ప్రత్తి

ప్రత్తిలో సెర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు

Mycosphaerella gossypina

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ముందుగా ఆకులపై ఎర్రని మచ్చలు ఏర్పడి, క్రమేపి అవి పెద్దవై గోధుమరంగు నుండి ముదురు గోధుమరంగు మచ్చలుగా మారుతాయి.
  • మచ్చలు పెద్దవైన కొద్దీ వీటి అంచులు ఒకదాని తర్వాత ఇంకొక రింగులుగా లేత మరియు ముదురు రంగులో కనపడతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ప్రత్తి

లక్షణాలు

ఈ తెగులు ముదిరిన ఆకులను అధికంగా ప్రభావితం చేస్తాయి. తెగులు సోకిన వెంటనే ఎరుపు రంగు మచ్చలు ఏర్పడి, తెగులు పెరిగే కొద్ది మచ్చలు పెద్దవై మధ్యలో బూడిద రంగు, చుట్టూ ముదురు రంగు వలయాలు కలిగిన మచ్చులు ఏర్పడతాయి. తెగులు సోకిన సమయాన్ని బట్టి ఈ మచ్చలు గుండ్రంగా లేక వివిధ ఆకృతులలో ఉంటాయి. ముదురు మరియు లేత గోధుమ లేదా ఎరుపు అంచులు కలిగిన గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు ఆశించిన ఆకులు రంగు పాలిపోయి, క్రమంగా రాలిపోతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ రోజు వరకు ఈ తెగులుకు జీవ నియంత్రం పద్ధతులు లేవు. మీకు ఏదైనా జీవ నియంత్రం పద్ధతుల వలన మంచి ఫలితాలను కలిగి ఉంటే దయచేసి మాకు తెలియజేయండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ (2 కిలో/హెక్టారుకు) ను 15 రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు వాడాలి. శీలింద్ర నాశినులైన కార్బెండిజెమ్ (3 గ్రా/లీ), కాప్టాన్ (2 గ్రా/లీ) కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.

దీనికి కారణమేమిటి?

ప్రత్తిలో ఈ లక్షణాలు సెర్కోస్పోరా కుటుంబానికి చెందిన మైకోస్పేరియెల్లా గాసిఫినా అనే శిలింద్రం ఆశించటం వలను కలుగుతాయి. ఈ శిలింద్రం సోయాబీన్ లేదా మిరప వంటి పంటలలో భిన్నంగా ఉంటుంది. పొలంలో ఇతర వ్యాధులైన టార్గెట్ స్పాట్ వంటి వ్యాధులలాగా సర్కోస్పోరా లీఫ్ స్పాట్ ను గుర్తించుట కొంచం కష్టం. అతి నీటి ఎద్దడి లేదా పోషక యాజమాన్య లోపాలు (పోటాష్) సంభవించినపుడు ఈ తెగులు వెంటనే రావటానికి ఆస్కారముంది. కావున సరియైన పోషక మరియు నీటి యాజమాన్యం పాటించినట్లయితే ఈ తెగులు లక్షణాలను తగ్గించవచ్చు. అంతేకాక ఇది తెగులు తీవ్రతను కూడా తగ్గిస్తుంది. 20-30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు అధిక తేమ గల వాతావరణం ఈ తెగులుకు అనుకూలం. ఆరోగ్యకరమైన ఆకులకు గాలి ద్వారా లేదా నీటి తుంపరల ద్వారా శిలీంద్ర బీజాలు వ్యాపిస్తాయి.


నివారణా చర్యలు

  • అందుబాటులో వుండే తెగులు తట్టుకునే రోగ నిరోధక విత్తన రకాలను ఎంచుకోవాలి.
  • తెగులు లక్షణాల కోసం పొలాన్ని తరుచు గమనిస్తూ ఉండాలి.
  • తెగులు ఆశించిన మొక్క భాగాలను, మొక్కలను ఏరివేసి పొలానికి దూరంగా కాల్చివేయాలి.
  • మొక్కను ఒత్తిడి నుంచి కాపాడుకొనుటకు సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని (ముఖ్యంగా పోటాష్), సరైన నీటి యాజమాన్య పద్దతులను పాటించాలి.
  • కోత అనంతరం పొలంలో మిగలిన దుబ్బులను లోతుగా పూడ్చి పెట్టాలి మరియు పొలానికి దూరంగా కాల్చివేయాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి