అరటి

అరటిలో మచ్చల తెగులు

Phyllosticta maculata

శీలీంధ్రం

క్లుప్తంగా

  • మసిబారినట్లుండే, సన్నటి (కానీ అప్పుడప్పుడు పెద్ద మచ్చలు), ముదురు గోధుమ రంగు నుండి నల్లటి మచ్చలు ఆకులపై మరియు కాయలపైన ఏర్పడతాయి.
  • ఈ మచ్చలు ఒక గీతవలె గుంపులుగా ఆకు కాడలు, రెమ్మలు, మధ్య ఈనె, ఆకులు మరియు కొమ్మల పైన ఏర్పడుతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

అరటి

లక్షణాలు

ఈ తెగులు వలన ఆకులు మరియు కాయల మీద వివిధ పరిమాణాల్లో ముదురు గోధుమ రంగు నుండి నల్ల మచ్చలు ఏర్పడుతాయి. ఆకు ఉపరితలం మరియు కాయ చర్మం గరకుగా అనిపిస్తాయి. ఈ చిన్న మచ్చలు ఒక మిల్లిమీటర్ కంటే తక్కువ వ్యాసంతో ఉంటాయి. ఈ మచ్చలు ఒక గీతవలె గుంపులుగా రెమ్మలు, మధ్య ఈనె, ఆకులు మరియు కొమ్మలపైన ఏర్పడుతాయి లేదా మధ్య ఈనె నుండి ఆకు కొన వరకు, తరచుగా ఈనెల వెంబడి విస్తరిస్తాయి. పెద్ద మచ్చలు 4 మిల్లీమీటర్ల వరకు వ్యాసం కలిగి ఉంటాయి మరియు చారలుగా కూడా కనిపించవచ్చు. కొన్నిసార్లు ఈ పెద్ద మచ్చల కేంద్రాలు కొంచెం లేత రంగులో ఉంటాయి. ఆకు కాడలపైన, మధ్య ఈనెలు, ఆకులు మరియు పువ్వు రక్షక కవచం మీద మచ్చలు ఏర్పడుతాయి. గెల ఏర్పడిన 2-4 వారాల వరకూ ముందు కూడా కాయలపైన మచ్చలు ఏర్పడవచ్చు. ఎర్రటి-గోధుమ చుక్కల వలే విడివిడి మచ్చలు చుట్టూ ముదురు ఆకుపచ్చ రంగు వలయాలతో నీటిలో నానినట్లు వున్న కణజాలంతో కనిపిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

తెగులు సోకిన ఆకులు బీజం యొక్క ప్రధాన ఆధారం కావడం వలన పంట కోసిన తర్వాత అరటి గెలపై ఒక బ్యాగును ఉంచడం వలన పండ్లకు వ్యాపించకుండా ఇది అడ్డుకుంటుంది. పంట పూత దశలో మరియు మొట్టమొదటి పూత కనబడినప్పుడు లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె (1500 పిపిఎం) (1 గ్రా) సర్ఫ్ తో కలిపి లేదా శాండోవిట్ ను (1 మిల్లీలీటర్ల) రక్షణాత్మకంగా ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సంవత్సరం పొడవునా ప్రతి రెండు వారాలకు ఒకసారి లేదా నెలకు ఒకసారి మానేబ్ ను ఆకులు మరియు కాయలపైన పిచికారీ చేయడం వలన ఈ బీజాంశాలవ్యాప్తిని తగ్గించగలదు. ఫోల్పేట్, క్లోరోతలోనీల్, మాంకోజెబ్, ట్రయాజోల్స్, ప్రొపికోనజోల్ మరియు స్ట్రోబిలూరిన్స్ వంటి శీలింద్ర నాశినులను వారానికి రెండు సార్లు పిచికారీ చేయడం వలన ఈ తెగులుకు వ్యతిరేకంగా మంచి ఫలవంతమైన ఫలితాలను పొందవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ తెగులు లక్షణాలు ఫంగస్ ఫైలోస్టిక్టా మాక్యులాట వలన కలుగుతాయి. ఇది అరటి మొక్కల ఉత్పత్తి చక్రం యొక్క అన్ని దశల్లోనూ మొక్కలను ప్రభావితం చేస్తుంది మరియు దీనిని ఒక 'వెట్ స్పోర్' జీవిగా పరిగణిస్తారు, ఇది నీటి ద్వారా వ్యాపిస్తుంది (వర్షపు చుక్కలు, నీటి బిందువులు, మంచు బిందువులు వంటివి). అరటి మచ్చలు సోకిన మొక్కల పదార్థం మరియు పండ్ల కదలిక ద్వారా వ్యాప్తి చెందుతుంది. మచ్చల చుక్కలు శిలీంధ్ర నిర్మాణాలను కలిగి బీజాంశాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి మొలకెత్తినప్పుడు, ఈ బీజాంశాలు ఫిలమెంట్ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి మొలకెత్తుతునప్పుడు ఈ బీజాంశాలు ఫిలమెంట్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఫిలమెంట్లు మొక్కల కణాల్లోనికి ప్రవేశించి కణాల్లో మరియు కణాల మధ్యన వృద్ధి చెంది కొత్త చుక్కలను లేదా మచ్చలను మొక్కల కణజాలం పైభాగంలో ఏర్పరుస్తాయి. వెచ్చని తేమతో కూడిన వాతావరణంలో పొదిగే కాలం 20 రోజుల కన్నా తక్కువ ఉంటుంది.


నివారణా చర్యలు

  • ఈ తెగులు లక్షణాల కోసం తోటను క్రమం తప్పకుండా గమనిస్తూవుండండి.
  • తెగులు సోకిన మొక్కల భాగాలను తోటకు దూరంగా తీసుకెళ్ళి నాశనం చేయండి.
  • తోటను వేయడానికి తెగులు కారకాలు లేని పొలాన్ని తయారు చేయండి.
  • పరికరాలు, విత్తనాలు మరియు మట్టిలో సరైన పారిశుధ్యం పద్ధతులను పాటించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి