్రియోస్ఫేరియా డోతిడియా వల్ల కలిగే కంకి మరియు చిగురు ఎండు తెగులు లక్షణాలు ఒకేరకంగా ఉండి కన్ఫ్యూజ్ చేస్తాయి. అది ఏ వ్యాధో తెలుసుకోవడానికి, తేమతో కూడిన పరిస్థితులు ఉన్నప్పుడు తెగులు సోకిన ఆకులను రుద్దండి: వేళ్ళు నల్లగా మారినట్లైతే, అది ఆల్ట్రనేరియా ఆల్టర్నేటా వల్ల వచ్చే ఆకు మాడు తెగులు.